‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్‌ చోరీ అంటారు’ | YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్‌ చోరీ అంటారు’

Oct 21 2025 4:28 PM | Updated on Oct 21 2025 5:40 PM

YSRCP Leader Kurasala Kannababu Slams Chandrababu

కాకినాడ:   2019 నుంచి 2024  కాలంలో దేశంలో ఎక్కడా జరగని విప్లవాత్మక సంస్కరణలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తే.. దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని  వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు.  దీనినే క్రెడిట్‌ చోరీ అంటారు.. చంద్రబాబు అని కురసాల ఎద్దేవా చేశారు.  

‘గత మరచిపోయిన చంద్రబాబు.. అన్నీ తానే చేశాను అంటున్నారు.వైఎస్ జగన్ చేసిన మంచిని కూటమీ ప్రభుత్వం చోరి చేస్తుంది. చంద్రబాబుకు తోడు ఆయన కొడుకు లోకేష్ నలభై ఆబద్దలు చెబుతున్నాడు. నోరు తెరుస్తే నిజం చెప్పకుండా తండ్రి కొడుకులు పచ్చి ఆబద్దలు ఆడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ,డేటా సెంటర్,పోర్టు లను తామే కొబ్బరి కొట్టి ప్రారంభించినట్లు చెబుతున్నారు‌. 

భోగాపురం ఎయిర్‌పోర్టుకు  కనీసం గత చంద్రబాబు పాలనలో భూసేకరణ చేయ్యలేదు. *సెజ్ భూములను తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్ గా చెప్పుకున్నారు. *దీనికి వంత పాడుతున్న ఎల్లో మీడియా.. సెజ్ భూములను తిరిగి ఇస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.  వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న నన్ను సెజ్ భూములు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమీటికి ఛైర్మన్‌గా నియమించారు.ఆనాడు జీవో నెం : 158 ద్వారా 2180 ఎకరాల సెజ్ భూములను వెనక్కి ఇచ్చేశారు. సెజ్ భూములు తిరిగి ఇవ్వడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ మోమో ఇచ్చింది.  

గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన జీవోను అమలు చేయ్యమని ఆ మోమో లో ఉంది. గత టిడిపి పాలనలో సెజ్ పోరాట కమీటి నాయకులను గృహనిర్భం చేశారు. ఉద్యమకారులపై పోలీసులతో దమణకాండ చేసి...  అక్రమ కేసులు పెట్టించారు. జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని హమీ ఇచ్చారు చంద్రబాబు. సెజ్ కోసమే భూసేకరణ ముఖ్యం.. గ్రామలు ఎలా పోయిన పర్వాలేదని ఆనాడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  

ఏపీ లో వదిలేయగా లేనిది..మా భూములు ఇవ్వాలని 16 రాష్ట్రాలకు సంబంధించిన సెజ్ భూముల కేసులు సుప్రీం కోర్టులో నడుస్తున్నాయి. 158 జీవో ద్వారా స్ధానికులకు 78% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాం...దానిని అమలు చేయ్యండి. సెజ్ రైతులపై చంద్రబాబు సర్కార్ బనాయించిన అక్రమ కేసులను జగన్ ఎత్తివేశారు.వాటిలో ఇంకా ఉన్న  కొన్ని కేసుల ఇప్పుడు ఎత్తివేయ్యండి. దీవీస్ తీసుకున్న ఎస్సైన్డ్ భూములు ఎకరాకు రూ.10 లక్షలు రైతులకు  ఇప్పించారు. 

Kannababu:  క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు

జిఎంఆర్ రూ. 300 కోట్లు, కేవీ రావ్ 600 కోట్లు రుణాలు తెచ్చారు. శ్మసానాలు,చెరువులను కూడా సేకరించారు. వాటిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపరు. క్రెడిట్ చోరి తప్పా...మరో ఆలోచన చంద్రబాబుకు లేదు. సెజ్ లో జరిగిన తప్పులపై చర్యలు తీసుకోండి. కూటమి ప్రభుత్వం లో పబ్లిసిటీ పీక్...పనిలో వీక్. కార్పోరేట్ కంపెనీలు అంటే...జీ హుజీర్ అంటూ చంద్రబాబు సాగిలపడిపోతాడు’ అని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement