ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లా పాండోపారా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య, నలుగురు బిడ్డల తల్లిపై అనుమానంతో భర్త అతి దారుణంగా ప్రవర్తించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయ్‌పూర్‌కు ఉత్తరాన సుమారు 350 కి.మీ దూరంలో ఈ ఘటనచోటు చేసుకుంది. బాధితురాలు తారా బాయి (32)కు నిందితుడు జితేంద్ర ఘసియాతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. విబేధాలతో భార్యాభర్త లిద్దరు విడిగా ఉంటున్నారు. అయితే పిల్లలు మాత్రం తండ్రి వద్దే ఉంటున్నారు.
భార్యపై అనుమానంతో అత్యంత అమానుషంగా దాడి చేశాడు జితేంద్ర. చేతులు కాళ్లు, కట్టేసి ఆమె పదే పదే దాడి చేశాడు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి తీవ్ర అవమానానికి గురిచేశాడు .ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి, మరో మహిళకూడా ఆమెపై చేయి చేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఘాతుకాన్ని రికార్డ్ కూడా చేశాడు.
💔 #DalitWoman Tara Bai was brutally assaulted by her estranged husband in Chhattisgarh: tied up, beaten, head shaved, smeared with black substance & forced to drink urine.
Caste & gender violence continue.
Justice for Tara Bai! #StopViolence #ShotOnPaPhone #ApolloTyres pic.twitter.com/zCBduhT2oS— Kavita Kumari (@KavitaDevi5252) June 19, 2026
అసలేం జరిగింది?
అయితే, ఏడాది క్రితం భర్త ఆమెను వదిలేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె, తన సామాజిక వర్గానికి చెందిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. నిందితుడు ఆమెను ఇంటి బయటకు రప్పించి, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత రాక్షసుడిలా మారిపోయాడు. దారుణంగా కొట్టి అమానుషంగా ప్రవర్తించడంతోపాటు, మూత్రం తాగించాడు.
ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు
బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తనపై పిడిగుద్దులు కురిపించి, తన జుట్టును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఆమె భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు, వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి ప్రకటించారు.
ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ


