మాజీ భార్యపై లైంగిక దాడి కేసు రద్దు కాదు: హైకోర్టు తీర్పు | high court refuses to quash marital case india | Sakshi
Sakshi News home page

మాజీ భార్యపై లైంగిక దాడి కేసు రద్దు కాదు: హైకోర్టు తీర్పు

Apr 9 2026 11:33 AM | Updated on Apr 9 2026 12:39 PM

high court refuses to quash marital case india

బెంగళూరు: భార్య నుంచి విడిపోయాక, ఆమైపె బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే ఆ కేసును రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ దంపతులు 2019లో విడిపోయారు. 2021లో ఆమె ఇంటికి వచ్చిన మాజీ భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. ఈ కేసులో ఆ మహిళే స్వయంగా వాదించారు. తనపై దౌర్జన్యం జరిగిందని, అతని పిటిషన్‌ను తిరస్కరించాలని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న కేసు మాఫీకి తిరస్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement