బిహార్‌లోని నలంద జిల్లా, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్రమైన పెళ్లి నెట్టింట సందడి చేస్తోంది. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న 36 ఏళ్ల వివాహిత మహిళ., తనకంటే 12 ఏళ్ల చిన్నోడు, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమాయణం. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో అనుకోని ట్విస్ట్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలేమైంది?
కట్వా రసూల్‌పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన వివరాలు...శుక్రవారం రాత్రి ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది,సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను, ఆమె ప్రియుడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు మహిళ భర్తను, ఆమె ప్రియుడి తండ్రిని కూడా విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను వెల్లడించింది. దీని తరువాత, ఇరు పక్షాల మధ్య చర్చోప చర్చలు జరిగాయి.
ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!
చివరికి మరుసటి రోజు, శనివారం, ఆ మహిళ భర్త వీరి పెళ్లిక అంగీకరించి, స్థానిక గుడిలో ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి ఆ వారి ముగ్గురు పిల్లలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పిల్లలు తమ తల్లితో వెళ్ళడానికి నిరాకరించి, తమ తండ్రితోనే ఉండాలని కోరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం, పెళ్లి తర్వాత ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి, తన కొత్త భర్తతో కలిసి పంజాబ్‌లోని లూథియానాకు వెళ్లిపోయింది. ఇది కులాంతర వివాహంగా నివేదించబడుతున్నందున, ఈ సంఘటన ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారి తీసింది.
ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!


