17 ఏళ్ల బాలుడికి ర్యాపిడో బైక్‌పై లైంగిక వేధింపులు.. ఆ తర్వాత.. | Uttar Pradesh boy alleges harassment during Rapido ride | Sakshi
Sakshi News home page

17 ఏళ్ల బాలుడికి ర్యాపిడో బైక్‌పై లైంగిక వేధింపులు.. ఆ తర్వాత..

Aug 15 2026 6:18 PM | Updated on Aug 15 2026 6:57 PM

  Uttar Pradesh boy alleges harassment during Rapido ride

లక్నో: ఓ బాలుడి(17)కి ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ చేతిలో భయానక అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లో రాపిడో బైక్ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ ఆ బాలుడు ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన తర్వాత ర‍్యాపిడో కంపెనీ స్పందిస్తూ.. సదరు డ్రైవర్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా నిషేధించినట్లు తెలిపింది. ఓ జాతీయ మీడియాతో ఆ టీనేజర్ మాట్లాడుతూ వివరాలు తెలిపాడు.

వీడియోలో ఏముంది?
వీడియోలో ఆ టీనేజర్ వెనుక సీటులో కూర్చుని ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ అకస్మాత్తుగా తన చేతిని వెనక్కి చాచి ప్రయాణికుడి వైపు తీసుకెళ్లడం కనిపిస్తుంది. వెంటనే టీనేజర్ ఆ వ్యక్తి చేతిని తొలగించాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్‌ టీనేజర్ కాలు, తొడను తాకేందుకు ప్రయత్నించాడు. టీనేజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రాపిడోను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. దానికి “మైనర్ బీటీవీ” అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో జరిగినట్లు టీనేజర్ తెలిపాడు.

ర్యాపిడో ఏమంది?
కంపెనీ మొదట చేసిన మెసేజ్‌లో... “హాయ్.., మీ ద్వారా ఈ విషయం గురించి తెలుసుకోవడం మాకు నిజంగా ఆందోళన కలిగించింది. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలాంటి ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. తక్షణ చర్య తీసుకునేందుకు, దయచేసి రైడ్ ఐడీ, మీ మొబైల్ నంబర్‌ను మాకు డీఎం ద్వారా పంపించండి” అని పేర్కొంది.

తర్వాత ర‍్యాపిడో స్పందిస్తూ, “మీకు ఎదురైన అనుభవానికి మేము నిజంగా చింతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మిమ్మల్ని తీవ్ర అసౌకర్యానికి, బాధకు గురిచేస్తాయని మేము అర్థం చేసుకున్నాం. ఫోన్‌లో మాట్లాడుకున్నట్లుగా, ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణించామని తెలుసుకోండి. ఫిర్యాదులో పేర్కొన్న కెప్టెన్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా నిషేధించాం. 

కస్టమర్ భద్రతకు లేదా గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను మేము ఏమాత్రం అంగీకరించం. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని మేము ఎంతో విలువైనదిగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మా ప్లాట్‌ఫామ్ సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రదేశంగా ఉండేలా మా వంతు కృషి కొనసాగిస్తాం. మీకు మరేదైనా సహాయం అవసరమైతే, మాకు డీఎం చేయండి” అని తెలిపింది. తాను ఫిర్యాదు చేయలేదని ఆ టీనేజర్ తెలిపాడు. “నేను ఇంకా నా కుటుంబానికి చెప్పలేదు” అని చెప్పాడు.

సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌
చాలామంది టీనేజర్‌కు మద్దతు తెలుపుతూ, ధైర్యం చెప్పారు. అయితే, కొందరు మాత్రం అతడిపై ట్రోలింగ్‌ చేశారు. ఆ బాలుడిని తప్పుపట్టడంతో పాటు అవమానకర వ్యాఖ్యలు చేశారు. మరికొందరు అతని ఆరోపణలు నిజమేనా అని ప్రశ్నించారు.

తనను విమర్శించిన వారికి సమాధానమిస్తూ ఆ టీనేజర్.. “ద్వేషం మంచిది కాదు. దాని గురించి నేను బాధపడుతున్నాను. ఇది లింగానికి సంబంధించిన విషయం కాదని, మనుషుల భద్రతతో పాటు పిల్లల భద్రతకు సంబంధించిన విషయం అని వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement