సీలేరు నదిలో అరుదైన చేప | Rare Silver Carp Found In Sileru River, Surprising Local Fishermen In Alluri Sitharama Raju District | Sakshi
Sakshi News home page

సీలేరు నదిలో అరుదైన చేప

Aug 9 2026 1:37 PM | Updated on Aug 9 2026 2:50 PM

 Seeleru River Rare Silver Carp Fish Caught By Fisherman

అల్లూరి సీతారామరాజు జిల్లా : తూర్పు కనుమల మధ్య ప్రవహించే సీలేరు నదిలో శనివారం అరుదైన చేప మత్స్యకారుడి వలకు చిక్కింది. సుమారు మూడు కిలోలకు పైగా బరువున్న ఈ చేపను స్థానికులు సిల్వర్‌ కార్ప్‌గా గుర్తించారు. సాధారణంగా ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా, తూర్పు ఆసియా ప్రాంతాలకు చెందిన ఈ మంచినీటి చేప ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పెంపకంలో ఉంది. సీలేరు నదిలో ఈ జాతి చేప కనిపించడం అరుదుగా భావిస్తున్నామని స్థానిక మత్స్యకారులు తెలిపారు.

 వెండి రంగులో మెరిసే శరీరం ఈ చేపకు ప్రత్యేక ఆకర్షణ. శరీరం పైభాగంలో లేత ఆకుపచ్చ లేదా బూడిద రంగు కనిపిస్తుంది. వేగంగా పెరిగే ఈ చేపలు సాధారణంగా మూడు నుంచి నాలుగు కిలోల వరకు బరువు పెరుగుతాయి. తలపై పొలుసులు ఉండవు.సాధారణంగా 6 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న మంచినీటిలో ఇవి జీవిస్తాయి. లభ్యమైన చేప మూడు కిలోల బరువు ఉంది.

 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement