గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు | Cooking gas cylinder explodes in Ramagundam | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు

Aug 3 2026 11:39 AM | Updated on Aug 3 2026 11:44 AM

Cooking gas cylinder explodes in Ramagundam

పెద్దపల్లి జిల్లా: రామగుండం కార్పొరేషన్‌ పోతనకాలనీ 83వ బ్లాక్‌ క్వార్టర్‌ నంబరు 1151లో ఆదివారం వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలి సింగరేణి కార్మికుడు యాదవనేని వసంత్‌తోపాటు ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వసంత్‌ సింగరేణిలోని వకీల్‌పల్లి గనిలో జనరల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 

శనివారం రెండోషిఫ్ట్‌ ముగించుకొని ఇంటికి చేరాడు. భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఇదేసమయంలో బాత్‌రూమ్‌కు ఆనుకొని ఉన్నహాల్‌లో అదనంగా ఉన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ లీకైంది. హాల్‌ తలుపుల, కిటికీలు మూసిఉండడంతో గ్యాస్‌ మొత్తం వ్యాపించింది. తెల్లవారుజామున వసంత్‌ బాత్‌రూమ్‌కు వెళ్లగా భార్య గ్యాస్‌ వాసన వస్తోందని చెప్పి హాల్‌లోకి  వెళ్లి లైట్‌వేసింది. దీంతో పెద్దశబ్దంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో విజ్ఞతకు మంటలు అంటకోవడంతో కేకలు వేసింది. 

బాత్రూర్‌లోని వసంత్‌కూ మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దంపతులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య సుమారు 80శాతం, భర్త దాదాపు 60శాతం గాయపడగా.. పరిíస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బెడ్‌రూమ్‌లోని వారి ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. భారీపేలుడుతో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement