పార్టీలో గొడవ : భార్యను బైక్‌ మీద నుంచి తోసేశాడు! | Man Pushes Wife Off Moving Bike, Following Argument Over Dancing | Sakshi
Sakshi News home page

పార్టీలో గొడవ : భార్యను బైక్‌ మీద నుంచి తోసేశాడు!

Mar 31 2026 2:52 PM | Updated on Mar 31 2026 2:58 PM

Man Pushes Wife Off Moving Bike, Following Argument Over Dancing

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేయ లేదన్న కోపంతో, ఒక భర్త తన భార్యను నడుస్తున్న బైక్ మీద నుండి నెట్టివేశాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలోరికార్డైనాయి.  

నిందితుడు, భార్యతో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ పడ్డారు. అక్కడ పార్టీలో  డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో భార్యపై ఆగ్రహాన్ని పెంచుకున్నాడు.  వేడుక ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా దారిలో ఆమెతో  మళ్లీ గొడవకు దిగాడు.  బైక్ వేగంగా వెళ్తుండగాగానే భర్త భార్యను కిందకు నెట్టివేశాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది.  

ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్‌ వెయిట్‌ లాస్‌ : కేవలం నీళ్లు, మద్యం

కుటుంబ సభ్యుల ఆరోపణలు
అయితే ఈఘటనపై మృతురాలి పుట్టింటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కోపంతో జరిగింది  కాదనీ, పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆమెను హతమార్చారని వారు  కన్నీరు పెట్టుకున్నారు.

ఇదీ చదవండి: పింక్‌ ఏనుగు ఫోటోషూట్‌, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement