కాకినాడ జిల్లా: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చెయ్యాలనే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈరోజు( శుక్రవారం, అక్టోబర్ 10) కాకినాడలో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమ పోస్టర్‌ను కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గత ప్రభుత్వంలో 17 కళాశాలల్ని తీసుకువచ్చి ..ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌ది. పేదల పక్షాన జగన్... కార్పొరేట్ సంస్ధల పక్షాన చంద్రబాబు ఉంటారని ప్రజలకు తెలుసు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుకూలంగా మద్దత్తు కూడకట్టాలి నిర్ణయించారు. రచ్చ బండ కార్యక్రమం ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తాం. మేధావులు,తటస్ధుల వద్దకు వెళ్ళి మెడికల్ కళాశాలల్ని అమ్మేయ్యడం ఎంత దుర్మార్గమో చెబుతాం. నిన్న జగన్ పర్యాటనలో ప్రభుత్వ తీరు బ్రిటిష్ పాలనను మించిపోయింది. ఎన్నో రకాలుగా జగన్ పర్యటనను ఫెయిల్ చేయ్యలని చూశారు. ఎప్పుడు లేనంతగా జగన్ కోసం జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. మలమూత్రాలు కలిసిన నీళ్ళు తాగాల్సిన దుస్ధితి గిరిజన హస్టల్స్ లో ఉండడం దుర్మార్గం. గిరిజన విద్యార్ధులకు త్రాగునీరు అందించలేని చంద్రబాబు విజన్ 2027 అంటున్నాడు.* క్వాంటమ్ వ్యాలీ అంటూ కాలయాపన చేస్తున్నాడు.

పాడేరు లో ఒక మెడికల్ కళాశాల నిర్మించాలనే ఆలోచన 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కు ఎందుకు రాలేదు. *చంద్రబాబు కు అమ్మేయడం...దోచుకోవమే తెలుసు. మేము వస్తే రూ.99 లకు క్యాటర్ బాటిల్ ఇస్తామని చంద్రబాబు చెప్పాడు..ఇప్పుడు 99 పైసలకే ఎకరం భూమి ఇస్తున్నాడు. ఒక ప్రతిపక్ష నేతగా...పార్టీ అధ్యక్షుడుగా వైఎస్ జగన్ విశాఖ వస్తే.. పోలీసు అధికారులు కూటమీ నేతల్లా మాట్లాడారు. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి. 2029 లో వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని పోలీసు అధికారులు గుర్తించండి’ అని హెచ్చరించారు.


