
తూర్పుగోదావరి జిల్లా. మద్యం కేస్ పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ అని, ఇందులో వాస్తవాలు లేవని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మిధున్ రెడ్డి కుటుంబాన్ని అవమాన పరచాలనే ఉద్దేశంతోనేఈ తతంగమంతా జరిగినట్టు అర్థం అవుతుందన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 19వ తేదీ) రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్‌రెడ్డిని ములాఖత్‌లో బొత్స సత్యనారాయణ కలిశారు.
అనంతరం మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వాలు వ్యవస్థను డైవర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం తగదు. రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చివరకు ధర్మం గెలుస్తుంది
ఈ నెల 25 మా నాయకుడు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతాయని సదుపాయాలు కల్పిస్తారని అంచనా వేయనవసరం లేదు. చట్టాన్ని ఒకసారి చేతిలోకి తీసుకుని వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు. అది వారినే దహించి వేస్తుంది. అవాస్తవాలు చెప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న కాలంలో నిజానిజాలు బయటికి వస్తాయి. వ్యక్తులను అవమానపరిచి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని బొత్స ధ్వజమెత్తారు.