సాక్షి, విజయవాడ: మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె సైరన్‌కు పిలుపునిచ్చారు. రేపటి నుంచి విజయవాడ మున్సిపల్ పరిధిలో పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం రూ. 350 కోట్ల మేర బిల్లులు బకాయి ఉంచిన నేపథ్యంలో సమ్మెకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మోతో రోడ్లు ,డ్రైనేజీ.. వాటర్ సప్లై పనులకు బ్రేక్ పడనుంది.
గత 10 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ఉన్న 350 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సమ్మెకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


