
సాక్షి,విశాఖ: ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో చాలా సవాళ్లు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ పెద్ద సమస్య. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేం. డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కూడా భాగస్వామిగా ఉందని’ వ్యాఖ్యానించారు.
అంతకుముందు విశాఖలో గూగల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టారు.
👉ఇదీ చదవండి: చారాణా కోడికి బారాణా మసాలా
మూడు రోజుల క్రితం విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. ‘ నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయానేది సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, గూగల్ సంస్థలో ఉద్యోగాలపై చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది.
