భార్యాపిల్లలను కాదని మరో మహిళతో కాపురం..! | Family Dispute Turns Violent In Telangana As First Wife’s Relatives Clash With Man Over Second Marriage | Sakshi
Sakshi News home page

భార్యాపిల్లలను కాదని మరో మహిళతో కాపురం..!

Aug 9 2026 9:42 AM | Updated on Aug 9 2026 11:44 AM

wife and husband incident

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (ఏఐ ఫోటో)

రాజన్న సిరిసిల్ల జిల్లా: భార్య, పిల్లలను కాదని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వేములవాడలోని న్యూఅర్బన్‌కాలనీలో ఉంటున్న వావిలాల శంకర్‌ ఆటో డ్రైవర్‌. శంకర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా శనివారం మొదటి భార్య బంధువులు శంకర్‌ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో మాటమాట పెరిగి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే పోలీసుల అక్కడికి చేరుకుని శంకర్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకర్‌ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉండగా కత్తులు, కర్రలతో వచ్చి దాడి చేశారన్నారు. మొదటి భార్య బంధువులు మాత్రం తాము ఏమీ అనకుండానే గోడకు ఉన్న గ్లాస్‌ అద్దానికి తలబాదుకుని తనకుతానే తల పగులగొట్టుకున్నాడని వెల్లడిస్తున్నారు. ఇరుపక్షాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement