
సాక్షి,విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయితీ చేరింది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పవన్‌కు జనసేన నేతల ఫిర్యాదు చేశారు.
సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్‌కు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులపై పవన్ స్పందించారు. కూటమి నేతల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ..డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలపాలని అధికారులకు ఆదేశాలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి ..పవన్ ఆదేశించారు.
