
పశ్చిమ గోదావరి జిల్లా: కూటమ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలకు చేసిన పాలనకు పొంతన లేదని వైఎస్సార్‌సీపీ ఉయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్. బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో బాబు షూరిటీ -మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు బొత్స మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల మెడలు వంచి పాలన చేయించాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టాము. ఐదు కోట్ల మందిపై ప్రమాణం చేసి భవిష్యత్తు గ్యారెంటీ అంటూ బాండ్లు ఇచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇచ్చిన వాగ్దానాలను కూటమీ ప్రభుత్వం నెరవేర్చలేదు. మూడు సిలిండర్లని ఒక సిలిండర్ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితే నాలికమందం అంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు మాయగాడు.. మాయగాడికి తోడు ఒక మోసగాడు తోడయ్యాడు. ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిన ప్రజలను మోసం చేయడమే వారి ఉద్దేశం.
ప్రజలకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లడం కావాలి.. మందు కాదు. చంద్రబాబు ప్రజలకు మందే కావాలని ఆలోచించాడు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఇవ్వలేదుచంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే లోకేష్ 200 అబద్దాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు అతీలేదు గతి లేదు. అడిగితే ఒకరేమో నాలికమందమని ఇంకో ఆయన ఏమో తాటతీస్తాను మక్కెలు ఇరగ కొడుతాను అంటున్నాడు. ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేశారు ఈ రాష్ట్రంలో.. ఇది వాస్తవం. ఆడబిడ్డ నిధి 1500.. ఎప్పటినుండి ఇస్తారు. P-4 పేరుతో అభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.’ అని బొత్స మండిపడ్డారు.