సాగరం సాక్షిగా సాహస విన్యాసం
ఏయూ క్యాంపస్: సాగరం సాక్షిగా సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. కదన రంగాన్ని కళ్ల ముందు ఆవిష్కరించారు. భారత నావికాదళ సమన్వయం, సమర్థతకు ఈ ప్రదర్శన వేదికగా నిలిచింది. బీచ్ రోడ్డులోని రామకృష్ణ బీచ్ ప్రాంగణం వద్ద శనివారం సాయంత్రం భారత నావికా దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు నగరవాసులను, పర్యాటకులను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయి, ఆకాశంలో రివ్వున ఎగురుతూ యుద్ధానికి సిద్ధం అన్న విధంగా దూసుకు వెళుతున్న లోహ విహంగాలు, నేలపైన సమరానికి సయ్యంటూ పరుగులు తీసిన యుద్ధ ట్యాంకులు ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపే విధంగా నమూనా విన్యాసాలు సాగాయి. భారత నావికాదళ అమ్ముల పొదలో ఉన్న అనేక యుద్ధ విమానాలు హెలికాప్టర్లు చేసిన సింక్రనైజ్డ్ విన్యాసాలు దేనికదే సమయపాలన, సమన్వయాలకు ప్రతీకలుగా నిలిచాయి. విశాఖ వేదికగా జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన నావికాదళ విన్యాసాలు పర్యాటకులను నగరవాసులను అమితంగా ఆకట్టుకున్నాయి భారతదేశ నావికాదళ బలాన్ని, దేశభద్రతలో చేస్తున్న సేవను ప్రతిబింబించే విధంగా ఈ సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. ఐఎఫ్‌ఆర్‌కు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రధాన వేదికతో సహా ఇతర ఏర్పాట్లు వేగం పుంచుకున్నాయి. సిటీ పరేడ్ జరిగే సాగరతీరం అంతా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. దీనిలో భాగంగా తీరాన్ని జల్లెడపడుతున్నారు. పోలీసు జాగిలాలలో అణువణువు తనిఖీ చేస్తున్నారు.
సాగరం సాక్షిగా సాహస విన్యాసం
సాగరం సాక్షిగా సాహస విన్యాసం
సాగరం సాక్షిగా సాహస విన్యాసం


