సాక్షి, కాకినాడ జిల్లా: కేంద్రపాలిత యానాం కనకాల పేటలో దారుణం ఘటన చోటుచేసుకుంది. పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందన్న అనుమానంతో భర్త.. భార్యను హత్య చేసి గోదావరి నది పాయలో పడేశాడు. ఆరేళ్ల కిందట చెక్కా అప్పారావు, పువ్వల రేఖ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం రేఖ ఫోన్‌లో మరోకరితో చాటింగ్ చేస్తుండగా చూసిన భర్త... గొడవకు దిగాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యను భర్త పిడిగుద్దులు గుద్ది.. గొంతు నులిమి చంపేశాడు.
అనంతరం భార్య మృతదేహన్ని గోదావరి నది పాయలో పడేసి.. తన భార్య కనిపించడం లేదంటూ భర్త అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అప్పారావును విచారించారు. విచారణలో అప్పారావు నేరం ఒప్పుకున్నాడు. నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. రేఖ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.



