breaking news
cooking gas cylinder explosion
-
గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు తీవ్ర గాయాలు
పెద్దపల్లి జిల్లా: రామగుండం కార్పొరేషన్ పోతనకాలనీ 83వ బ్లాక్ క్వార్టర్ నంబరు 1151లో ఆదివారం వంటగ్యాస్ సిలిండర్ పేలి సింగరేణి కార్మికుడు యాదవనేని వసంత్‌తోపాటు ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వసంత్ సింగరేణిలోని వకీల్‌పల్లి గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రెండోషిఫ్ట్ ముగించుకొని ఇంటికి చేరాడు. భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఇదేసమయంలో బాత్రూమ్కు ఆనుకొని ఉన్నహాల్‌లో అదనంగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ లీకైంది. హాల్ తలుపుల, కిటికీలు మూసిఉండడంతో గ్యాస్ మొత్తం వ్యాపించింది. తెల్లవారుజామున వసంత్ బాత్రూమ్కు వెళ్లగా భార్య గ్యాస్ వాసన వస్తోందని చెప్పి హాల్లోకి వెళ్లి లైట్వేసింది. దీంతో పెద్దశబ్దంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో విజ్ఞతకు మంటలు అంటకోవడంతో కేకలు వేసింది. బాత్రూర్లోని వసంత్కూ మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దంపతులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య సుమారు 80శాతం, భర్త దాదాపు 60శాతం గాయపడగా.. పరిíస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బెడ్రూమ్లోని వారి ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. భారీపేలుడుతో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోయింది. -
ఢిల్లీలో పేలుళ్లు: ఏడుగురికి గాయాలు
దేశ రాజధాని హస్తినలోని వేర్వేరు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. గాయపడని వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని సరాయి కలె ఖాన్‌లోని ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలండర్ పేలి భార్య, భర్తతోపాటు ఇద్దరు చిన్నారులు, అలాగే రాణి బాగ్‌లోని ఇంజనీర్ ఎన్‌క్లేవ్‌లో ఎల్పీజీ సిలండర్ పేలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. మరో పేలుడు రిఫ్రిజరేటర్ షాపులో సంభవించిందని, అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని తెలిపారు. పేలుళ్లు సంభవించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగానే వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు.


