18 ఓటీటీలపై నిషేధం | Sakshi
Sakshi News home page

18 ఓటీటీలపై నిషేధం

Published Fri, Mar 15 2024 5:47 AM

Govt blocks 18 OTT platforms, 19 sites, 57 social media accounts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినందుకుగాను 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వాటికి సంబంధించిన సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేయనున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వీటికి సంబంధం ఉన్న 19 వెబ్‌సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్‌ మీడి యా ఖాతాలను దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొంది. తొలగించే 10 యాప్‌లలో ఏడు గూగుల్‌ ప్లే స్టోర్, 3 యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఉండేవి.  

వేటుపడిన 18 ఓటీటీలివే..
డ్రీమ్స్‌ ఫిలిమ్స్, వూవీ, యెస్మా, అన్‌కట్‌ అడ్డా, ట్రీఫ్లిక్స్, ఎక్స్‌ప్రైమ్, నియోన్‌ ఎక్‌ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రబ్బిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్‌ ఎక్స్, మోజోఫ్లిక్స్, హాట్‌ షాట్స్‌ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్‌ప్లే వంటి ఓటీటీ సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించారు. తొలగించిన వాటిలో 12 ఫేస్‌బుక్‌ ఖాతాలు, 17 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు, 16 ఎక్స్‌ ఖాతాలు, 12 యూట్యూబ్‌ ఖాతాలు సోషల్‌ మీడియా ద్వారా అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి.

Advertisement
Advertisement