మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ | Pithapuram Varma Responded To Minister Narayana Comments | Sakshi
Sakshi News home page

మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ

Oct 16 2025 8:22 PM | Updated on Oct 16 2025 8:32 PM

Pithapuram Varma Responded To Minister Narayana Comments

సాక్షి, కాకినాడ: మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీకి నేనెప్పుడూ ఫైర్‌ బ్రాండేనన్న వర్మ.. మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ, గడ్డి పరక అంటే నాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసునన్నారు.

కాగా, టెలి కాన్ఫరెన్స్‌లో  రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదా­లున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అస­హ­నంగా ఉన్నారన్నారు. తనను నియోజక­వర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచు­కోకపోతే సహించేదిలే­ద­న్నారు.

నీ నియోజకవర్గంలో పార్టీ నేత­లను ఎందుకు కంట్రోల్‌ చేయలేక­పోతు­న్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రో­జు­లకు చిన్న ఇష్యూలు వస్తే పవన్‌­కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మాట్లా­డు­కుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొ­న్నారు.

మనోహర్‌ తనకు ఫోన్‌ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా..  అంటూ అడి­గా­ర­న్నారు. మీ నియోజకవర్గంలో నాయ­కులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్‌మెంట్‌ను డీగ్రే­డ్‌ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడ­టంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా?  అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ  తిట్టడం వచ్చు.. కేకలే­యడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫ­రెన్స్‌లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement