అమెరికాలో రోజు రోజుకి అస్తవ్యస్థంగా మారిపోతున్న వైద్య వ్యవస్థ, సేవల్లో జాప్యం, ఖరీదైన వైద్యంలాంటి వాటిపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇండియాలో హెల్త్‌కేర్ సిస్టం, అందిస్తున్న సేవలపై ఒక అమెరికన్ మహిళ ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది. అమెరికా చూసి నేర్చుకోఅంటూ ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అపాయింట్‌మెంట్ లేకుండా భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్‌లు కొనుక్కో గలిగాను అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఆమె తన వీడియోలో వివరించిన వివరాల ప్రకారం భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్‌ల కొనుగోలు ప్రక్రియ ఎంతో అందుబాటులోనూ, తక్కువ ధరలోనూ ఉంది.ఒక ఆప్టికల్ స్టోర్‌కు వెళ్లి లెన్స్‌లను ఆర్డర్ చేయడం, చాలా తక్కువ ధరకే వాటిని త్వరగా పొందడం వంటి విషయాలను వివరిస్తూ, ‘ఐవీ' (Ivy) అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. అమెరికా దీనిని గమనించాలని (పాఠంనేర్చుకోవాలని) ఆమె సూచించారు. బీమా లేదా ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే రూ. 2,451లకే కొనుగోలు చేసి, ఇక్కడి వైద్య సేవల లభ్యతను ఆమె కొనియాడారు.
షాపింగ్ అనుభవం
ఐవీ కోసం కేవలం ఒక జత కాంటాక్ట్ లెన్స్‌లు మాత్రమే తెచ్చుకుంది. దీంతో మరో జత కొనాలని నిర్ణయించుకుంది. కేవలం 20 నిమిషాల నడక దూరంలో ఉన్న ఒక మాల్‌లోని ఆప్టికల్ స్టోర్‌కు వెళ్లి, తన ప్రిస్క్రిప్షన్‌ను వారికి చూపించింది. ఆమె వాడే బ్రాండ్ లెన్స్‌లను సోమవారం రాత్రి కల్లా తెప్పించి ఇస్తామని స్టోర్ సిబ్బంది చెప్పారు. మరిన్ని బాక్సులు కొంటే అదనపు డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఒక బాక్స్ మాత్రమే తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమెకు లెన్స్‌లు అందడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.
ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ
ఇలా నేరుగా ఆప్టికల్ స్టోర్‌లోకి నడుచుకుంటూ వెళ్లి లెన్స్ కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమెరికాలో ఇలా చేయడం అస్సలు సాధ్యం కాదు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేకుండా అస్సలు కుదరదని ఐవీ పేర్కొంది. చాలా తక్కువ ధరకే మూడు జతలు వచ్చాయంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
నెటిజన్లు ఏమన్నారంటే
ఈ పోస్ట్ వైరల్ కావడంతో, అమెరికన్లకు కాంటాక్ట్ లెన్స్‌లు కొనడానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనే విషయం తెలిసి మెజారిటీ నెటిజన్లు ఆశ్చర్యపోయారు "నిజమా! నేనైతే ఎప్పుడు పడితే ఒక మామూలు గ్లాసెస్ షాప్‌కి వెళ్తాను. నా కళ్లద్దాలు లూజ్ అయితే టైట్ చేయించుకుంటాను. దానికోసం ఆ షాప్ అతను ఒక్క రూపాయి కూడా తీసుకోడు, ఫ్రీగా చేస్తాడు." అని తెలిపారు. కాంటాక్ట్ లెన్స్ కోసం ఇన్సూరెన్స్ కావాలనే కాన్సెప్ట్ వినడానికే చాలా వింతగా ఉందంటూ మరొక యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకూ ఈ విషయం తెలియదంటూ మరికొందరు కూడా విస్తుపోయారు.
కాగా ఇటీవల మరొక అమెరికన్ మహిళ (విక్టోరియా) అమెరికాలో సుమారు రూ. 94వేలు ఖరీదు చేసే ముఖ్యమైన మందులను ఇండియా నుంచి కేవలం రూ. 2,350 లకే కొనుగోలు చేసానని, , అమెరికా హెల్త్‌కేర్ సిస్టమ్‌ను ఒక "స్కామ్" అని అభివర్ణించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు


