భార్య వంటకు రూ.1000 ఫీజు! | Gurugram Couple Unique Tradition, Husband Pays ₹1,000 Every Time Wife Cooks Cafe Style Meals At Home, Sparks Debate | Sakshi
Sakshi News home page

భార్య వంటకు రూ.1000 ఫీజు!

Jul 31 2026 12:17 PM | Updated on Jul 31 2026 12:24 PM

Husband Pays Wife Rs 1000 Per Home Cooked Meal Odd Habit or Financial Strategy

ఇంట్లో భార్య వండిపెట్టే వంటలకు భర్త రూ.1000 చెల్లించడమా? వినడానికి కాస్త వింతగా అనిపించినా గుర్‌గావ్‌కు చెందిన ఫుడ్ కంటెంట్ క్రియేటర్ ప్రియ, ఆమె భర్త మధ్య నడుస్తున్న విధానం ఇది. సోషల్ మీడియాలో ప్రియ పంచుకున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సరదాగా మొదలై.. అలవాటుగా..

మాజీ ఫ్యాషన్ డిజైనర్, ప్రస్తుతం ఫుడ్ క్రియేటర్‌గా ఉన్న ప్రియ కేఫ్/రెస్టారెంట్ స్టైల్ వంటకాలను ఇంట్లో తయారు చేసిన ప్రతిసారీ ఆమె భర్త రూ.1,000 ట్రాన్స్‌ఫర్ చేస్తారని తెలిపింది. ‘ఇంటి బాధ్యతలు, శ్రమ గురించి ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సరదాగా మొదలైన ప్రతిపాదన ఇది. బయట కేఫ్‌లలో రూ.1,000 పెట్టి తినే బదులు అంతకంటే నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంట్లోనే తింటున్నప్పుడు ఆ శ్రమకు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వకూడదని నా భర్త భావించారు’ అని ఆమె స్పష్టం చేసింది.

శ్రమకు గుర్తింపు

ఈ అలవాటును వ్యాపారాత్మక ధోరణి లేదా భార్యాభర్తల బంధానికి వ్యాపారాన్ని జోడించడం అని నెటిజన్లు విమర్శించినప్పటికీ ప్రియ దీన్ని సమర్థించుకుంది. దీని ముఖ్య ఉద్దేశం భర్త నుంచి డబ్బులు గుంజడం కాదని, కంటికి కనిపించని గృహిణులు శ్రమను గౌరవించడమేనని వెల్లడించింది. ఈ విధంగా వచ్చే నెలవారీ రూ.15,000 నుంచి రూ.20,000ల మొత్తాన్ని దాచిపెట్టి భవిష్యత్తులో స్వయంగా ఒక ఫుడ్ బ్రాండ్ ప్రారంభించడానికి పెట్టుబడిగా ఉపయోగిస్తున్నట్లు వివరించింది.

మారుతున్న దాంపత్య ధోరణులు

ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తూ.. డబ్బు కుటుంబం లోపలే ఉంటుందని, బయట రెస్టారెంట్లకు తగలేసే సొమ్ము పొదుపై భార్య ఆత్మగౌరవానికి, సొంత వ్యాపార ఆశయానికి ఊతమిస్తుందని కొందరు మద్దతు తెలపారు. మరికొందరు మాత్రం కుటుంబంలో ప్రేమానురాగాలకు వెలకట్టలేమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement