breaking news
google data
-
గూగుల్‌తో ఎంవోయూ ఓ రహస్యం!
సాక్షి, విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం ముందునుంచీ నిజాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గూగుల్‌తో ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూకి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ‘ఈ వివరాలు ఇవ్వకూడదు. కాన్ఫిడెన్షియల్’ అంటూ సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు బాబు ప్రభుత్వం చెబుతున్న గూగుల్ డేటా సెంటర్ ఎంవోయూ వివరాలు ఇవ్వాలంటూ అనకాపల్లి జిల్లాకు చెందిన బుద్దా చక్రధర్ గత నెల 4న ఏపీఐఐసీకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర సచివాలయం అసిస్టెంట్ సెక్రటరీ పేరుతో ప్రభుత్వం పోస్టు ద్వారా పంపిన జవాబు శనివారం చక్రధర్‌కు చేరింది. ‘ఈ ఎంవోయూ వివరాలు చాలా రహస్యంగా ఉంచాలి’ అని స్పష్టంచేసింది. దీనిపై మానవ హక్కుల వేదిక, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. డేటా సెంటర్ ఒప్పందాన్ని గేమ్‌చేంజర్‌గా చెబుతున్న ప్రభుత్వం.. అసలు ఎంవోయూ విషయాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. స.హ.చట్టం ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన!ఎంవోయూ వివరాలు ఇవ్వకుండా సమాచార హక్కు చట్టం–2005 ప్రాథమిక సూత్రాలను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించినట్లేనని మానవహక్కుల వేదిక ఏపీ, తెలంగాణ కో–ఆరి్డనేషన్ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ, యూఎఫ్ఆర్టీఐ కో–కన్వీనర్ చక్రధర్ వ్యాఖ్యానించారు. -
ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!
-
జీవో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు..'ఔను.. అదానీనే'!
రెండు నెలల క్రితం..రూ.లక్ష కోట్లకుపైగా భారీ పెట్టుబడులతో విశాఖకు గూగుల్ వస్తోంది..! మేమే తీసుకొస్తున్నాం.. డేటా సెంటర్ ఏర్పాటు ఘనత మాదే!రెండు రోజుల క్రితం..అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ప్రాజెక్టు. గూగుల్‌కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి అదానీకి బదలాయిస్తున్నాం. గూగుల్‌కు ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్ అదానీకి వర్తింప చేస్తున్నాం.– గూగుల్ రాకపై చంద్రబాబు సర్కారు విన్యాసాలివీ! గూగుల్‌కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో సాక్షి, అమరావతి: గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన జిమ్మిక్కులు, సంకుచిత వైఖరి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వెలువరించిన జీవోల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో వెల్లడించింది. అంతేకాదు... గతంలో గూగుల్‌కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని తిరిగి అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్‌తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమైన విషయం తెలిసిందే. డేటా సెంటర్ ఏర్పాటుపై తొలుత ఈ ఏడాది అక్టోబర్‌లో ఆగమేఘాలపై జీవో ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. స్వయంగా గూగులే దీన్ని నిర్మిస్తోందని, ఈ ప్రాజెక్టు మొత్తం గూగుల్ సంస్థే ఇప్పటికిప్పుడు కొత్తగా చేపడుతోందనే భ్రమలు కల్పించింది. ఇక యథావిధిగా ఎల్లో మీడియా దీనికి కోరస్ పాడుతూ అదొక ప్రపంచ ఈవెంట్ మాదిరిగా చిత్రీకరించింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో రక్తి కట్టించిన ఈ నాటకం అంతా డ్రామా అని తాజాగా ప్రభుత్వ జీవోలే వెల్లడిస్తున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అబద్ధాలు ఆడటం.. ఇంతటి ఘరానా మోసం.. ప్రజలకు ఎలా తప్పుడు సమాచారం ఇస్తున్నారో చెప్పేందుకు ఇదొక క్లాసిక్ కేస్ స్టడీగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా అబద్ధాలాడతారనేందుకు విశాఖ డేటా సెంటర్లే నిదర్శనమని పేర్కొంటున్నారు. చంద్రబాబు బృందం క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఎంతటి అబద్ధాలైనా ఆడగలదని, ఆత్మసాక్షిని మోసగించి వంచనకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నొయిడాలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం 4.64లక్షల చదరపు అడుగులను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందని 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. , గూగుల్‌తో కలిసి విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు అదానీ.. గూగుల్ సంస్థ భాగస్వామేవిశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు తొలుత అడవివరం–ముడసర్లోవ వద్ద 120 ఎకరాలు, ఆనందపురం మండలం తర్లువాడ వద్ద 200 ఎకరాలు, రాంబిల్లి వద్ద 160 ఎకరాలను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్‌కు కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రెడిట్ చోరీలో భాగంగానే అదానీ పేరును దాచిపెట్టి కేవలం రైడెన్ టెక్ పేరుతో జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గూగుల్ అధికారిక భాగస్వామిగా అదానీ వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదానీ గ్రూపును గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ వ్యాపార భాగస్వామిగా చంద్రబాబు సర్కారు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.ఆ భూములను అదానీకి బదలాయించండి..ఏపీఐఐసీ కేటాయించిన ఆ 480 ఎకరాలను అదానీ గ్రూపు తదితర సంస్థల పేరిట బదలాయించాల్సిందిగా గూగుల్ కోరింది. తర్లువాడ, అడవివరం–ముడసర్లోవలో కేటాయించిన భూములను అదాని పేరిట అంతర్గతంగా బదలాయించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ బదలాయింపు రైడెన్, అదానీ మధ్య అంతర్గత ఒప్పందం ద్వారా జరుగుతుందని వివరించింది. ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్‌గా ఉన్న అదానీకి గూగుల్‌కు ఇచ్చిన అన్ని రాయితీలను వర్తింప చేస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించడం గమనార్హం. సీఐఐ సదస్సు సాక్షిగా తేల్చి చెప్పిన అదానీ..విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 14న ఢిలీల్లో ఎంవోయూ కుదుర్చుకున్న సమయంలో అదానీ పేరును చంద్రబాబు సర్కారు కనీసం ప్రస్తావించలేదు. దాదాపు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న అదానీ పేరు ఎక్కడా చెప్పకుండా చంద్రబాబు దాగుడుమూతలు ఆడారు. అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తాము ఆ డేటా సెంటర్లో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా తాము గూగుల్‌తో కలసి 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.ఆ డేటాసెంటర్.. జగన్ నాటిన మొక్కసంకుచిత బుద్ధితోనే అదానీ పేరెత్తని బాబుచంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కృషి, చొరవతో సాకారమైన డేటా సెంటర్ క్రెడిట్‌ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఏ విధంగా వేసుకున్నాడన్న విషయాన్ని వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టారు. డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని, తద్వారా గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ వస్తాయన్నారు. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటు పనులకు వైఎస్ జగన్ ప్రభుత్వమే అంకురార్పణ చేసింది. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన జీవో సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ భూములను అదానీ పేరు మీదకు బదలాయించడమే దానికి తార్కాణం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్‌లో అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాల్సి ఉన్నందున దీనిపై 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి గూగుల్‌తో అదానీకి వ్యాపార అనుబంధం ఉంది. నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్‌ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 2022 అక్టోబర్ 11 లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఆ డేటా సెంటర్ కోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్‌ను అసలు తాము నిర్మించడం లేదని, దీన్ని అదానీ గ్రూపే నిర్మిస్తుందని, ఆ భూమిని కూడా అదానీకే కేటాయించాలంటూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు అక్టోబర్‌లో లేఖ రాయడం గమనార్హం. చంద్రబాబును కలిసిన గౌతమ్ అదానీసాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించారు. -
క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
-
చంద్రబాబు దిగిపోయాకే పెరిగిన ఐటీ ఎగుమతులు
-
గూగుల్ డేటా సెంటర్.. చంద్రబాబు రోల్ నిల్..
-
YS Jagans: నీ సుందరమైన మొహం చూసి గూగుల్ వచ్చిందా?
-
విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి,విశాఖ: ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో చాలా సవాళ్లు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ పెద్ద సమస్య. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేం. డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కూడా భాగస్వామిగా ఉందని’ వ్యాఖ్యానించారు.అంతకుముందు విశాఖలో గూగల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. 👉ఇదీ చదవండి: చారాణా కోడికి బారాణా మసాలామూడు రోజుల క్రితం విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. ‘ నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయానేది సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, గూగల్ సంస్థలో ఉద్యోగాలపై చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది. -
గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా తప్పించుకోండి!
గూగుల్ మీ కదిలకలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది అనే విషయం మీకు తెలుసా? మీరు షాపింగ్ కోసం ఏదైనా సేర్చ్ చేసిన, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిన, మీరు యూట్యూబ్ లో వీడియొలు చూసిన ఇలా ప్రతి చిన్న విషయాన్ని గూగుల్ మన కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాక్ చేయడం ద్వారా మన అభిరుచులు, ఇష్ట ఇష్టాలు తెలుసుకొని దానికి తగిన విదంగా ప్రకటనలు అందజేస్తుంది. ఎక్కువ శాతం మన డేటాను ప్రకటనల కోసం వాడుకుంటుంది. అలాగే, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని హెచ్చరిస్తుంది. మీ ప్రతి కదలికలను గమనించకూడదు అంటే మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మై యాక్టివిటీ గూగుల్ స్పెసిఫిక్ పేజీని సందర్శించాల్సి ఉంటుంది. అసలు మై యాక్టివిటీ అంటే ఏంటి? మీరు గూగుల్ నుంచి సేకరించిన సమాచారన్ని మొత్తం చూసేందుకు ఇక్కడే నిక్షిప్తమై ఉంటుంది. గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది. దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయి.ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తుంటాయి. డిలీట్ చేయడం ఎలా? ఈ రోజుల్లో ఆన్లైన్ ప్రపంచంలో విహరించే వాళ్లకు దాదాపు జీ-మెయిల్ ఉంటుంది. అంటే మీకు గూగుల్‌లో ఒక ఖాతా ఉందన్నమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో ఈ ఖాతా అనుసంధానమై ఉంటుంది. గూగుల్‌లో మీరు ఏం వెతికినా, ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది. ఈ డేటాను తొలగించాలంటే మేను బార్ లో "డిలీట్ యాక్టివిటీ బై" అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఒక స్పెసిఫిక్ డే నుంచి గత వారం, గత నెల, మొత్తం డేటాను ఎప్పటికప్పుడు తొలగించే ఆఫ్షన్‌ను ఎంచుకోవచ్చు. యూట్యూబ్‌లో మీరు వెతికే ప్రతి వీడియో సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. ఈ చరిత్రను కూడా సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ లింక్‌పై క్లిక్ చేయండి. ఎడమ వైపున "హిస్టరీ" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ", "క్లియర్ వాచ్ హిస్టరీ" వాటిని ఎంచుకోవాలి. లేదా మీరు కోరుకున్న సమాచారాన్ని డిలీట్ చేయొచ్చు. అలాగే, లొకేషన్ హిస్టరీ కూడా గూగుల్ ట్రాక్ చేయకుండా నిలిపివేయవచ్చు. ఇలా ప్రతి విషయాన్ని గూగుల్ ఏమి ట్రాక్ చేయాలో, వద్దో అనేది మనం నిర్ణయించుకోవచ్చు. మీరు మీ డేటాను తొలగించిన మాత్రాన ప్రకటనలు మాత్రం ఆగిపోవు. కానీ, మీ డేటాను డిలీట్ చేయడం వల్ల సైబర్ నెరగాళ్ల భారీన పడకుండా ఉంటుంది. చదవండి: ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ రికార్డు! -
వెంటాడే గూగుల్ నిఘా
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మీపై నిఘా పెడుతోందా? మీరు వద్దన్నా సరే మీ రాకపోకలు, మేసేజ్‌లు అన్నింటిని రికార్డు చేస్తోందా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. తమ ప్రయాణ వివరాలు రికార్డు చేయవద్దని సెట్టింగ్స్ పెట్టినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల సమాచార సేకరణను ఆపడంలేదు. అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ సంచలనాత్మక విషయం వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా పౌరుల సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు. ‘గూగుల్ మ్యాప్స్’ వాడేటప్పుడు యూజర్ ఉన్న లొకేషన్ తెల్సుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలా చేస్తే ప్రజలు ఫోన్‌తో ఏ చోట్లకెళ్లారు? అక్కడ ఎంతసేపున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది. అయితే ఇది ఇష్టం లేని యూజర్ల కోసం ‘లొకేషన్ హిస్టరీ ఆప్షన్’ను ఆఫ్ చేసే సౌకర్యాన్ని గూగుల్ తెచ్చింది. దీన్నివాడితే యూజర్లు ఎక్కడున్నారో రికార్డు కాదని గూగుల్ చెప్పింది. తాజాగా పరిశోధకులు ఇది అబద్ధమని తేల్చారు. లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేసినా కొన్ని గూగుల్యాప్స్ కస్టమర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తున్నాయని తేల్చారు. గూగుల్ మ్యాప్ యాప్‌ను ఒక క్షణం ఓపెన్ చేసినా స్క్రీన్ షాట్ ఆటోమేటిక్‌గా గూగుల్ తీసేసుకుంటోందని పరిశోధకులు తెలిపారు. ఆటోమేటిక్‌గా వాతావరణం గురించి చెప్పే యాప్స్ కూడా యూజర్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని గూగుల్‌కు పంపిస్తూనే ఉంటాయి. లొకేషన్‌కు సంబంధం లేని మరికొన్ని యాప్స్ అయితే కేవలం 30 సెం.మీ కచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని గూగుల్‌కు అందజేస్తున్నాయి. 200 కోట్ల మందికి పైగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ రికార్డు చేసిందన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్ వారి సమాచారాన్ని దొంగతనంగా సేకరించిందని ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వేర్వేరు మార్గాల్లో తాము యూజర్ల సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్ ప్రతినిధి చెప్పారు. యూజర్లు myactivity.google.com ద్వారా తమ సెర్చింగ్లు, ఇతర వివరాలను చూసుకోవచ్చు. -
మంత్రిగారు గూగుల్ చూసి చెప్పారట!!
వైద్య ప్రముఖులు చెప్పేదాని కంటే గూగులమ్మ చెప్పే విషయాల మీదే ఆరోగ్య మంత్రికి నమ్మకం ఎక్కువట. చికన్‌గున్యా వల్ల మరణాలు సంభవించవని, అలాగని గూగుల్ తనకు చెప్పిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెబుతున్నారు. అందుకే ఢిల్లీవాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆ లక్షణాలు కనపడితే జాగ్రత్తలు తీసుకుని, ఆస్పత్రికి వెళ్తే చాలని చెప్పారు. అక్కడ వైద్యులు చెబితేనే ఆస్పత్రిలో చేరాలి తప్ప లేకపోతే అక్కర్లేదన్నారు. ఢిల్లీలో ఒకే ఆస్పత్రిలో నలుగురు పేషెంట్లు చికన్ గున్యాతో చనిపోయారని.. మరి దానిగురించి ఏమంటారని ప్రశ్నిస్తే, ప్రపంచంలో ఎక్కడా చికన్ గున్యా మరణాలు లేవని.. కేవలం ఢిల్లీలో ఒక ఆస్పత్రిలోనే ఎందుకు ఉంటున్నాయని ఎదురు ప్రశ్నించడంతో పాటు వాళ్లు అప్పటికే వయసుమీరి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్లు తన విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు.


