
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బాబు వాట్సాప్ బ్లాక్ అయ్యింది. దీంతో.. సమస్యలు ఏవైనా ఉంటే తనకు వాట్సాప్ చేయొద్దని.. ఒకవేళ తనదాకా తీసుకురావాలనుకుంటే మాత్రం మెయిల్ చేయాలని కోరుతున్నారాయన.
నారా లోకేష్‌కు వాట్సాప్ చేస్తే చాటూ.. మీ సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయి అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే హఠాత్తుగా ఇవాళ ఆయన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. మీ సమస్యలు వాట్సప్ చేయొద్దంటూ మెసేజ్ ఉంచారు. అయితే..
ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన "హలో లోకేష్"…
— Lokesh Nara (@naralokesh) July 11, 2024
జనం కంటే.. టీడీపీ శ్రేణుల నుంచే ఎక్కువగా సందేశాలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో విసుగుచెంది ఆయన ఆ నెంబర్‌ను బ్లాక్ చేసి ఉండొచ్చనే చర్చా నెట్టింట నడుస్తోంది. బ్లాక్ చేశాక ఆ నెంబర్‌కు వాట్సాప్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం, ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కితే నవ్వులపాలు అవ్వొచ్చనే ఉద్దేశంతో లోకేష్ ఎక్స్‌లో సదరు సందేశం ఉంచినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.