ఫైల్‌ఫోటో
కాకినాడ: 65 రోజుల కిందట కాకినాడ జిల్లాలోని సీహెచ్ అగ్రహారంలో ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లి దండ్రులు నేటికి ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ కూతురు ఎలా తప్పిపోయిందో అలానే ఇంటికి తిరిగి వచ్చేస్తే బాగుండు అనుకుంటూ కోటి ఆశలతో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు తమ కుమార్తెను ఎవరో వెంట తీసుకు వెళ్లిపోయారనే అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి భవాని.. కూతురి ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటోంది.
చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి కొత్తగా వచ్చిన అతిధి
అయితే వారి ఇంటికి ఓ అతిథి కొత్తగా వచ్చింది. జ్ఞానేశ్వరి తో పాటుగా వెంట వెళ్ళి మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చి కుక్క చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురు జ్ఞాపకాల నుంచి ఉపశమనం పొందడానికి మరో కుక్కను తెచ్చుకున్నారు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు. *జ్ఞానేశ్వరి ముద్దు పేరైనా "జాను" పేరును కుక్క కు పెట్టారు చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు భవానీ, గణేష్‌లు.
కాగా, కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో ఈ ఏడాది జూన్ 6వ తేదీన అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదా బలమైన క్లూ లభించలేదు.


