హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్ | Cyberabad Wine Shops To Remain Closed On August 9 For Bonalu Dry Day, Check Timings Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్

Aug 9 2026 8:16 AM | Updated on Aug 9 2026 12:24 PM

Cyberabad Wine Shops Closed August 9 Bonalu Dry Day

హైదరాబాద్‌: బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వాతావరణం ప్రశాంతంగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నాలుగు కమిషనరేట్ల పరిధిలో మద్యం విక్రయాలపై 24 గంటల పాటు ఆంక్షలు విధించింది.

ఈ మేరకు సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్‌లతో పాటు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను తాత్కాలికంగా మూసివేయాలని కమిషనర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆంక్షలు ఆగస్టు 9వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభమై, ఆగస్టు 10వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు అమలులో ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నగర సీపీ వి.సి. సజ్జనార్ ఆదేశించారు.

ఉత్సవాలు ముగిసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, నిబంధనలను ఉల్లంఘించి దొంగచాటుగా మద్యం విక్రయించినా లేదా షాపులు తెరిచినా నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. భక్తులందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement