విజయ్‌-రాహుల్‌ రీల్స్‌.. ఎందుకు బ్లాక్‌ చేశారు? | Is Insta Block Vijay Rahul Gandhi Reels photos Centre Reply to Congress Allegations | Sakshi
Sakshi News home page

విజయ్‌-రాహుల్‌ రీల్స్‌.. ఎందుకు బ్లాక్‌ చేశారు?

May 11 2026 8:42 AM | Updated on May 11 2026 9:49 AM

Is Insta Block Vijay Rahul Gandhi Reels photos Centre Reply to Congress Allegations

కేంద్రంపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్‌-రాహుల్‌ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్‌ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

విజయ్‌ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్‌ గాంధీతో విజయ్‌ తీసిన ఫొటోలు, రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్‌ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. 

కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్‌తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్‌ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్‌ వ్యవహారంపై ఇన్‌స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. 

అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్‌స్టాగ్రామ్‌ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్‌స్టాగ్రామ్‌ ఇంకా స్పందించలేదు. 

ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్‌ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్‌(ట్విటర్‌), యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్‌ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్‌, సబ్‌స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. 

ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్‌-కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రీల్స్‌కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్‌ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్‌పై ఎవరేం అన్నారంటే.. 👇

కాంగ్రెస్‌ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్‌ను తగ్గించే ప్రయత్నమే!

విజయ్‌ ఫ్యాన్స్‌: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసింది

బీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్నికల్‌ ఎర్రర్‌ వల్ల జరిగి ఉండొచ్చు 

ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్‌స్టాగ్రామ్‌ దీనిపై వివరణ ఇస్తుంది

ఇన్‌స్టాగ్రామ్‌: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు

ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.

మీమ్స్‌: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి

Advertisement
 
Advertisement
Advertisement