విశాఖపట్నం: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి పాలనలో అనని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శంచారు. ఈరోజు(ఆదివారం, జనవరి 4వ తేదీ) విశాఖ నంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ..‘ కూటమి నేతలకుఉ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. కూటమి పాలనలో అంతా ఇబ్బందులు పాలవుతున్నారు.
రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల దగ్గర మాత్రం యూరియా ఉంటుంది. దాన్ని వార బ్లాక్ మార్కెట్‌లో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారు.
కూటమి నేతలు బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడగా యూరియా అమ్ముతున్నారు. పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించింది తక్షణమే ప్రభుత్వం పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.
ఆ క్రెడిట్ కచ్చితంగా వైఎస్ జగన్‌దే
భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ ముమ్మాటికీ వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు బొత్స సత్యనారాయణ. ‘ భూ సేకరణ జగన్ చేశారు. నిధులు కేటాయించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రారభోత్సవానికి నేను వెళ్లాను. అప్పుడు ప్రభుత్వ పెద్దలు జీఎంఆర్‌న అభినందించారు.
ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు జీఎంఆర్ పేరు ఎందుకు చెప్పడం లేదు?, విశాఖ మాస్టర్ ప్లాన్ ఏమైంది..?, ఎందుకు ఫైనల్ చెయ్యడం లేదు..?. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే..కనెక్టింగ్ రోడ్స్ పూర్తయ్యేవి. రాష్ట్రంలో అమ్మాయిలు మిస్సింగ్ అని అన్నారు. ఒక్క అమ్మాయిని అయినా తీసుకొచ్చారా..?, ఉత్తరాంధ్ర ఎప్పుడూ సురక్షితమే. ఈ మధ్య కాలంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి’ అని మండిపడ్డారు.


