
విశాఖ: టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీ కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడరని, మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమి అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘ టిడిపి నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది. దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేశారు. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి.
కృపాలక్ష్మి నిజాలు మాట్లాడితే ఆమెపై దాడి చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు కాలకేయుల్లా ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళ నేత వీడియోలు తీయించాడు..డబ్బులు ఎరచూపి వీడియోలు తీయించారని కోట వినూత ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన వారిపై పోలీసులను ఉపయోగించడం లేదు. సుగాలి ప్రీతి తల్లిని నిర్బంధించడానికి మాత్రం పోలీసులను వాడుతున్నారు.
సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని పవన్ ఓట్లు దండుకున్నారు.సుగాలి ప్రీతి కేసును సిబిఐకు ఇస్తామని ఎన్నికలకు ముందు పవన్ మాట్లాడారు. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత బాబు పవన్ కళ్యాణకు లేదా?, సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారు సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారుమారయ్యాయి..?, ఎన్నికల్లో ఓట్ల కోసం సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారు. జడ్పీ చైర్పన్ ఉప్పాల హారికపై టిడిపి గుండాలు దాడి చేశారు. కేసు పెడితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహిళల పట్ల తప్పులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి.
