పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్ | Pahalgam Attack Pakistan PM Shehbaz Sharifs YouTube Channel Blocked in India | Sakshi
Sakshi News home page

పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్

May 2 2025 6:26 PM | Updated on May 2 2025 7:05 PM

Pahalgam Attack Pakistan PM Shehbaz Sharifs YouTube Channel Blocked in India

జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రధాన మంత్రి 'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను శుక్రవారం భారతదేశంలో బ్లాక్ చేశారు.

కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించిన తర్వాత ఈ ఖాతాలను బ్లాక్ చేశారు. వీటిలో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్‌వై న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి. రెచ్చగొట్టే.. మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు మాత్రమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రసారం చేసినందుకు ఈ ఛానెల్‌లను నిషేధించారు.

'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను బ్లాక్ చేయడంతో పాటు.. గాయకుడు అతిఫ్ అస్లాం, క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజం, నటుడు ఫవాద్ ఖాన్, హనియా అమీర్, మహిరా ఖాన్‌లతో సహా అనేక మంది పాకిస్తాన్ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు కూడా సస్పెండ్ చేశారు.

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత.. భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం మాత్రమే కాకుండా, అటారీ-వాఘా స‌రిహ‌ద్దును కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌ గగనం తలంలో పాక్‌ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement