
సాక్షి, బాపట్ల: అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘సిద్ధం సభ’ విజయవంతమైంది. సిద్ధం సభకు లక్షాలాదిగా ప్రజలు హాజరై.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ఉత్సాహంగా విన్నారు.
కార్యకర్తలు, అభిమానులతో సభకు వచ్చే.. అన్ని దారులు నిండిపోయాయి. రోడ్లన్ని కిక్కిరిసి.. హృదయాలు ఒక్కటైయ్యాయి. సభా ప్రాంగణంలో ఎంత మంది ఉన్నారో.. సభ బయట అంత మంది కంటే ఎక్కువే ఉన్నారు.