ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
తమిళనాడు: మాజీ ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేసుకున్న భర్తను భార్యతో పాటు ఆమె బంధువులు చితకబాదిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. తేని జిల్లా బోడినాయక్కనూరు ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్(36) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య అర్చన, కుమారుడు వున్నారు. ప్రస్తుతం వీరు తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో నివాసం వుంటున్నారు.
రెండు రోజుల క్రితం వినోద్‌కుమార్ తన మొదటి ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయాన్ని భార్య అర్చన గుర్తించి అతడితో ఘర్షణపడింది. అనంతరం అర్చన తన అక్క వనతి, భావ శరవణన్, సోదరుడు మహేష్‌ను పిలిపించింది. వారు వినోద్‌కుమార్‌ను చితకబాదారు. తీ వ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు రక్షించి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


