
కర్ణాటక: ఫోన్ నంబర్‌ను లవర్ బ్లాక్ చేయడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెరేసంద్ర గ్రామంలోని ప్రైవేట్ కాలేజ్ హాస్టల్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కేరళ మూలానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ (26) పెరేసంద్ర గ్రామంలో ఓ ప్రైవేట్ కాలేజ్‌లో సైన్స్ కోర్సు చదువుతున్నాడు. ఇటీవల షబ్బీర్ ఫోన్ నంబర్‌ను యువతి బ్లాక్ చేసింది. పలుమార్లు ఫోన్ చేసినా యువతి ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తీయలేదు. దీంతో మనస్థాపం చెందిన షబ్బీర్.. హాస్టల్ రూమ్‌లో టవల్‌తో ఉరేసుకుని మృతి చెందాడు. కాగా.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు నాతో ఎప్పడు ఉంటావు.’ అంటూ షబ్బీర్ డెత్‌నోట్‌లో రాశాడు.