మెడికో ప్రియాంక కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ | Sp Narasimha Kishore Press Meet On Rajahmundry Priyanka Incident | Sakshi
Sakshi News home page

మెడికో ప్రియాంక కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ

Aug 9 2026 2:02 PM | Updated on Aug 9 2026 2:02 PM

Sp Narasimha Kishore Press Meet On Rajahmundry Priyanka Incident

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ప్రియాంక ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీ రాత్రి 10 గంటలకు మెడికల్ సమాచారం వచ్చింది.

..వెంటనే ప్రకాష్ నగర్ పీఎస్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ముందస్తు సమాచారంతో కేసు నమోదు చేశాం. ఆ మర్నాడు ఉదయానికి కల్లా నిందితులను గుర్తించాము. నిందితులు బైక్ మీద ఉన్న  ప్రియాంకను మూడు సార్లు కారుతో ఢీకొట్టారు. ఇద్దరు నిందితులను విచారించి ఆరో తేదీన అరెస్ట్ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.

‘‘గ్యాస్‌ కనెక్షన్‌ ఆధారంగా నిందితులను గుర్తించాం. నిందితులు మాల్‌లో కొందరితో ఘర్షణ పడ్డారు. ప్రియాంకది రోడ్డు ప్రమాదం కాదు.. క్రిమినల్‌ చర్య. ప్రియాంక ఫ్రెండ్‌ ఉమేశ్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశాం. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ప్రియాంక తండ్రికి ఈ కేసు విచారణపై బ్రీఫ్ చేశాం. నిందితులను పోలీసు కస్టడికీ తీసుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తాం. ఘటన తరువాత ఒక చోటకు వెళ్లి నిందితులు  పడుకున్నారు. నిందితులపై గతంలో కేసులు లేవు. నిందితులపై బీఎన్‌ఎస్‌ 110 సెక్షన్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement