వార్ని..అమెరికా సైనికుడ్ని వివాహం చేసుకుంటే ఇన్ని బెనిఫిట్సా! | Indian Woman Married To American Soldier Lists 3 Biggest Benefits | Sakshi
Sakshi News home page

వార్ని..అమెరికా సైనికుడ్ని వివాహం చేసుకుంటే ఇన్ని బెనిఫిట్సా!

Jul 30 2026 9:07 PM | Updated on Jul 30 2026 9:17 PM

Indian Woman Married To American Soldier Lists 3 Biggest Benefits

వాషింగ్టన్‌: అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికన్‌ సైనికుడిని పెళ్లి చేసుకోవడం వల్ల తమకు లభించే మూడు ప్రధాన ప్రభుత్వ ప్రయోజనాల గురించి ఆమె వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అబ్బా.. ఇన్ని సౌకర్యాలా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ మహిళ పేరు మేఘనా. ఆమె అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న సైనికుడు మైఖేల్ లేలాండ్ హిల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికన్‌ సైనికుడిని వివాహం చేసుకుంటే లభించే ప్రయోజనాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్‌ చేశారు.  

ఈ వీడియోలో మైఖేల్ లేలాండ్ హిల్ మాట్లాడుతూ.. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఎడ్యుకేషన్‌ అని చెప్పారు. అమెరికాలో సైనిక కుటుంబాలకు అందుబాటులో ఉన్న కొన్ని విద్యా ప్రయోజనాల కింద అర్హతను బట్టి ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం, భత్యాలు లభిస్తాయని వివరించారు. కొన్ని విద్యా పథకాల కింద నెలవారీ భత్యం కూడా లభిస్తుందని తెలిపారు.

రెండో ప్రధాన ప్రయోజనం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్‌తో  పాటు ఇతర సైనిక ఆరోగ్య పథకాల ద్వారా అర్హులైన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

మూడో ప్రయోజనంగా వీఏ హోమ్ లోన్ సౌకర్యాన్ని ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా అర్హులైన మాజీ సైనికులు, సేవలో ఉన్న సైనికులు తక్కువ ముందస్తు చెల్లింపుతో లేదా కొన్ని సందర్భాల్లో డౌన్ పేమెంట్ లేకుండానే గృహ రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రుణానికి సంబంధించిన కొన్ని ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. వేలాది మంది కామెంట్లు చేశారు. చాలా మంది భారతీయులు దీనిని భారత సాయుధ దళాల్లో అందించే సౌకర్యాలతో పోల్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement