చాంద్రాయణగుట్ట: ఆషాఢమాసం బోనాల జాతరలో ఆదివారం ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమరి్పంచనున్నారు. అమ్మవారి ఆలయానికి రెండు వైపులా బోనాల క్యూ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో బాంబు, డాగ్‌స్కా్వడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సింహవాహిని ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం 6 గంటలకు రాజ్యసభ మాజీ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా దేవీ మహా అభిష్‌కం ఉంటుంది.
అనంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరుపుతారు. లాల్‌దర్వాజా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం ఇప్పటికే పోలీస్ నిఘాలోకి వెళ్లిపోయింది. బాంబు, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ వర్గాలు మోహరించాయి.


