చలో.. బాల్ కే సాత్ ఆమ్ బీ మిలేగి.. (బంతితో పాటు మామిడికాయ కూడా దొరుకుతుంది వెళ్లు!)) ...గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ సరదా కామెంట్ ఇది. గంగూలీ ఏమిటి? గల్లీ క్రికెట్ ఆడడం ఏమిటి? అనుకుంటున్నారా? ఔను, నిజమే. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా! ఆటగాళ్లు దీనికి పెట్టుకున్న ‘కౌంటీ’. ఇంతకూ కౌంటీ ఎలా ఆడతారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ‘గల్లీ క్రికెట్..’! ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ ట్రెండ్‌గా మారుతోంది. ఐపీఎల్ స్థాయిలో అలరిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగులు, యువత, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖులు, మాజీ క్రికెటర్లు సైతం ఇందులో పాల్గొంటున్నారు. ఒక ఓవర్‌లో ఇన్ని పరుగులు చేయాలి.. అని, లేదా ఇన్నిసార్లు ఔట్ అయితే బ్యాటర్ ఇన్నింగ్స్ ముగిసినట్లని పోటీ పెట్టుకుని ఆడుతూ మరింత మజా జోడిస్తున్నారు. ముంబై వంటి ప్రధాన నగరాల్లో అయితే అంతర్జాతీయ క్రికెటర్లూ సరదాగా పాల్గొంటుండడం విశేషం.
ఎలా ఆడతారు?
సాధారణ క్రికెట్‌నే కౌంటీలో కాస్త భిన్నమైన తీరులో ఆడతారు. ఇందులో ఎక్కువగా ఆటగాళ్ల మధ్య పోటీ ఉంటుంది. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు (ఉదాహరణకు 6 బంతుల్లో 20) చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాట్స్‌మన్ భారీ షాట్‌లు కొడుతుంటారు. గంగూలీ ఇలానే దూరంగా మామిడి చెట్లలోకి షాట్ కొట్టి, బంతితో పాటు మామిడి కాయలూ తెచ్చుకోమన్నాడు. ఇక కౌంటీలో బ్యాట్స్‌మెన్‌కు చాన్స్‌లు కూడా ఉంటాయి. నిర్దిష్ట టార్గెట్‌ను అవతలి వారు చేజ్ చేయాలి. ఇంకో విషయం ఏమంటే, పోటీ ఇద్దరి మధ్యే అయినా ఫీల్డర్లు ఎక్కువమందే ఉంటారు. కొందరికి కౌంటీ క్రికెట్‌లో వ్యాపార అవకాశాలు కనిపించాయి. దీంతో స్టార్టప్‌లు రంగంలోకి దిగి స్పోర్ట్స్ కమ్యూనిటీలతో ప్రొఫెషనల్‌గా మార్చాయి. టెన్నిస్ బాల్ టోరీ్నలు, ఆన్‌లైన్ రిజి్రస్టేషన్, లైవ్ స్కోరింగ్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, ప్రైజ్ మనీ, టీమ్ వేలం జత చేయడంతో అసలైన క్రికెట్ మ్యాచ్‌లకు దీటుగా ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి.
వయా...సోషల్ మీడియా
దశాబ్దాల క్రితమే పరిచయం ఉన్నా గల్లీ క్రికెట్ మరింత పాపులర్ కావడానికి సోషల్ మీడియా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. షార్ట్‌లు, రీల్స్‌తో వీడియోలు కోట్లాది వ్యూస్ సాధిస్తున్నాయి. గల్లీ క్రికెట్‌తో సినీ, క్రీడారంగ సెలబ్రిటీలకూ చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. దీంతో వారూ హోదా మరిచి వీధుల్లోకి వచ్చేస్తున్నారు.
హైదరాబాద్‌లో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లు, బాక్స్ క్రికెట్ ఎరీనాలు, కార్పొరేట్ క్రికెట్ లీగ్‌లు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ ప్రీమియర్ లీగ్‌లు పెరుగుతున్నాయి. గచి్చ»ౌలి, మాదాపూర్, కొండాపూర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కొంపల్లి వంటి ప్రాంతాల్లో యువత, ఐటీ ఉద్యోగులు వీకెండ్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. నగరంలోనూ గల్లీ క్రికెట్ బ్రాండెడ్ లీగ్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


