గ్యాంబ్లింగ్‌ సైట్లపై కేంద్రం కొరడా  | India blocked around 300 illegal gambling and betting websites | Sakshi
Sakshi News home page

గ్యాంబ్లింగ్‌ సైట్లపై కేంద్రం కొరడా 

Mar 21 2026 4:29 AM | Updated on Mar 21 2026 6:01 AM

India blocked around 300 illegal gambling and betting websites

300 సైట్స్, యాప్స్‌ బ్లాక్‌ చేసిన కేంద్రం 

న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 పైగా వెబ్‌సైట్లు, యాప్‌లను బ్లాక్‌ చేసింది. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫాంలు, ఆన్‌లైన్‌ కేసినోలకు సంబంధించినవని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సట్టా, మట్కా గ్యాంబ్లింగ్‌ నెట్‌వర్క్‌లు, రియల్‌ మనీ కేసినో గేమ్‌ యాప్స్‌పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి 8,400 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్లు వివరించాయి. ఇందులో అత్యధిక భాగం (సుమారు 4,900) ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం వచ్చాక చర్యలు తీసుకున్నవేనని వివరించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement