
సాక్షి,విజయనగరం: విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం లో పరిపాలన పూర్తి గా గాలికి వదిలేశారు. ఏ ఒక్క వర్గం సంతృప్తి గా లేదు. సూపర్ సిక్స్ అరకొరగా మొదలు పెట్టినా క్లారిటీ లేదు. తల్లికి వందనం పథకంలో ఏడు ఎనిమిది లక్షల మందికి కేంద్రం నుండి డబ్బులు రాలేదని అరకొరగా ఇచ్చారు.
అన్న దాత సుఖీభవ అర్హులకు ఇవ్వలేదు. సాంకేతిక కారణం చెప్పి ఎగ్గొట్టారు.వితంతు పెన్షన్స్ ఇవ్వకుండా కారణాలు చెప్తున్నారు. అర్హులైన వికలాంగులకు పెన్షన్స్ తీసేశారు. అబద్ధాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తే సీఎం, మంత్రులపై చర్యలు తీసుకోవాలి. స్టీల్ ప్లాంటు లో 32 విభాగాలు ప్రైవేట్ పరం చేశారు.
వైఎస్సార్‌సీపీకి ద్వంద వైఖరి లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదే మా నినాదం.స్టీల్ ప్లాంట్ కి 14 వేల కోట్లు ప్యాకేజీ ఇచ్చినప్పుడే మేము అనుమానం వుంది అని చెప్పాం. స్టీల్ ప్లాంట్ అప్పులు తీరాక ప్రైవేట్ చేయాలని పన్నాగం చేస్తున్నారు.సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు స్టీల్ ప్లాంట్ గురుంచి ఎందుకు మాట్లాడటం లేదు’అని ప్రశ్నించారు.
