చిత్తూరు జిల్లా: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత ప్రియుడితో కలిసి కొత్త కాపురం పెట్టగా బంధువులు పట్టుకున్న సంఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం బెగ్గిలిపల్లిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శాంతిపురం మండలంలోని బిఎం గొల్లపల్లికి చెందిన శోభకు గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నారు.
ఈ నేపద్యంలో శోభ(27)కు సామాజిక మాధ్యామాల ద్వారా గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్(22)తో పరిచయమైంది. ఈ పరిచయం ముదిరి ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. దీంతో నెల రోజుల క్రితం శోభ ఇంటి నుంచి పరారు కావటంతో తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపద్యంలో శోభ మరో యువకుడితో కలిసి బెగ్గిలిపల్లిలో ఉంటున్నట్టు గుర్తించిన చిరంజీవి తరపు బంధువులు ఆ ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైన శోభ బలవంతంతో ఆమెను పెళ్లి చేసుకున్నానని బాలాజీ నాయక్ చెప్పాడు. తను చెప్పినట్టు వినకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించటంతో ఆమెతో ఉన్నానన్నాడు. తన భర్త అనుమానంతో వేధింపులకు పాల్పడటంతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచమైన బాలాజీ నాయక్‌ను ఇష్టపడి తనతో తాళి కట్టించుకున్నానని శోభ చెప్పింది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు పోలీసులు తలలు పట్టుకొంటున్నారు.


