భార్య బడిత పూజకు భర్త బలి | Man Hangs Son Upside Down Wife Beats Him To With Stick | Sakshi
Sakshi News home page

భార్య బడిత పూజకు భర్త బలి

Jun 5 2026 10:58 AM | Updated on Jun 5 2026 11:26 AM

Man Hangs Son Upside Down Wife Beats Him To With Stick

ఛతర్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు నీలం కుష్వాహ తన భర్తను కర్రతో కొట్టి చంపింది. ఆపై ఎనిమిది గంటల పాటు మృతదేహం వద్దే కూర్చుంది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. నీలం గత నాలుగేళ్లుగా తన భర్త దీన్‌దయాల్ కుష్వాహకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది.

జూన్ 1న దీన్‌దయాల్ మద్యం మత్తులో భార్య తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. దీన్‌దయాల్ బలవంతంగా తలుపులు తెరిచి.. తమ కొడుకును తలకిందులుగా వేలాడదీశాడని నీలం ఆరోపించింది. తన భర్త బిడ్డకు హాని తలపెడతాడేమోనని ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో ఆమె కర్రతో దీన్‌దయాల్‌పై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన దీన్‌దయాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నీలం దాదాపు ఎనిమిది గంటల పాటు భర్త మృతదేహం పక్కనే కూర్చుంది.

ఆ తర్వాత స్థానిక గుడికి వెళ్లి.. దేవుడి ముందు 10 నిమిషాల పాటు కూర్చుని క్షమాపణలు వేడుకుంది. అక్కడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమె.. తానే తన భర్తను చంపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోని మంచంపై ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేధింపులు, దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని.. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement