విషాదం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి మహిళ దుర్మరణం | Karimnagar Gas Cylinder Blast Turns Tragic As Woman Dies During Treatment, Husband Still Hospitalised | Sakshi
Sakshi News home page

విషాదం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి మహిళ దుర్మరణం

Aug 9 2026 9:24 AM | Updated on Aug 9 2026 11:34 AM

Gas Cylinder Explosion at Karimnagar

కరీంనగర్‌:  వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యావనవేని విజ్ఞత(27) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి మహాకవి పోతనకాలనీలోని నివాసం ఉంటున్న సింగరేణి కారి్మకుడు యాదనవేని వసంత్‌ – విజ్ఞత దంపతులు ఈనెల 2న గ్యాస్‌స్టౌవ్‌ పేలి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. 80శాతం కాలిన గాయలతో విజ్ఞత, 60 శాతం కాలిన గాయాలతో వసంత్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ విజ్ఞత చనిపోయింది. వసంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దంపతుల ఇద్దరు పిల్లలు బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. దీంతో పోతనకాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. విజ్ఞత తల్లిగారి గ్రామమైన బెల్లంపల్లిలోని బుచ్చంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.   

గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement