కోలీవుడ్ భామ వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ ఏడాది సరస్వతి మూవీతో అభిమానలను అలరించింది. అంతేకాకుండా ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. వరలక్ష్మీ ఇటీవలే పోలీస్ కంప్లైంట్ అనే తెలుగు మూవీలో కనిపించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందుకు వివాదంలో నిలిచింది. వరలక్ష్మీ డబ్బులు తీసుకుని కూడా ప్రమోషన్లకు రావడం లేదని డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఆమెను విమర్శించారు. మూవీ రిలీజ్ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.
ఇదిలా ఉండగా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ.. మరో సాహసానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ను ఏకంగా విలన్‌గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోందట. కోలీవుడ్‌లో ఆమె భర్త గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఇప్పటికే సినిమాల్లో లేడీ విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ.. భర్తను కూడా నెగెటివ్ రోల్‌లోనే తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
నికోలయ్ లుక్ వల్లే..
వరలక్ష్మీ భర్తను చూస్తే అచ్చం విలన్‌లాగే కనిపిస్తారు. భారీ దేహంతో పాటు విలన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అతని లుక్ ఉంటుంది. అందువల్లే వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా భర్తను విలన్‌గా పరిచయం చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అతని లుక్, పర్సనాలిటీ విలన్‌గా సెట్ అవుతుందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.


