High court judgement
-
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్‌ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్‌టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
‘చాలాకాలం సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే’
భోపాల్: వివాహం, భరణం అంశంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. వివరాలు .. శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. తనతో నివసించిన మహిళకు నెలవారీ భత్యం రూ.1,500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉతర్వులను శైలేష్ బాప్చే హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై జస్టిస్ జేఎస్ అహ్లూవాలియాతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టి.. ఆమెకు నెలసరి భత్యం కింద రూ. 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్‌గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్‌లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్‌దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్‌లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్లో జీవో 174 జారీ చేసింది. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచి్చంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ.. ఈ గణాంకాలు చూశాక.. ‘కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆసక్తికరమైన గణాంకాలను మా ముందుంచాయి. వృద్ధాప్య పెన్షన్ల కోసం కేంద్రం తన వాటా కింద ఏటా రూ.188.74 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.10,164 కోట్లు చెల్లిస్తోంది. వితంతు పెన్షన్ల కోసం కేంద్రం రూ.91.07 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4,129.44 కోట్లు ఇస్తోంది. దివ్యాంగులకు కేంద్రం రూ.9.05 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం రూ.2,594.31 కోట్లు చెల్లిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెన్షన్ల కింద వివిధ వర్గాలకు మొత్తం రూ.19,161.66 కోట్లు చెల్లిస్తోంది. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్ వాదనను మేం ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం అశ్వనీకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, మెడికల్ ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే పెన్షన్ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆరి్థక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్లు మంజూరులో కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక కోణంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇది. దీన్ని పునఃసమీక్షించేందుకు మేం అధికరణ 226 కింద మాకున్న అధికారాన్ని వినియోగించలేం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
టెక్నాలజీ అత్యవసరం.. అందిపుచ్చుకోవాల్సిందే
న్యూఢిల్లీ: పలు హైకోర్టుల్లో వర్చువల్ విచారణల శాతం తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచి్చంది. అన్ని కోర్టులు, దేశంలో ప్రతి జడ్జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టు విచారణల్లో వీడియో కాన్ఫరెన్స్ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టిందంటూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. న్యాయమూర్తులు టెక్నాలజీ వాడకంలో నిష్ణాతులా కాదా అన్నది కాదు సమస్య. కానీ వారికి దాని వాడకం తెలిసి ఉండాలి. లేదంటే అది అలవాటయ్యేలా శిక్షణ తీసుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది. టెక్నాలజీ వాడకం మీద అవగాహన కోసం వాళ్లు ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకున్నారు‘ అని పేర్కొంది. నేటి పరిస్థితుల్లో టెక్నాలజీ వాడకం ఇంకెంతమాత్రమూ ఆప్షన్ కాదని, అత్యవసర పనిముట్టుగా మారిందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ మార్పు దిశగా లాయర్లను కూడా సిద్ధం చేయక తప్పదని అభిప్రాయపడ్డారు. బాంబే హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లకు ఉద్దేశించిన స్క్రీన్స్‌ను తీసేయడం దారుణమన్నారు. ఇకపై మన దేశంలో జడ్జి కావాలంటే టెక్ ఫ్రెండ్లీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. -
స్టార్ హీరో ఉపేంద్రకు తాత్కాలిక ఊరట!
స్టార్ హీరో ఉపేంద్రపై పోలీసు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉప్పీ.. ఈ మధ్య తన రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా పలు విషయాలు మాట్లాడారు. అయితే దళితులని అవమానించేలా కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు దీనిపై కర్ణాటక హైకోర్టు ఊరట ఇచ్చింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) అసలేం జరిగింది? స్వతహాగా నటుడు అయిన ఉపేంద్ర.. ప్రజాక్రియా పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. దీని వార్షికోత్సవం సందర్భంగా ఫేస్బుక్, ఇన్‌స్టాలో శనివారం లైవ్ సెషన్లో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. విమర్శకులని ఓ వర్గంతో పోల్చుతూ సామెత చెప్పాడు. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారని, అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు కచ్చితంగా ఉంటారని అన్నాడు. వాళ్లని పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రజలపై ప్రేమాభిమానాలే నిజమైన దేశభక్తి అన్నాడు. అయితే ఉపేంద్ర వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కామెంట్స్ తమని ఆవేదనకు గురిచేశాయని నిరసన తెలియజేశాయి. కొందరైతే బెంగళూరులోని చెన్నమున్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ క్రమంలోనే తన కామెంట్స్‌పై దుమారం రేగడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పాడు. లైవ్ వీడియోని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే ఉపేంద్రపై నమోదైన ఎఫ్ఐఆర్పై కర్ణాటక హైకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇది తాత్కాలిక ఊరటకాగా.. భవిష్యత్తులో మాత్రం ఉపేంద్రకి చిక్కులు తప్పవేమో అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Upendra (@nimmaupendra) (ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
నితీష్ కుమార్‌కు ఊరట.. కుల గణనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కార్యక్రమాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గతంలో పలు పిటీషన్లు నమోదయ్యాయి. వీటిని కొట్టివేస్తూ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. బిహార్‌లో కుల గణన మొదటి సర్వే జనవరి 7 నుంచి 21 వరకు జరిగింది. రెండో దఫాలో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ కార్యక్రమంపై మే 4నే హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. కుల గణన చేపట్టాలని గత ఏడాది జూన్ 21నే రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని నిర్మించడానికి ఆయన ప్రధాన వ్యక్తిగా నిలిచారు. ఎన్డీయే కూటమికి దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఇండియా అనే కూటమిని నిర్మించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
అలహాబాద్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండానే అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సౌరవ్ లావానియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అర్బణ్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్ 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 200 మున్సిపల్ కౌన్సిల్లో 54 ఛైర్పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18 మహిలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో సుప్రీం కోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములానూ అనుసరించకుండానే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్లు. రిజర్వేషన్లు కల్పించే ముందు రాజకీయంలో ఓబీసీలు వెనకబడి ఉన్నారనే అంశంపై ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు సూచనలను ప్రభుత్వం అనుసరించలేదని కోరారు. అయితే, తాము రాపిడ్ సర్వే నిర్వహించామని, అది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరిస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ పిల్‌పై శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఇరువైపుల వాదనలు విని తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇదీ చదవండి: బూస్టర్ డోస్‌గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే? -
సీబీఐ విచారణతో వాస్తవాలు తెలుస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొ న్నారు. ఈ కేసులో వాస్తవాలు బయ టకు రావాలని బీజేపీ కోరుకుంటోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలి పా రు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచి పెట్టి, అసత్య ప్రచారంతో బీజేపీని బద్నామ్ చేసే కుట్రకు తెరతీసిందని మండిపడ్డారు. ‘ఫాంహౌస్ కేసులో కర్త, కర్మ, క్రియ.. ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌కు ‘ప్రగతి భవన్’అడ్డాగా మారింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభు త్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగు తోంది’అని అన్నారు. నేరస్తు లను కాపాడ టానికే ‘సిట్’ విచారణ సాగుతున్నట్లుగా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో ‘సిట్’ విచారణ జరిపినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోవడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవాచేశారు. లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరు కుపోయిన తన కుటుంబాన్ని కాపా డుకు నేందుకు, ప్రజల దృష్టిని మ ళ్లించడానికి కేసీఆర్ అల్లిన కట్టుకథనే ఫాంహౌస్ కేసు అని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్కేసులో దోషులెవరో గుర్తించడానికే సీబీఐ విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారన్నా రు. సీబీఐ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని బీజేపీ భావిస్తోందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని మొదటి నుంచీ తా ము చెబుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించామని మీడియా తో అన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ దర్యాప్తులో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?
సాక్షి, అమరావతి: ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) రద్దు తరువాత అక్కడి ఉద్యోగులు డిప్యుటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తుండగా, తమను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. హైకోర్టులో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఏటీ ఉద్యోగులను ఇతర శాఖలకు పంపాలనుకోవడం సరైన చర్యకాదని అభిప్రాయపడింది. వారు గతంలో కొద్దికాలం తమ వద్ద పనిచేశారని, కాబట్టి వారు తమ వద్దే పనిచేయడం సబబని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. హైకోర్టును సంప్రదించకుండా ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ విషయంలో లేఖ రాయడం తప్పేనన్నారు. ఇందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఆ లేఖను ఇప్పటికే ఉపసంహరించుకున్నామని ఆయన కోర్టుకు నివేదించారు. అయితే, ఏపీఏటీ ఉద్యోగులు హైకోర్టులో పనిచేయడానికి నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో హైకోర్టుతో ప్రభుత్వాధికారులు చర్చలు జరుపుతున్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. కోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సిబ్బంది లేఖ రాయడం క్రమశిక్షణారాహిత్యం హైకోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులను వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల హైకోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హైకోర్టులో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులు తమను ఇతర శాఖల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి నేరుగా లేఖ రాయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది క్రమశిక్షణారాహిత్యమేనని తెలిపింది. మరోవైపు.. హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఓ ఉద్యోగి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, ఆమె అక్కడే కొనసాగించేందుకు దయతో అనుమతినివ్వాలన్న ఆ ఉద్యోగిని తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తాము దయతో కాకుండా కేసులో ఉన్న దమ్మును బట్టి ఉత్తర్వులిస్తామంది. హైకోర్టులో చాలామంది ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్తున్నారని, జడ్జీలు కూడా వెళ్తున్నారని, ఇలా అందరూ హైదరాబాద్‌కు వెళ్తే విజయవాడలో ఎవరుంటారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం హైకోర్టుతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. (చదవండి: ‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు) -
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు భారీ ఊరట
ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన జార్ఖండ్ హైకోర్టు పిల్ ఆదేశాలను సోమవారం సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్‌పై విచారణ కోసం హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని సమర్థించింది జార్ఖండ్ హైకోర్టు. అయితే.. సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మాత్రం ఇవాళ.. ఆ ఆదేశం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. హేమంత్ సోరెన్ సత్యమేవ జయతే అంటూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq — Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022 దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2021లో మైనింగ్ లీజుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్.. బీజేపీ ఫిర్యాదు ద్వారా అనర్హత వేటు అంచున ఉన్నారు కూడా. మరోవైపు ఎన్నికల సంఘం సైతం.. అనర్హత వేటు వ్యవహారంలో గవర్నర్ రమేష్ అభిప్రాయం కోరింది. ఇదీ చదవండి: తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యండి అంతే! -
హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు
న్యూఢిల్లీ: ఆన్సర్ షీట్లను సమర్పించాల్సిందిగా, పునర్మూల్యాంకనం చేయాల్సిందిగా హైకోర్టులు జారీ చేసే ఆదేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో ఆ మేరకు నిబంధనలుంటే తప్ప అలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని పేర్కొంది. విచక్షణాధికారంతో నిర్దిష్ట ఆదేశాలిచ్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 హైకోర్టులకు కల్పించిన అధికారాలను ఈ విషయంలో ఉపయోగించరాదని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కొందరు పీజీ డిప్లొమా విద్యార్థుల ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనానికి ఆదేశిస్తూ 2019లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గత తీర్పులను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించింది. -
జనసేనకు హైకోర్టు షాక్.. ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖ జనసేన కార్యకర్తలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విశాఖ జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైని పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామని వెల్లడించింది. అసలు నిందితుడు కాని మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ను ఎలా సవాలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ప్యాకేజీల పవన్, బాబులతో ఒరిగేదేమీ లేదు: మంత్రి కాకాణి -
భార్యతో భర్త రిలేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
బనశంకరి: ఎలాంటి భావనాత్మక సంబంధం లేకుండా, భార్య అంటే డబ్బును అందించే ఏటీఎం యంత్రంలా వాడుకోవడం మానసిక వేధింపులతో సమానమని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను రద్దుచేసి మహిళ ఆకాంక్ష మేరకు విడాకులను మంజూరు చేసింది. వ్యాపారాలని డబ్బు కోసం ఒత్తిళ్లు వివరాలు... బెంగళూరులో 1991లో వివాహమైన దంపతులకు 2001లో ఆడపిల్ల పుట్టింది. వ్యాపారం నిర్వహిస్తున్న భర్త అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. ఈ సమయంలో భార్య ఉపాధి కోసం బ్యాంకు ఉద్యోగంలో చేరింది. 2008లో భర్త దుబాయిలో సెలూన్ తెరుస్తానంటే రూ.60 లక్షలు ఇచ్చింది. కానీ అక్కడ కూడా నష్టాలు రావడంతో భర్త మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. నిత్యం డబ్బు కావాలని పీడిస్తుండడంతో తట్టుకోలేక ఆమె విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. భర్త ధోరణిపై జడ్జిల ఆగ్రహం మంగళవారం ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ అలోక్ ఆరాదే, జేఎం.ఖాజీల ధర్మాసనం విచారించింది. భార్యతో ఆ భర్త ఎలాంటి అనుబంధం లేకుండా యాంత్రికంగా భర్త పాత్ర పోషిస్తున్నాడని, ఆమెను కేవలం డబ్బులు ఇచ్చే ఏటీఎంగా వాడుకుంటున్నాడని జడ్జిలు పేర్కొన్నారు. భర్త ప్రవర్తనతో భార్య మానసికంగా కుంగిపోయిందని ఇది మానసిక వేధింపులతో సమానమని స్పష్టం చేశారు. కానీ ఫ్యామిలీ కోర్టు ఈ అంశాలను పరిగణించడంలో విఫలమైందన్నారు. కేసును కూడా సక్రమంగా విచారించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. భార్య వాదనను పరిగణించిన హైకోర్టు ఆమెకు విడాకులు మంజూరుచేసింది. -
టీబీఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, మరమ్మతులు, సర్వీస్ కాంట్రాక్ట్ ఒప్పందం విషయంలో టెలీమ్యాటిక్ అండ్ బయో మెడికల్ సర్వీసెస్ (టీబీఎస్) సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.100 కోట్లకు పైగా బకాయిల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. బకాయిల చెల్లింపు, ఒప్పందం అమలు విషయంలో ప్రభుత్వంతో నెలకొన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించాలని కోరుతూ టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టేసింది. భవిష్యత్‌లో ఈ విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే దానిపై మధ్యవర్తిత్వానికి వెళ్లాలన్న నిబంధన ఏదీ ఇరుపక్షాలు మధ్య కుదిరిన ఒప్పందంలో లేదని తేల్చి చెప్పింది. బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ఎంతమాత్రం ఒప్పందం కిందకు రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ఇటీవల తీర్పు వెలువరించారు. కేసు నేపథ్యమిదీ.. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో బయో మెడికల్ ఉపకరణాల నిర్వహణ, సర్వీసు, మరమ్మతుల విషయంలో ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, టీబీఎస్ మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. 2018 వరకు ఈ ఒప్పందం అమలైంది. పరికరాల నిర్వహణలో టీబీఎస్ రూ.కోట్లమేర అక్రమాలకు పాల్పడినట్టు నిరూపణ అయింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, కోర్టు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ బయో మెడికల్ పరకరాల నిర్వహణలో టీబీఎస్ అక్రమాలు నిజమేనంటూ హైకోర్టుకు నివేదించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టీబీఎస్‌కు చెల్లింపులను నిలిపేసింది. అనంతరం టీబీఎస్తో ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందం అమలుకు సంబంధించి భవిష్యత్‌లో ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒప్పందం ఏమీ ఇరుపక్షాల మధ్య లేదు. అయినప్పటికీ టీబీఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన వస్తు సేకరణ మాన్యువల్‌లో మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని, అందువల్ల వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలని కోరుతూ హైకోర్టులో మధ్యవర్తిత్వ దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా విచారణ జరిపారు. అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడమేంటి! దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. బయో మెడికల్ పరికరాల నిర్వహణ విషయంలో టీబీఎస్ అక్రమాలను ఏసీబీ నిర్ధారించిందని, దీనిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసిందని హైకోర్టుకు నివేదించారు. రూ.కోట్ల మేర అక్రమాలకు పాల్పడి మధ్యవర్తిత్వానికి పిలవడం దారుణమన్నారు. అక్రమాలు జరిగిన చోట మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదన్నారు. అంతేకాక మధ్యవర్తిత్వానికి ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని, అందువల్ల మధ్యవర్తి నియామకమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. సుధాకరరెడ్డి వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించారు. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వానికి ఒప్పందం లేనప్పుడు మధ్యవర్తి నియామకం సాధ్యం కాదంటూ టీబీఎస్ దరఖాస్తును కొట్టేశారు. కేంద్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన ‘వస్తు సేకరణ మాన్యువల్’లో పేర్కొన్న అంశాలు కేవలం సలహా పూర్వకమైనవేనని, అందులో మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించినంత మాత్రాన, అది మధ్యవర్తిత్వ నిబంధన కాజాలదని హైకోర్టు తెలిపింది. అందువల్ల టీబీఎస్ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. -
యువకుడి బైక్ రేసు.. వెరైటీ శిక్ష విధించిన హైకోర్టు
సాక్షి, చెన్నై: బైక్ రేసులో దూసుకెళ్లిన ఓ యువకుడికి హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నెల రోజులు స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగంలో వార్డుబాయ్‌గా పనిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు.. చెన్నై నగరంలో, శివారుల్లోని బైపాస్, ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ మార్గాల్లో రాత్రుల్లో యువత బైక్ రేసు పేరిట దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. వీరిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న ఈ యువకులు మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్చి 21వ తేదీ బైక్ రేసులో దూసుకెళ్లిన కొరుక్కుపేటకు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను హైకోర్టులో ఆ యువకుడి తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. గురువారం పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, అతడికి వినూత్న శిక్షను విధించింది. మానసిక పరివర్తన కోసమే.. బైక్ రేసులో దూసుకెళ్లే యువకుల కారణంగా రోడ్డున వెళ్తున్న వారు ఎందరో ప్రమాదాల బారిన పడుతున్నారని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆస్పత్రుల్లోని అత్యవసర చికిత్సా విభాగాలకు తరలించడం జరుగుతోందని, అక్కడ వారు పడే వేదన వర్ణాణాతీతం అని పేర్కొన్నారు. అందుకే ప్రవీణ్ చెన్నై స్టాన్లీ ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో నెల రోజులు వార్డు బాయ్‌గా పనిచేయాలని ఆదేశించారు. ప్రమాదాల బారిన పడే వారి బాధల్ని చూసైనా ఇతడిలో మార్పు వచ్చేనా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఏపీ హైకోర్టు: ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష ఆపై..
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. వీరికి రెండు వారాల పాటు కోర్టు జైలు శిక్షను విధించింది. అయితే, జైలు శిక్ష విధించిన నేపథ్యంలో సదరు ఐఏఎస్‌లు ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. దీంతో కోర్టు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని కోర్టు పేర్కొంది. అలాగే, ఒకరోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఎనిమిది మంది ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పై తీర్పును వెలువరించింది. -
బీర్భూమ్పై సీబీఐ విచారణ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లాలోని బోగ్తూయి గ్రామంలో 10 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడంతో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సజీవ దహనాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అనారుల్ హుస్సేన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం డిమాండ్ చేశారు. -
బోట్లకు నిప్పు అంటించిన ఘటనలో రోడ్డెక్కిన వివాదం
Fight Between Two Groups Of Fishermen In Jalaripeta ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి రొడ్కెక్కింది. రింగు వలలతో వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం చిచ్చురేగిన విషయం తెలిసిందే. వాసవానిపాలెం, జాలరి ఎండాడ, మంగమారిపేటకు చెందిన కొందరు జాలర్లు రింగు వలలతో మంగళవారం వేటకు వెళ్లగా పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు అడ్డుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా పెదజాలరిపేటకు చెందిన 8 మందికి గాయాలుకాగా వాసవానిపాలెం, మంగమారిపేటకు చెందిన 6 బోట్లు దహనమయ్యాయి. అయితే బోట్లకు నిప్పు అంటించిన ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను మెరైన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ జాలరిపేటలో వాతావరణం వేడెక్కింది. జాలరిపేటలోని మత్స్యకారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాలరిపేటను ఆనుకొని ఉన్న ఆర్టీసీ కూడలికి భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. మహిళలు, యువతతో సహా వేల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టయిన మత్స్యకారులను విడుదల చేయాలంటూ వారంతా కొద్దిసేపు నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా తెడ్డిరాజు, పరసన్న వంటి పలువురు మత్స్యకార సంఘ నాయకులు మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన మత్స్యకారులను తక్షణమే విడుదల చేయాలని హెచ్చరించారు. గంటలో విడుదల చేయకుంటే బీభత్సం సృష్టిస్తామని తెడ్డి రాజు బహిరంగంగా హెచ్చరించడం, కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ తీసేందుకు కొందరు మత్స్యకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని నిలువరించారు. పెదవాల్తేర్ ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం మంత్రుల సదస్సుకు గైర్హాజరు రింగు వలల వివాదంపై ఇప్పటికే పలు అవగాహన సదస్సులు, సమావేశాలు మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే తాజా వివాదంతో బుధవారం మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు సమక్షంలో మరోసారి సమావేశం నిర్వహించేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇరువర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్‌లో నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సివుంది. అయితే ఇంతలో జాలరిపేట మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో సమావేశం నిలిచిపోయింది. పూచీకత్తుతో నిందితుల విడుదల ఈ ఘర్షణల్లో భాగంగా మంగళవారం 6 బోట్లు దహనం చేసిన విషయం తెసిందే. ఈ ఘటనకు సంబంధించి మెరైన్ పోలీసులు పిల్లా నూకన్న, వాడమదుల సత్యారావును అరెస్ట్ చేశారు. అయితే జాలరిపేట మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విడిచిపెడుతున్నట్లు ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. మెరైన్ పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు 41 నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతోపాటు పూచీకత్తులు రాయించుకొని విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో రాత్రి 8గంటల సమయంలో నూకన్న, సత్యారావు విడుదలై నిరసన శిబిరానికి చేరుకోవడంతో ఆందోళన ముగిసింది. అయితే తీర ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు అధికారులు వెల్లడించారు. హైకోర్టు ఉత్వర్వుల అమలుకు డిమాండ్ జిల్లాలో ఎంఎఫ్ఆర్ చట్టం – 1995 ప్రకారం రింగు వలలతో చేపల వేటపై వెంటనే నిషేధం అమలు చేయాలని పెదజాలారిపేట గ్రామ సేవా సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం పెదజాలరిపేట దరి కురుపాం సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ కుల పెద్ద తెడ్డు పరసన్న మాట్లాడుతూ కొత్తగా రింగు వలలకు అనుమతులు ఇవ్వరాదని కోరారు. తాము గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే సముద్రంలో 8 కిలో మీటర్లలోపు రింగు వలలతో వేట నిషేధం అమలు చేయాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తాము ఇప్పటికే రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ఆ శాఖ కమిషనర్‌ను కోరామని గుర్తు చేశారు. అయినప్పటికీ రింగువలలతో వేట చేయవద్దని చెప్పినందున తమ గ్రామ మత్స్యకారులపై మంగళవారం దాడి చేసి గాయపరచడం అన్యాయమన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేని మత్స్యశాఖ అధికారులు తమను గంగవరం నుంచి పెదనాగమయ్యపాలెం బీచ్ వరకు చేపలవేట చేయరాదని నిబంధనలు విధించడం విడ్డూరంగా వుందని విమర్శించారు. కార్యక్రమంలో తెడ్డు రాజు, తెడ్డు సత్తయ్య, ఒలిశెట్టి గురయ్య, తెడ్డు సతీష్ పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంవీపీ స్టేషన్ సీఐ రమణయ్య పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. చదవండి: దంత కళాశాలలో కీచక వైద్యుల లీలలు! -
భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు
Recording wife’s telephonic call without her consent is a blatant violation of her privacy చండీఘడ్: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్ సంభాషణలను సమర్పించాడు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 20, 2007లో సదరు భార్యభర్తలిరువురికీ వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఐతే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్ సంభాషణకు సంబంధించిన సీడీ, సిమ్ కార్డులను సాక్షాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని వాదించింది. ఐతే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతోకాదని భర్త తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పుపై తాప్సీ అసహనం
Taapsee Pannu Strongly Reacts to Chhattisgarh HC Order: స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను షూటింగ్స్‌తో ఎంత బిజీ ఉన్న సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలపై జరిగే దాడులు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తారు. తాజాగా అలాంటి ఘటనపై తాప్సీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అయ్యింది. ‘అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది’ అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: ఆ స్టార్ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్! కాగా భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడిన కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నిన్న(గురువారం) సంచలన తీర్పు వెలువరించింది. వివాహం చేసుకున్న భార్య ఇష్టానికి విరుద్దంగా, బలవంతంగా శృంగారం చేస్తే చట్ట ప్రకారం నేరం కాదని, అది అత్యాచారం కిందికి రాదంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేగాక ఈ కేసులో భర్తను నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్కే చంద్రవంశీ తీర్పు వెలువరించారు. దీంతో ఛత్తీస్గడ్ ఇచ్చిన ఈ తీర్పుపై తాప్సీతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాయనీ సోనా మొహపాత్రా కూడా ట్వీట్ చేస్తూ హైకోర్టు తీర్పును వ్యతిరేకించారు. Bas ab yehi sunna baaki tha . https://t.co/K2ynAG5iP6 — taapsee pannu (@taapsee) August 26, 2021 -
ట్రంప్, అమితాబ్‌లకు లాక్డౌన్ పాసులు!!
సిమ్లా: లాక్డౌన్ టైంలో జనాల అత్యవసరాల సేవల కోసం పోలీసులు ఈ-పాస్‌లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ పోలీసుల నిర్వాకంపై జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లకు లాక్డౌన్ ఈ-పాస్‌లు జారీ చేశారు అక్కడి పోలీసులు. ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కాగా, ఈ వ్యవహారం వెనుక ఉన్న జర్నలిస్ట్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వ్యవహారం కోర్టుకి చేరింది. లాక్డౌన్ టైంలోనూ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో యథేచ్చగా తిరుగుతుండడంతో అమన్ కుమార్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ‘ఈ-పాస్ వ్యవహారం’పై అనుమానపడ్డాడు. తన ఆధార్ వివరాల్ని ఇచ్చి.. ట్రంప్, అమితాబ్ ఫొటోలతో పాస్‌ల కోసం పోలీస్ ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కనీసం ఆ ఫొటోల్ని కూడా పట్టించుకోకుండా, దరఖాస్తుల్ని కూడా వెరిఫై చేయకుండానే పాస్‌లు జారీ చేశారు పోలీసులు. ఈ వ్యహారంపై మే 5న అమన్ కుమార్ రిపోర్ట్ చేసిన స్టోరీ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ జర్నలిస్ట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్ట్ కోసం ప్రయత్నించారు. ఈలోపే అమన్ అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించాడు. ఈ-పాస్‌ల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని, పత్రికా స్వేచ్ఛను పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే అతని విజ్ఞప్తిని మన్నించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. ఈ వ్యవహారంలో పోలీసులపై అక్షింతలు వేసింది. అంతేకాదు ఈ కేసు విచారణలో తదుపరి వాదనల వరకు అమన్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. చదవండి: సంసారానికి పనికి రాడనడం దాని కిందకే లెక్క! -
ఆనందయ్య ఐ డ్రాప్స్‌కు అనుమతినివ్వలేం
సాక్షి, అమరావతి: కరోనా చికిత్సకోసం ఆనందయ్య అందిస్తున్న మూలికా వైద్యంలోని నాలుగు రకాల మందుల పంపిణీకి అభ్యంతరం లేదని, అయితే కళ్లల్లో వేసే చుక్కల(ఐ డ్రాప్స్) పంపిణీకి మాత్రం ప్రస్తుతానికి అనుమతినివ్వలేమని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య ఐ డ్రాప్స్ పరిశుభ్ర వాతావరణంలో తయారు కావట్లేదని నిపుణుల కమిటీ తేల్చిందని వివరించింది. ఈ డ్రాప్స్‌ను వేసుకునేవారి కళ్లు దెబ్బతినే వీలుందని కూడా చెప్పిందని, అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమంది. ఐ డ్రాప్స్‌పై తదుపరి పరీక్షలు అవసరమని, ఇందుకు నెలకుపైగా సమయం పట్టే వీలుందని తెలిపింది. మీరు అనుమతిని ఇవ్వొద్దని, అయితే తమకు అవసరముందంటూ తమంతట తాముగా వచ్చేవారికి ఐ డ్రాప్స్ ఇచ్చేందుకు అడ్డుచెప్పవద్దని హైకోర్టు సూచించగా, ఆ పని తాము చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ దిశగా ఐ డ్రాప్స్ పంపిణీకి హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. దీంతో ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని, అలాగే ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వర నాయుడులు వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. అలాగే తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు తగిన భద్రత కల్పించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్ వేశారు. వీటిపై జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఐ డ్రాప్స్‌పై పూర్తిస్థాయి పరీక్షలు అవసరం... ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. మందు తయారీకి ఐదు రోజుల సమయం పడుతుందని ఆనందయ్య చెప్పారని, వెబ్సైట్ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు అందించే విషయంలో ఆనందయ్యకు అటవీశాఖ సాయం చేస్తుందని, గిరిజన కార్పొరేషన్ ద్వారా తేనె అందిస్తామని వివరించారు. కృష్ణపట్నం పోర్టులో ఖాళీగా ఉన్న ఓ గోదాములో మందు తయారు చేసుకోవచ్చునన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఐ డ్రాప్స్ సంగతేంటని ప్రశ్నించింది. నిపుణుల కమిటీ ఆనందయ్య ఇచ్చిన కే రకం మందు శాంపిల్స్‌ను పరీక్షించిందని, దీన్ని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. అయితే ఐ డ్రాప్స్‌పై కమిటీ అభ్యంతరాలు లేవనెత్తిందని, ప్రమాణాలకనుగుణంగా తయారీ లేదని తెలిపిందన్నారు. పూర్తిస్థాయి పరీక్షల నిమిత్తం 1–3 నెలల సమయం పట్టే వీలుందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమన్నారు. నెల రోజులంటే ఎక్కువ సమయమని, ఎలాంటి వాతావరణంలో చేయాలో చెబితే దానిప్రకారం ఆనందయ్య తయారు చేస్తారని ధర్మాసనం చెప్పగా.. అలా చేస్తున్నారో లేదో మళ్లీ నిపుణుల కమిటీ పరిశీలించాల్సి ఉంటుందని సుమన్ తెలిపారు. కోర్టును నిందించే పరిస్థితి రాకూడదు... ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ స్పందిస్తూ, ఐ డ్రాప్స్ అప్పటికప్పుడు తయారుచేసి వినియోగిస్తున్నారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) హరినాథ్ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని, గుజరాత్లో ఇలాంటి మందే తయారు చేస్తే సమర్థత, భద్రత కారణాలతో హైకోర్టు దాని పంపిణీని ఆపేసిందన్నారు. రేపు జరగరానిది జరిగితే అందుకు కోర్టును నిందించే పరిస్థితి ఉండకూడదన్నారు. తుది పరీక్షలు వేగవంతం చేయలేరా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. పలు సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, ఒక్కో సంస్థ నుంచి అనుమతి వచ్చేందుకు వారంపైగా పడుతుందని ఎస్‌జీపీ సుమన్ తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని అక్కడకొచ్చి వేసుకోనివ్వాలని, అలాంటి వారిని ఆపొద్దని ధర్మాసనం సూచించగా.. కరోనా తీవ్రంగా ఉన్నవారు అక్కడికి వస్తే కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుందని సుమన్ తెలిపారు. తయారుచేసిన ఐ డ్రాప్స్‌ను ఎంతకాలం వరకు భద్రపరచవచ్చునని ధర్మాసనం అడుగగా.. కొద్ది నిమిషాల వరకేనని అశ్వనీకుమార్ చెప్పారు. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఐ డ్రాప్స్కోసం 15–20 మంది వరకు వచ్చారని, ఇప్పుడు అంతకన్నా తక్కువమంది వచ్చే అవకాశముంటుందని ధర్మాసనం అడిగిన మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అలాగైతే ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. -
మూడు బెంచ్‌లు... మూడు తీర్పులు
కేవలం కొన్ని రోజుల వ్యవధి... మూడు కేసులు, మూడు బెంచ్‌లు–అదే హైకోర్టు. కానీ యువతీయువ కుల సహజీవన సంబంధాల విషయంలో వేర్వేరు తీర్పులు. సమాజంలో ఇలాంటి సంబంధాల విషయంలో ఎలాంటి వైఖరులు వ్యక్తమవుతున్నాయో, అవి ఎంత పరస్పర విరుద్ధంగా వుంటున్నాయో చెప్పడానికి ఈ మూడు తీర్పులూ ఉదాహరణ. న్యాయస్థానాలను సమాజానికి అతీతంగా లేదా వెలు పల వుంచి ఆలోచించటం సాధ్యం కాదు. న్యాయమూర్తులు చట్టాన్ని, న్యాయాన్ని అర్థం చేసుకున్న తీరునుబట్టి, వారి వారి సామాజిక అనుభవాలనుబట్టి తమ ముందుకొచ్చిన కేసుల్ని అన్వయించి తీర్పు చెబుతారు. అయితే ఆ తీర్పులు పురోగామి దృక్పథంతో వుంటే సమాజంలోవుండే దురభిప్రా యాలు సడలుతూ, అది క్రమేపీ మెరుగుపడే అవకాశం వుంటుంది. న్యాయమూర్తులు సైతం కులాధి క్యత, పురుషాధిక్యత, వివక్ష వంటి అంశాల చట్రాన్ని దాటకపోతే ఆ మేరకు సమాజం నష్టపోతుంది. మూడు కేసుల్లోని సారాంశమూ ఒకటే. పెళ్లీడు వచ్చిన ఆడ–మగ జంటలు తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా వెలుపలికొచ్చి సహజీవనం సాగిస్తున్నారు. పెద్దవాళ్లనుంచి ఆ జంటలకు ప్రమాదం ముంచు కొచ్చింది. ముందుగా పోలీసులను ఆశ్రయించి, అక్కడ సరైన స్పందన లేదన్న ఆందోళనతో పంజాబ్, హరియాణా కోర్టును ఆశ్రయించారు. మొదటి కేసులో ఈనెల 11న తీర్పు వెలువడింది. తమకు పెద్దవాళ్లనుంచి ప్రాణహాని వున్నదని, రక్షణ కల్పించాలని కోరిన పిటిషన్ జస్టిస్ హెచ్ఎస్ మదాన్ నేతృత్వంలోని ధర్మాసనంముందుకు రాగా, ‘ఇలాంటి సంబంధాలు సామాజికంగానూ, నైతికంగానూ అంగీకరించదగ్గవి కాదు. అందువల్ల పిటిషనర్లు కోరుతున్నట్టు రక్షణ కోసం ఆదేశాలివ్వలేం’ అంటూ తోసిపుచ్చింది. ఆ మర్నాడు ఈ మాదిరి కేసులోనే జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ నాయకత్వంలోని ధర్మాసనం ఇలాంటి కారణాన్నే చెప్పి భద్రత కల్పించాలన్న మరో జంట వినతిని తోసిపుచ్చింది. ‘ఇలాంటివారికి రక్షణ కల్పిస్తే మొత్తం సమాజ నిర్మాణమే చెదిరిపోతుంది’ అంటూ కొంత కటువుగానే న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కానీ మూడో కేసులో జస్టిస్ సుధీర్ మిత్తల్ నాయకత్వంలోని ధర్మాసనం గురువారం పూర్తి భిన్నమైన తీర్పునిచ్చింది. పెళ్లీడు వచ్చినవారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని పరస్పర అంగీకారంతో కలిసివుండొచ్చని...అది పెళ్లి ద్వారానా లేక మరోవిధంగానా అనేది పూర్తిగా వారి ఇష్ట మని, పౌరులుగా అది వారికుండే ప్రాథమిక హక్కని తేల్చిచెప్పింది. అంతేకాదు... వివాహంతో ప్రమేయం లేని సహజీవన సంబంధాలు వర్తమానకాలంలో నగరాల్లోనేకాక గ్రామాల్లో కూడా పెరుగు తున్నాయని న్యాయమూర్తి చెప్పారు. ఏ సంబంధాన్నీ చట్టం నిషేధించనప్పుడు అలాంటి సంబం ధాల్లో వుండేవారికి రక్షణ కల్పించాల్సిందేనని తేల్చిచెప్పారు. మన దేశంలో పెద్దలకు నచ్చని పెళ్లి చేసుకుని న్యాయస్థానాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. వ్యక్తులుగా ఇలాంటి సంబంధాల విషయంలో న్యాయమూర్తులకు ఎలాంటి అభిప్రాయాలున్నా అవి తీర్పుల్లో ప్రతిబింబించకుండా వుండటమే మేలు. ఎందుకంటే మన రాజ్యాంగం చాలా అంశాల్లో సమాజం ఆచరించే విలువలకు భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ వివక్ష లేని సమాజం ఏర్పడాలని రాజ్యాంగం ఆకాంక్షించింది. అందుకనుగుణమైన అధికర ణలు అందులో పొందుపరిచారు. పైగా మూడేళ్లక్రితం ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పును వెలువరించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఆ ధర్మాసనం వ్యక్తి స్వేచ్ఛ, ప్రతిష్టల్లో ఎంపిక చేసుకోవటమన్నది విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం అనుసరించిన ఆ వైఖరి దేశంలోని మారుమూలవుండే కిందిస్థాయి కోర్టు వరకూ... పోలీసులు, పాలనా యంత్రాంగం తోసహా అన్ని వ్యవస్థలకూ శిరోధార్యమైనది. హరియాణా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ప్రేమించుకోవడం, స్వతంత్రంగా పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడటం యువతీయువకుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నదని శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. అయినా పంజాబ్, హరియాణా హైకోర్టులో రెండు ధర్మాసనాలు అందుకు విరుద్ధమైన తీర్పులివ్వడం విచారించదగ్గ విషయం. ఈ మూడు జంటలూ తాము కలిసి బతకాలనుకుంటున్నామని, కానీ పెద్దవాళ్లు అందుకు నిరా కరించి ప్రాణహాని తలపెడతామని హెచ్చరిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించాయి. రక్షణ కల్పిం చాలని కోరాయి. న్యాయమూర్తులు ఆ పరిమిత అంశానికి లోబడి అలాంటి పౌరుల భద్రతకు అవసరమైన ఆదేశాలివ్వాలి. కానీ అందుకు భిన్నంగా నైతికత గురించి, తల్లిదండ్రుల అభీష్టానికి భిన్నంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వల్ల సమాజానికి ఏర్పడే ఉపద్రవం గురించి ఉపన్య సించి, రక్షణ కల్పించలేమని తిరస్కరించడం ప్రమాదకరమైన ధోరణి. వాస్తవానికి పంజాబ్, హరి యాణా, మరికొన్ని ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలాచోట్ల ఈమాదిరి జంటలు నిత్యం ప్రాణభయంతో బతుకుతున్నాయి. ఇలాంటి ఉదంతాల్లో తల్లిదండ్రుల వల్లమాలిన ప్రేమ, కుల మత వివక్ష, ఆర్థిక కారణాలు వగైరాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అనేక ఉదంతాల్లో పోలీసులు సైతం ఈ ప్రభావాలకు లోనై ఆ జంటలకు రక్షణ కల్పించడానికి నిరాకరిస్తుంటారు. ఇక న్యాయస్థానాలు సైతం అదే దృక్పథాన్ని ప్రదర్శిస్తే సమాజం ఎప్పటికీ వెనకబాటుతనాన్నే ప్రదర్శిస్తుంది. అది అవాంఛనీయం. -
800 తాబేళ్ల మృతి.. కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
భువనేశ్వర్: ఆలివ్ రిడ్లేల మృత్యువాతపై రాష్ట్ర హైకోర్టు చొరవ కల్పించుకోవడం విశేషం. గహీరమ తీరంలో లెక్కకు మించి ఆలివ్‌రిడ్లే రకం తాబేళ్లు మరణిస్తుండడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ కేంద్రాపడ జిల్లా కలెక్టర్, అటవీ-పర్యావరణ విభాగం కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే గహీరమర మెరైన్ సాంక్చువరిలో ఆలివ్ రిడ్లేల సంరక్షణ మార్గదర్శకాల కార్యాచరణ సమీక్షించేందుకు హైకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న డాక్టర్ కార్తీక్ శంకర్(బెంగళూరు), పర్యావరణ విభాగం డైరెక్టరు డాక్టర్ సుశాంత నొందొ, న్యాయవాది మోహిత్ అగర్వాల్ గహీరమ, రుసికుల్యా సాగర తీరాలను సందర్శిస్తారు. అనంతరం ఆలివ్ రిడ్లేల సంరక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మత్స్యకారులు, స్థానికులు ఇతర అనుబంధ వర్గాలతో కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా భేటీ అయి సంప్రదిస్తారు. మార్చి 10వ తేదీ నాటికి ఈ కమిటీ నివేదిక దాఖలు చేస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో ఆలివ్ రిడ్లేలు మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటుండగా, ఈ విషయంపై పలు వార్తా పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఈ కేసు విచారణ మార్చి 15వ తేదీ నాటికి వాయిదా పడగా, జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 800 తాబేళ్లు మృతి చెందినట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి గహీరమ శాంక్చువరీ తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల పొడవునా నీటిపై తేలిన తాబేళ్ల కళేబరాలు నిలువెత్తు సాక్ష్యంగా వ్యాజ్యంలో తెలిపారు. సియాలి నుంచి నాసి వరకు పలు తీరాల్లో తాబేళ్ల కళేబరాలు తారసపడ్డాయి. 1997లో గహీరమ-రూర్కీ ప్రాంతాన్ని మెరైన్ సాంక్చువరీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆలివ్‌రిడ్లే సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంక్షలు కూడా జారీ చేసింది. గతేడాది నవంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు గహీరమ తీరంలో 20 కిలో మీటర్ల పొడవునా చేపల వేట కూడా ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, గహీరమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాబేళ్ల సంతతి ఉత్పత్తి తీరంగా వెలుగొందుతుండడం విశేషం. చదవండి: బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్ -
వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది..
సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా హిమని సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ్ రెడ్డి, యేసురత్నం తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గాంధీ ఆలోచనలు నేడు దేశానికి అవసరం. మత సహనం,దళితుల, ముస్లింలు, పేదలపై దాడులను గాంధీజీ ఖండించారు. అన్నీ కులాలను కలుపుకుని ముందుకు నడిపిన సమగ్ర నాయకత్వం ఆయన సిద్దాంతాలలో ఉంది. దళితులు, దేవాలయాలపై దాడులు దేశానికి మంచిది కాదు. గాంధీజీ ఆలోచనలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. యుపిలో దళిత మహిళను రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అన్నారు. (చదవండి: మహాత్ముడికి సీఎం జగన్ నివాళి) ‘నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తోంది. ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి దక్కుతుంది. మా ప్రభుత్వం వచ్చాక అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. వారిలో 85 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ దళితులపై ఏదో ప్రేమ ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. వారి హయాంలో దళితులపై దాడి జరిగితే చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. జగన్ సీఎం అయ్యాక చట్టపరంగా సీఐ, ఎస్సై స్థాయి వారిపైనా చర్యలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు, పార్టీలు దళిత ఎజెండాను అమలు చేస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ ఆందోళన చేసింది. వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వానికి అండగా ఉన్న దళితులను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దళిత సంఘాలు వారి మాటలు నమ్మొద్దు. మీకు అండగా ఉండేది మా ప్రభుత్వం. ఆర్థిక వేత్తలు చెప్తున్న ప్రజల్లోకి మనీ ఫ్లో అనే సూత్రాన్ని ఒక్క జగన్ గారు అమలు చేస్తున్నారు’ అని మాణిక్య వరప్రసాద్ అన్నారు. ‘వైఎస్సార్ కుటుంబానికి కులం లేదు.. మతం లేదు. ప్రతిపక్షానికి దేవాలయాలపై, దళితులపై మీకు ప్రేమ లేదు. దళితులను రెచ్చగొట్టడం, మత కలహాలు సృష్టించడమే పని. ప్రభుత్వాన్ని, జగన్‌ను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా అతని ఎజెండా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎజెండా నుంచి జగన్ ఎప్పుడూ పక్కకి వెళ్ళారు. ఆయా వర్గాలన్నీ జగన్ వెనుకనే ఉన్నాయి. చిత్తూరు సంఘటనలో ప్రభుత్వం చక్కగా పని చేస్తోంది. కొన్ని దళిత సంఘాలు వాస్తవాలను తెలుసుకోవాలి. పేదలకు, దళితులకు ఇల్లు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తులెవరో అందరికీ తెలుసు. ఏదయినా సంఘటన జరిగినా రాజకీయాలకు అతీతంగా దళిత సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. (చదవండి: ‘ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది’) అలానే ‘కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయ స్థానాలపై ఉంది. న్యాయ పరిపాలనను వదిలేసి ప్రజా పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది. కోర్టులు న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకు న్యాయం అందించాలి. కాని కోర్టు పరిపాలన చేస్తామంటే రాజ్యాంగం అనుమతించదు. కోర్టుకు అలాంటి పోకడలు మంచిది కాదు గాంధీజీ విలువలకు అది విరుద్దం. మహానుభావులు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కోర్టులు పని చేయాలి. హైకోర్టులో జరుగుతున్న ఘటనలు ప్రజలను కలచి వేస్తున్నాయి. ప్రభుత్వంలో జోక్యం చేసుకునే న్యాయ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదు. పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగం ఉద్దేశాలే కనుమరుగవుతాయి. దీనిపై న్యాయ వ్యవస్థలు ఆలోచనలు చేయాలి. కోర్టులు కూడా సహనం కోల్పోవడం సరికాదు ఓర్పుతో వ్యవహరించాలి’ అని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. -
హైకోర్టు తీర్పుకాపీ అందేవరకూ ఆందోళనలు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. అవి దొందూ దొందే అన్న చందంగా మారాయనే విషయం స్పష్టమవుతోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నాయకుడు లింగమూర్తి మూడు రోజులుగా రాంనగర్లో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం రాత్రి అఖిలపక్షం నేతలు ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వినోద్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, కె.గోవర్ధన్, కె.రమ తదితరులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి కోర్టు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ సమ్మెను చట్ట వ్యతిరేకంగా గుర్తించడానికి కోర్టు అంగీకరించలేదని, కార్మికులను బిడ్డలుగా చూడాలి తప్ప అణచివేసే ధోరణి మంచిదికాదని మొదటి నుంచీ చెబుతోందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ చూసేవరకు ఆందోళనలు ఆపకుండా యథావిధిగా కొనసాగుతాయని, నేడు తలపెట్టిన సడక్ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ప్రధాన డిమాండ్లు సాధ్యమవుతున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో సాధ్యం కాకపోవడానికి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలనే స్వార్థ బుద్ధే అసలు కారణమనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందన్నారు. హైకోర్టు సాక్షిగా దాఖలు చేసిన పిటిషన్, కేసీఆర్ మాటలు ఒకేరకంగా ఉన్నాయన్నారు. కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల 45 రోజుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్, సుధాభాస్కర్, డి.జి. నర్సింగ్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, ఎస్.ఎల్. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’కు ఎస్ఈసీ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పోల్స్’నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సమాయత్తమవుతోంది. పురపాలక సంఘాల ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ దానికి తగ్గట్టుగా ప్రాథమిక కసరత్తును పూర్తి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగర/పురపాలికల రిజర్వేషన్ల జాబితా అందగానే ఎన్నికల నగారా మోగించాలని భావిస్తోంది. పంద్రాగస్టులోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు పలు కేసులు హైకోర్టులో దాఖలు కావడం.. ఎన్నికలను నిలుపుదల చేస్తూ కోర్టు స్టే ఇవ్వడం తెలిసిందే. వారం క్రితం ఈ పిటిషన్లను విచారించిన కోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు కసరత్తుకు అనుమతినిస్తూ..తుది తీర్పును దసరా అనంతరం వెలువరిస్తామని ప్రకటించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ తీర్పు వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తీర్పు వచి్చన మరుక్షణమే రిజర్వేషన్ల ఖరారు విధివిధానాలను విడుదల చేయనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువడటానికి ముందే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు పనులు, ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ సూచించింది. -
టీడీపీ నేతపై హైకోర్టు సీరియస్..!
సాక్షి, కదిరి: తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెన్లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్ 2 గన్మెన్లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ‘కందికుంట తాజా మాజీ ఎమ్మెల్యే కూడా కాదు. ఆయనపై మొత్తం 22 కేసులున్నాయి. అందులో నకిలీ డీడీలకు సంబంధించి 2 కేసుల్లో శిక్ష కూడా పడింది. ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెన్లు ఎలా ఇస్తారు?’ అంటూ హైకోర్టు మండిపడటంతో పాటు గన్మెన్లను తిరిగి నియమించాలని కోరడంలో అర్థం లేదని సీరియస్ అయ్యింది. ఈ తీర్పుతో కందికుంట వర్గం డీలా పడిపోగా, అదే పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వర్గం ఆనందంలో మునిగి పోయింది. దీన్ని చూసి అత్తార్ చాంద్‌బాషాకు కూడా గన్మెన్లను తొలగించాలని కందికుంట వర్గం డిమాండ్ చేస్తోంది. -
వైద్య, ఆరోగ్యశాఖలో అవినీతిపై విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్యశాఖలో భారీ అవినీతి జరిగిందంటూ ఇందుకూరి వెంకట రామరాజు వేసిన పిల్‌పై గురువారం హైకోర్టులో వాదనలు నడిచాయి. దాదాపు 230 కోట్ల రూపాయల మేరకు వైద్య పరికరాలు, సేవల నిర్వహణలో అవినీతి జరిగిందని 2018 జూలై 26న హైకోర్ట్‌లో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపించాలని గతంలో ఎసీబీని న్యాయస్థానం ఆదేశించింది. ఎసీబీ విచారణ జరిపి, నివేదిక కోర్టుకు సమర్పించే సమయంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకున్నారు. 2018 జూలై 26 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఏసీబీ విచారణ చేయరాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్‌పై వచ్చే నెల 14న వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది. అలాగే పిటిషనర్ ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో అధిక మొత్తాలకు టెండర్లు ఇచ్చిన సంస్థ నుంచి 24 కోట్ల రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అంగీకరించింది. -
ఆమె నా ‘భార్య’... కాదు అతను మా అంకుల్
సింగపూర్ : పన్నెండేళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అకృత్యానికి పాల్పడిన భారత్‌కు చెందిన ఓ వ్యక్తికి 13 ఏళ్ల జైలు, 12 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తూ సింగపూర్ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఇక్కడి మినిమార్ట్‌లో పనిచేసే ఉదయ్‌కుమార్ దక్షిణామూర్తి (31) అనే వ్యక్తి షాప్‌నకు వచ్చిన ఓ బాలికకు ఉచితంగా తినుబండారాలు, ఆడుకొనే బొమ్మలు ఇచ్చి వశపర్చుకున్నాడు. మూడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అనుమానం రావడంతో ఈ కామాంధుడి లీలలు వెలుగుచూశాయి. ఈ ఘటన 2016లో చోటుచేసుకోగా 2019 జనవరి 10న నేర నిరూపణ అయింది. జ్యూడిషియల్ కమిషనర్ పాంగ్ ఖాంగ్ తెలిపిన వివరాలు ప్రకారం.. ఉదయ్‌కుమార్ దక్షిణామూర్తి మినిమార్ట్‌లో పనిచేస్తుండగా.. మైనర్ బాలిక ఆ షాప్‌నకు వెళ్లేది. ఆమెకు డబ్బు, బొమ్మలు తినుబండారాలు ఆశ చూపి.. రోజూ తనతో పాటు షికార్లకు తీసుకెళ్లేవాడు. అలా మూడు మాసాలపాటు ఆమెను లైంగికంగా మోసం చేశాడు. 2016 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఆ కామాంధుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎవరైనా ఈ ఇద్దరి వ్యవహారంపట్ల అనుమానం వ్యక్తం చేస్తే.. ‘తను నా భార్య’ అని నమ్మబలికేవాడు. ఆ బాలిక మాత్రం అతను మా అంకుల్ అని అమాయకంగా బదులిచ్చేది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి దక్షిణామూర్తి బాలికను మరింతగా నమ్మించాడు. అయితే, అక్టోబర్‌లో ఓ రోజు దక్షిణామూర్తి నిజమైన గర్ల్‌ఫ్రెండ్ ఈ ఇద్దరినీ ఓ హోటల్ వద్ద చూసింది. దక్షిణామూర్తి మరో అమ్మాయితో అఫైర్ కొనసాగిస్తున్నాడని నిశ్చయించుకుంది. ఓ రోజు దక్షిణామూర్తి మొబైల్‌ను చెక్ చేయగా అందులో... సదరు బాలిక నగ్న చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన హైకోర్టు దక్షిణామూర్తిని దోషిగా తేలుస్తూ కఠిన శిక్షలను విధించింది. -
బీజేపీ రథయాత్రకు హైకోర్టు బ్రేక్
కోల్‌కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. శుక్రవారం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లాలో ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’పేరుతో అమిత్ షా ప్రారంభించాల్సి ఉన్న రథయాత్రకు అనుమతులు ఇవ్వలేమని గురువారం తేల్చిచెప్పింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో బీజేపీ బెంగాల్ శాఖ బుధవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్త వాదనలు వినిపిస్తూ.. బీజేపీ కూచ్‌బెహర్ రథయాత్రకు అనుమతి ఇవ్వలేమని, యాత్ర వల్ల రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రథయాత్రకు కూచ్‌బెహర్ ఎస్పీ అనుమతి నిరాకరించినట్లు దత్త కోర్టుకు చెప్పారు. గతంలో ఈ జిల్లాలో మతపర ఘర్షణలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయని వివరించారు. అలాగే ఈ కూచ్ రథయాత్రకు బీజేపీ అగ్రనేతలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇవన్నీ మతపరంగా సున్నితమైన ఈ జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఎవరిది బాధ్యత..? రథయాత్రలో భాగంగా ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో 3 యాత్రలను నిర్వహిస్తామని బీజేపీ హైకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. రథయాత్రల్లో ఏమైనా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యతని ప్రశ్నించారు. అయితే ఘర్షణలు జరుగుతాయన్న కారణాలు చూపి అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ తరఫు న్యాయవాది తెలిపారు. రథయాత్రకు సంబంధించి తాము అక్టోబర్‌లోనే అనుమతికి దరఖాస్తు చేసుకున్నామని, ఇన్నాళ్లు జాప్యం చేసి ఇప్పుడు అనుమతి నిరాకరిస్తున్నారని అన్నారు. తదుపరి విచారణను కోర్టు జనవరి 9కి వాయిదావేసింది. -
కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో అప్పీళ్లు మూసివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు మూసివేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై విచారణ జరిపి ప్రయోజనం లేదన్న హైకోర్టు వీటిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఈ అప్పీళ్లను మూసివేసిన నేపథ్యంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జిని కోరింది. తమను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బహిష్కరణ తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు ప్రకారం తమ పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చలేదని, ఇది కోర్టు ధిక్కారమేనంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుతో పాటు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం జారీ చేసిన ఫాం 1 నోటీసుల అమలుపై కూడా స్టే విధించింది. తాజాగా ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా, కోమటిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను మూసివేయవచ్చని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేర అప్పీళ్లను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
బడిలోనే అత్యాచారమా?
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగున్నర ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటనపై హైకోర్టు స్పందించింది. అభంశుభం తెలియని చిన్నారిని పాఠశాల శానిటేషన్ సూపర్వైజర్ అత్యాచారం చేశాడని, సదరు స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలన్న కేసులో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి స్కూళ్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్నారిపై పాఠశాలలో పనిచేసే శానిటేషన్ సూపర్వైజర్ అత్యాచారం చేశాడని, ఈ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మిర్ యూసఫ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రతివాదులై న స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, రాష్ట్ర విద్యా శాఖ ము ఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు. అనం తరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
సీఈవో నోటిఫికేషన్‌ను తప్పుపట్టలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రద్దు నేపథ్యంలో ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 15 రోజులకు కుదించడా న్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) జారీ చేసిన నోటిఫికేషన్‌ను తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల నమోదు ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 45 రోజులుగా నిర్ణయించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్స్ ఎమన్సిపేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది అవినాశ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని తాము కోరడం లేదన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. శాసనసభ రద్దు నేపథ్యంలో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, ఈ నేపథ్యంలోనే అభ్యంతరాల గడువును కుదించిందని వెల్లడించింది. సీఈవో నోటిఫికేషన్‌ను తప్పుపట్టలేమని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టేసింది. -
వారికి ఉరిశిక్ష ఖరారు చేయండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు తాము విధించిన ఉరిశిక్ష ఖరారు చేయాలంటూ కేసు ఫైళ్లను హైకోర్టుకు కింది కోర్టు నివేదించింది. ఫైళ్లను పరిశీలించిన హైకోర్టు.. ఉరిశిక్ష ఖరారులో నిర్ణయం తీసుకునేందుకు వాటికి నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయల్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఉరిశిక్ష పడిన దోషుల వాదనలు వినేందుకు వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరికీ జైలర్ ద్వారా నోటీసులు అందజేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. జంట పేలుళ్ల కేసులో అనీక్, ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈ నెల 10న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దోషులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్‌కు జీవిత ఖైదు విధించగా మరో ఇద్దరు నిందితులు సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉన్నందున కేసు ఫైళ్లను కింది కోర్టు గతవారం హైకోర్టుకు పంపింది. -
దేవుడి భూములకు పంగనామాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో దేవుడి భూములకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోంది. ఆ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పులతో పాటు తాను చేసిన చట్టాలను, జారీచేసిన మెమోలను సైతం లెక్క చేయడంలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న దేవాలయాల భూములకు ఎటువంటి రైతువారీ పట్టాలు చెల్లబోవని, గతంలో రైతు వారీ పట్టాలు ఇచ్చినప్పటికీ అవి పనికిరావని స్పష్టం చేస్తూ సీఆర్డీఏ 2015 సంవత్సరంలో మెమో జారీ చేసింది. ఆ భూమలన్నీ కూడా ధార్మిక సంస్థలకే చెందుతాయని ఆ మెమోలో స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న ఆలయాల భూములకు కేవలం పరిహారం మాత్రమే సదరు ధార్మిక సంస్థలకు చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు మాత్రం ఆక్రమణదారుల పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో దేవుడి భూములపై గతంలో హైకోర్టుకు సీఆర్డీఏ ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి చట్టానికి విరుద్ధంగా రైతు వారీ పట్టాల సాకుతో ఈనాం భూముల ఆక్రమణదారులకు కోట్ల రూపాయల విలువైన ప్లాట్లను కట్టబెడుతుండటంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్లాట్లు, పరిహారం కూడా ఆలయాలకే రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా వివిధ దేవాలయాలకు చెందిన 843.87 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. మరో 173.22 ఎకరాలకు సంబంధించి దేవాదాయ శాఖతో పాటు రైతులు కూడా ఆ భూములు తమవంటూ క్లెయిమ్ చేయడంతో ఆ భూములపై సీఆర్డీఏ నిర్ణయం తీసుకోలేదు. రాజధానిలోని ఆలయాలకు, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములన్నీ ఆయా సంస్థలకే చెందాలని, ఎటువంటి రైతు వారీ పట్టాదారులకు ఆ భూములపై హక్కు లేదని దేవాదాయ శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులతో ఆ భూములను సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలకు చెందిన భూములకు సంబంధించి పూర్తి పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా ఆయా ఆలయాల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు జమ చేయాల్సిందిగా ఆ షరతుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టుకు సీఆర్డీఏ లిఖితపూర్వక అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగానే సీఆర్డీఏ మెమో జారీ చేసింది. ఆ మెమోలో.. ఎటువంటి రైతు వారీ పట్టాలు జారీ చేయడానికి వీల్లేదని, ఇప్పటికే జారీ చేసి ఉంటే అవి చెల్లుబాటు కావని, ఆ భూములపై పూర్తి హక్కులు ఆయా సంస్థలకే చెందుతాయని మెమోలో స్పష్టం చేసింది. రైతువారీ పట్టాలు చెల్లవు.. ఈనాం భూములకు ఇచ్చిన పట్టాలపై 2015లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వింజమూరి రాజగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసుల్లో హైకోర్టు గతంలో స్పష్టంగా పేర్కొంది. ఈనాం భూములకు సంబంధించి 1956 చట్టం ప్రకారం రైతు వారీ పట్టాలు ఇవ్వడానికి ఆస్కారం లేదని, ఒక వేళ రైతు వారీ పట్టాలు ఇచ్చినా అవి చెల్లుబాటు కావని, ఈనాం భూములన్నీ కూడా ఆయా ఆలయాలకు మాత్రమే చెందుతాయని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రైతువారీ పట్టాలు జారీ చెల్లబోవని 2013లో చేసిన చట్టసవరణను ఈ తీర్పు ద్వారా హైకోర్టు సమర్థించినట్లు అయిందని న్యాయశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈనాం భూములను ఆక్రమించుకున్న రైతులు తమకే పరిహారం చెల్లించాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దేవుని భూములకు పరిహారాన్ని ఆయా ఆలయాలకు చెల్లించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లను మాత్రం ఆక్రమణదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడించిందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
గడువు కుదించడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 15 రోజులకు కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓటర్ల నమోదు ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 45 రోజులుగా నిర్ణయించేలా ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్స్ ఎమన్సిపేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ ఈ పిల్ దాఖలు చేశారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. మొదట 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఓటర్ల నమోదు గడువును 2018 జనవరి 1గా మార్చారని పిటిషనర్ వివరించారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోనే ఏకంగా 1.57 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. అధికార పార్టీ అండతోనే ఇది జరిగిందని ఆరోపించారు. ఓట ర్ల పరిశీలనకు అధికారులు ఉదయం 11 నుంచి సాయం త్రం 5 గంటల మధ్య వస్తారని, ఈ సమయంలో ఉద్యోగులు వారి ఉద్యోగాలకు వెళతారని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే వారి ఇంటికి తాళాలు వేసి ఉంటాయన్నారు. ఇలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు. ఏపీ ఓటర్లే లక్ష్యంగా..: కూకట్పల్లి నియోజకవర్గంలో నివాసముంటున్న ప్రజల్లో 50 శాతం మంది ఏపీకి చెందిన వారని, ప్రభుత్వం వీరినే లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియను చేపడుతోందన్నారు. ఇలా ఇప్పటి వరకు 1.57 లక్షల మంది ఓట ర్లను తొలగించారని, ఇది అన్యాయమని తెలిపారు. ఇలా తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యం కావాలంటే ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు తగినంత సమయం ఉండాలని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 25న విచారణ జరిపే అవకాశం ఉంది. -
కుంభకర్ణ నిద్రలో ఉన్నారా..?
సాక్షి,హైదరాబాద్: వృత్తివిద్య పూర్తి చేసిన ఒక విద్యార్థికి డీఈఈడీ (డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)లో ప్రవేశం కల్పించాలన్న తమ ఆదేశాల్ని డీఈఈ సెట్ కన్వీనర్ రమణకుమార్ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఉత్తర్వుల్ని అమలు చేయకుండా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు రూ.లక్ష జరిమానా ఎందుకు విధించ కూడదో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మా సనం నిలదీసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈలోగా తమ ప్రశ్నలకు జవాబులతో కౌంటర్ దాఖలు చేయాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. వృత్తివిద్య పూర్తి చేసిన వారు డిప్ల మో కోర్సులో చేరేందుకు అనర్హులనే నిబంధనను ఒక విద్యార్థి సవాల్ చేశారు. ఆ విద్యార్థికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా డీఈఈడీలో ప్రవేశం కల్పించాలని ఆగస్టు 17న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో విద్యార్థి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కన్వీనర్ రమణ కుమార్ స్వయంగా కోర్టుకు హాజరై విద్యార్థికి ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. మరోసారి వ్యాజ్యం విచారణకు రావడంతో విద్యార్థి తరఫు న్యాయవాది రామన్ వాదిస్తూ.. కోర్టు ధిక్కార కేసు వేస్తేగానీ ప్రవేశం కల్పించలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గట్టిగా తేల్చి చెబితేగానీ స్పందించరా.. రూ.లక్ష జరిమానా ఎందుకు విధించరాదో వచ్చే వారం జరిగే విచారణలోగా కౌంటర్ ద్వారా తెలియజేయాలని కన్వీనర్‌ను ఆదేశించింది. -
‘సినీ లైంగిక వేధింపుల’ కేసులో సర్కార్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా కళాకారులపై లైంగిక వేధింపులు–దోపిడీలకు సంబంధించి చట్టంలో వచ్చిన మార్పుల గురించి, వాటి అమలు తీరు గురించి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపులు–దోపిడీల ఆరోపణలపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సామాజిక ఉద్యమకారిణి సంధ్యారాణి, మహిళా హక్కులపై పనిచేస్తున్న మరో ఆరుగురు ఉద్యమకారులు సంయుక్తంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళాశిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక శాఖ కమిషనర్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపించారు.‘తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఒక కళాకారిణి రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది. వీటిపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతివాదులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది’అని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు కమిటీ లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ లైంగిక వేధింపుల నివారణకు చట్టాలు ఏం చెబుతున్నాయో.. వాటి అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో న్యాయ సేవాధికార సంస్థ సేవల్ని వినియోగించుకోవాలని హోం శాఖను ఆదేశించింది. సుమోటోగా ఆ సంస్థ సభ్యకార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. తెలంగాణ మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నిం చింది. ఇలాంటి ఆరోపణలపై అంతర్గత కమిటీలు ఇతర చోట్లా లేవని కోర్టు అభిప్రాయపడింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసింది. -
హిజ్రాల్ని అరెస్ట్ చేయవద్దు
సాక్షి,హైదరాబాద్: హిజ్రాలకు సంబంధించిన యూనక్ చట్టం ప్రకారం వారిని అరెస్టు లేదా విచారణలు చేయవద్దని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యూనక్ చట్టంలోని 1329 ఎఫ్‌లోని సెక్షన్ 4, 5ల్లో కొన్ని నిబంధనలు హిజ్రాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వస్తువులపై ముద్ర వేసినట్లుగా ఈ చట్ట ప్రకారం హిజ్రాలపై ముద్ర వేయడం మానవత్వానికే మచ్చ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. యూనక్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ హిజ్రాల సామాజిక హక్కుల ఉద్యమకారులు, హిజ్రాలైన వి.వసంత మోగ్లి సహా ముగ్గురు దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. యూనక్ (నపుంసకుత్వం) అనే పదాన్ని ప్రయోగించడమే హిజ్రాలను కించపరచడమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. కొత్త రాష్ట్రం వచ్చాక కూడా ఈ చట్టం అమలును కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ చెప్పారు. వాదనల అనంతరం ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
ఆర్టిజన్లకు పండుగ రోజు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల(ఆర్టిజన్ల)కు శుభవార్త. ఆర్టిజన్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పు పట్ల ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లకు పేస్కేల్, పీఆర్సీ వర్తింపజేస్తామని ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టిజన్లుగా క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు క్రమబద్ధీకరణకు నోచుకోనున్నారు. కేసీఆర్ ఆదేశాలతో.. విద్యుత్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దశాబ్దాలుగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ల చేతిలో శ్రమదోపిడీకి గురయ్యారు. రాజకీయ నేతలు, విద్యుత్ ఉన్నతాధికారులు బినామీల పేర్లతో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నిర్వహిస్తూ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శించేవారు. విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నేరుగా వేతనాలు చెల్లించి కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి రక్షించాలని కోరుతూ విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రం ఏర్పడ్డాక ఆందోళనలు నిర్వహించారు. ఈ అంశంపై పలుసార్లు అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్ చివరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు 23 వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ గతేడాది విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో క్రమబద్ధీకరణను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆర్టిజన్లకు ఊరట లభించింది. మానవీయతతో నిర్ణయం.. ఆర్జిజన్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకుందని, దాన్ని హైకోర్టు సమర్థించడం ఆనందకరమని సీఎం కేసీఆర్ చెప్పారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇది పండుగ రోజని అభివర్ణించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురికావొద్దని, మంచి జీవన ప్రమాణాలతో జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పేస్కేల్ నిర్ణయించాలని, వారికి పీఆర్సీ వర్తింపజేయాలని సీఎండీని సీఎం ఆదేశించారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టిజన్లు ఇక రెగ్యులర్ ఉద్యోగులే హైకోర్టు తీర్పు పట్ల ప్రభాకర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యుత్ శాఖకు ఇది శుభ దినమన్నారు. ఇకపై ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు వారికి పేస్కేలు నిర్ణయిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టి జన్లను క్రమబద్ధీకరించే విషయంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
సీనియర్ ఫిజీషియన్‌ను పంపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్న తన భర్త, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు అవసరమైన వైద్యసాయాన్ని అందించేందుకు వైద్యుడిని అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ, వరవరరావు సతీమణి హేమలత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వరవరరావు ఇంటికి గాంధీ ఆసుపత్రిలో సీనియర్ ఫిజీషియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుడిని పంపాలని డీజీపీని ఆదేశించింది. వరవరరావును పరిశీలించి ఆయనకు వైద్య సేవలు అవసరమైతే, వాటిని అందించాలని వైద్యుడిని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పుణే పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో వరవరరావు కూడా ఉన్నారు. వీరందరి అరెస్టులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు అరెస్ట్ చేసిన వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ఇదే రీతిలో వరవరరావు అరెస్ట్‌పై ఆయన సతీమణి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గతవారం విచారణ సందర్భంగా వరవరరావుకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుడిని సైతం పోలీసులు అనుమతించడం లేదని హేమలత హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్మాసనం వరవరరావుకు వైద్యసాయం కోసం పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో హేమలత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం, ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. అరెస్టయిన నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు పొడిగించిన నేపథ్యంలో హైకోర్టు కూడా తన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
తప్పు మీద తప్పు..!
సాక్షి, గుంటూరు: చీకట్లో నల్లపిల్లిని వెతుకుతున్నారన్న హైకోర్టు వ్యాఖ్యలను మైనింగ్ అధికారులు నిజం చేస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి నోటీసులు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిన అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలతో చేయిస్తున్న విచారణ తీరే ఇందుకు నిదర్శనం. హైకోర్టు మొట్టికాయలు మొట్టడంతో తామేదో పొడిచేస్తాం.. అక్రమాలను నిగ్గుతేలుస్తాం అన్నట్టుగా ఫోజు పెట్టి విచారణ మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తీరు హాస్యాస్పదంగా మారింది. ఉండటానికి సరైన నివాసం కూడా లేని వాళ్లు వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించి రూ.కోట్లు సంపాదించారని, అలాగే 1998లో మరణించిన వ్యక్తి 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడంటూ నోటీసులిచ్చి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విచారణ పేరుతో మైనింగ్ అధికారులు ఇంకో అడుగు ముందుకేసి స్వామిభక్తి చాటుకోవడంలో భాగంగా పత్తి, బియ్యం, మైదాపిండి మిల్లుల వారికి కూడా తెల్లరాయి అక్రమ తవ్వకాలతో సంబంధం ఉందని నోటీసులిచ్చి, మిల్లులను మూతవేయించారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టుకు ఈ జాబితాను కూడా నివేదించడం గమనార్హం. తమ ఎమ్మెల్యేను కాపాడేందుకే... గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, ఇతర అధికార పార్టీ పెద్దలను తప్పించే యత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణను సీబీసీఐడీకి అప్పగించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చేస్తున్న విచారణ తీరు ఈ ఆరోపణలను బలపరుస్తోంది. అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన వారిని వదిలేసి సంబంధంలేని ముగ్గురాయి మిల్లుల యజమానులను, అమాయక కూలీలు, టిప్పర్, ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లకు సైతం నోటీసులు జారీచేస్తున్నారు. పైగా వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. రైస్‌మిల్లులు, కాటన్ మిల్లులకు అక్రమ మైనింగ్‌కు సంబంధం ఏంటనేది మైనింగ్ అధికారులు, సీబీసీఐడీ అధికారులకే తెలియాలి. మైనింగ్ మాఫియా నుంచి తెల్లరాయి కొనుగోలు చేసి ముగ్గు, చిప్స్ తయారు చేసే మిల్లులకు నోటీసులు ఇస్తే పర్వాలేదు. నిజంగా ముగ్గు, పల్వరైజింగ్ మిల్లులు నడుస్తున్నప్పటికీ ఆ పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆ బిల్డింగ్‌లో రైస్ మిల్లు, కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, ఇతర పరిశ్రమలు నడిచాయనే అవగాహన కూడా లేకుండా ఆ పేర్లతో నోటీసులు జారీ చేశారు. తాము తప్పించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేత ఏస్థాయిలో తన పరపతిని ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు. నోటీసులు ఇచ్చాం విద్యుత్ శాఖ అధికారుల నుంచి సేకరించిన మీటర్ల ఆధారంగా మిల్లులకు నోటీసులిచ్చాం. గతంలో కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, రైస్‌మిల్లులు ఇలా ఏ పరిశ్రమ పేరుతో అయితే కరెంటు మీటరు తీసుకున్నారో ఆ పేరుతో నోటీసులిచ్చాం. ఆపేరుతో అక్కడ పరిశ్రమ నడవకపోతే యజమానులు మాకు తెలియజేయాలి. వెంటనే మా అధికారులను పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత వారు చెప్పినట్లు మైనింగ్‌కు సంబంధం లేని పరిశ్రమ అయితే నోటీసులు వెనక్కు తీసుకుంటాం. – విష్ణువర్ధన్, మైనింగ్ ఏజీ -
మౌలిక సదుపాయాల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు ఏర్పాటైన రైతు రుణవిమోచన కమిషన్‌కు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన రైతు సాధికార సమితికి అవసరమైన సిబ్బందితోపాటు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఇచ్చినప్పుడే ఏ లక్ష్యంతో రైతు రుణ విమోచన కమిషన్, రైతు సాధికార సమితులను ఏర్పాటు చేశారో, ఆ లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో వివరించేందుకు ఆ ప్రభుత్వాలకు గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వు లు జారీ చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కొల్లి శివరామిరెడ్డి, పాకాల శ్రీహరిరావు మరికొందరు కోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇటీవల ధర్మాసనం విచారణ జరిపింది. రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, తాము రైతు సాధికార సమితి ని ఏర్పాటు చేసినట్లు ఏపీ న్యాయవాది వివరించారు. వాటికి మౌలిక సదుపాయాలు, సిబ్బంది కేటాయింపుల గురించి ధర్మాసనం ఆరా తీసింది. రైతుల సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థల సేవలను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడింది. -
నిష్పాక్షిక విచారణ జరపండి
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ఎన్సీసీ కోటా కింద భర్తీ చేసిన సీట్ల విషయంలో ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ రోవిన్ను విచారణాధికారిగా నియమించే విషయంలో ఎన్సీసీ డైరెక్టరేట్ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. సీట్ల భర్తీకి సంబంధించి ఎన్సీసీ అధికారులు పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరపండి. పిటిషనర్లు సీబీఐ విచారణకు విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. మాకు విశ్వాసం కలిగించేలా విచారణ జరగని పక్షంలో పిటిషనర్లు కోరిన ప్రత్యామ్నాయంవైపు మేం మొగ్గు చూపుతాం. ఈనెల 10వ తేదీ కల్లా విచారణను పూర్తి చేసి నివేదికను మా ముందుంచాలి’’అని విచారణాధికారిని ఆదేశించింది. ఇప్పటికే ఎన్సీసీ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు ఈ విచారణ గురించి తెలియజేయాలని, వారికి ఇచ్చిన ప్రవేశాలు తాత్కాలికమని, విచారణ నివేదిక ఆధారంగా వారి కొనసాగింపు ఉంటుందని స్పష్టంగా చెప్పాలని ఉభయ రాష్ట్రాల వైద్య విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల తీరు సరికాదు..: ‘‘ఎన్సీసీ కోటా కింద సీట్లు పొందేందుకు మేం అర్హులమైనప్పటికీ, ఎన్సీసీ అధికారుల తీరు వల్ల మాకు అన్యాయం జరిగింది. ప్రాధాన్యత ఖరారు.. సర్టిఫికెట్ల ఆమోదం.. క్రీడల్లో పాల్గొన్నా గుర్తించకపోవడం.. స్పాన్సర్షిప్ తదితర విషయాల్లో ఎన్సీసీ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి మా జీవితాలతో ఆడుకున్నారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించండి’’అని కోరుతూ హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, వైఎస్సార్ కడప, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం.. అభ్యర్థుల పట్ల ఎన్సీసీ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఎన్సీసీ డైరెక్టరేట్ విశ్వసనీయతను తాము శంకించడం లేదని, అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్సీసీ అధికారులు పరస్పర విరుద్ధ వైఖరి గమనిస్తే, వైద్య విద్య ఎన్సీసీ కోటా సీట్ల భర్తీలో అంతా సవ్యంగానే జరిగిందని అనిపించడం లేదని ఆంది. అవకతవకలను గుర్తించడమే పరిష్కారం ‘‘కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్లు కోరుతున్నారు. ఆ సమయం ఇంకా రాలేదని మేం భావిస్తున్నాం. పిటిషనర్లు కోరుతున్నట్లు వారికి ప్రవేశాలు కల్పిస్తే ఇప్పటికే ఎన్సీసీ కోటా కింద ప్రవేశాలు పొందిన వారిని బయటకు పంపాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. ఒకవేళ పిటిషనర్లకు ప్రవేశం కల్పించి వారి సీట్లలో ఉన్న వారిని బయటకు పంపితే దానిపై అభ్యంతరం తెలియచేసేందుకు వారికి పూర్తి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పిటిషనర్లకు వారు కోరుతున్న విధంగా ప్రవేశాలు కల్పించేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అసలు ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన అవకతవకలను గుర్తించడమే ఈ సమస్యకు పరిష్కారం. అందువల్ల ఎన్సీసీ కోటా కింద జరిగిన సీట్ల భర్తీపై విచారణకు ఆదేశిస్తున్నాం. విచారణాధికారిగా బ్రిగేడియర్ రోవిన్ పేరుకు ఆమోదం తెలుపుతున్నాం. ఎన్సీసీ కోటా కింద ఉన్న క్రీడలు, వ్యక్తిగత, బృంద క్రీడలు, ఎన్సీసీ స్పాన్సర్ చేసిన, గుర్తించిన క్రీడల వివరాలు, ఇప్పటికే ఈ కోటా కింద ప్రవేశాలు పొందిన వారి వివరాలు, వారు శిక్షణకు వెళ్లింది నిజమా? కాదా? వారు పొందిన సర్టిఫికేట్లు నిజమైనవేనా? కావా? అన్న విషయాలను తేల్చాలి’’అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ధిక్కరణపై కోర్టుకు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. న్యాయ పోరాటం చేస్తూనే ఈ నెల 11న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని, అనంతరం దశలవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్రపతిని సైతం కలవాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి హాజరుకాలేదు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మార్పు, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక తదితర పరిణామాలపై చర్చించారు. కోమటిరెడ్డిపై జానా సీరియస్ ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా, మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న కోమటిరెడ్డి డిమాండ్‌పై సీఎల్పీలో ప్రస్తావన వచ్చింది. బహిరంగ వేదికలపై తనపై ఎలా నిందలు వేస్తారని, ఇలా వ్యవహరించి పార్టీని పలుచన చేయరాదని కోమటిరెడ్డిపై జానా మందలింపు ధోరణితో అన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మారడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు ఎవరు బాధ్యత వహించాలన్న అంశంపైనా వాడివేడిగా చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై చర్చించారు. సమ్మెకు దిగితే ఉద్యోగాలు ఊడుతాయంటూ సీఎం వ్యాఖ్యానించటం దురదృష్ణకరమని, ఈ విషయంలో కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించారు. మూకుమ్మడి రాజీనామాలపై చర్చే జరగలేదని సమావేశం అనంతరం మీడియాతో జానారెడ్డి స్పష్టం చేశారు. కోర్టులంటే సీఎంకు గౌరవం లేదు: ఉత్తమ్ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కోర్టుల పట్ల ప్రభుత్వానికి, స్పీకర్‌కు కనీస గౌరవంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ను కలుస్తామని తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. త్వరలోనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖమ్మం, అలంపూర్‌లో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టి, తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భట్టి నివాసంలో మరో భేటీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, మధుయాష్కీ హాజరయ్యారు. పార్టీ జిల్లాల అధ్యక్షులను పాత పది జిల్లాలకే ఉంచాలా లేదా 31 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలా అన్న అంశంపై చర్చ జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని, పార్టీ ఎజెండాను 8 నెలల ముందే జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యమంలో పాల్గొన్న కార్మికులనే బెదిరిస్తారా: జీవన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైతే ఉద్యోగాలు పోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించడం దురదృష్టకరమని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సరికాదన్నారు. ప్రభుత్వ రాయితీలు ఇవ్వకుండా డ్రైవర్లు, కండక్టర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
షాడో సీఎం !
⇒ చిన్నమ్మ డైరెక్షన్..ఎడపాడి యాక్షన్ ⇒ తమిళనాడు సీఎం, మంత్రులకు హైకోర్టు నోటీసులు ⇒ ఖైదీ శశికళ సూచనల మేరకు పాలనపై పిటిషన్ తమిళనాడును పాలిస్తున్నది ఎవరు. ఎడపాడా లేక శశికళనా? జైల్లో ఖైదీగా ఉంటూనే షాడో సీఎంగా మారిన శశికళ కనుసన్నల్లో నడుస్తున్న సీఎం, నలుగురు మంత్రులు ఎమ్మెల్యేలుగా అనర్హులు అంటున్నారు అన్నాడీఎంకే సీనియర్ నేత ఆనగళన్. అంతేకాదు వారిపై కోర్టులో పిటిషన్ దాఖలుచేసి గురువారం నోటీసులు కూడా ఇప్పించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి ఆదేశాలను అందుతున్న ఆదేశాల ప్రకారం రాష్ట్రాన్ని పాలించడం అభ్యంతరకరమని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు కోర్టుకెక్కాడు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన వెంటనే సీఎం పీఠంపై శశికళ కన్నుపడింది. జయ మరణించి నిండా నెలరోజులు కూడా కాక ముందే పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు స్వీకరించి నెలరోజులు పూర్తికాక ముందే పన్నీర్‌సెల్వం చేత సీఎం పదవికి రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా మారిపోయారు. స్వతహాగా సాధుస్వభావి అయిన పన్నీర్‌సెల్వంలో కూడా కోపం కట్టలు తెంచుకుంది. చిన్నమ్మపై తిరుగుబాటుచేసి పార్టీని రెండుగా చీల్చారు. అయితే విధి వక్రీకరించగా సీఎంగా సచివాలయానికి వెళ్లాల్సిన చిన్నమ్మ ఖైదీగా జైలు బాటపట్టారు. సీఎం కుర్చీలో ఎడపాడిని కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను టీటీవీ దినకరన్‌కు అప్పగించారు. ఆరోజుల్లో అమ్మకు ఈరోజుల్లో చిన్నమ్మకు విశ్వాపాత్రులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి కొన్ని నెలల క్రితం బృందంగా ఏర్పడి చిన్నమ్మను చూసేందుకు జైలుకెళ్లగా అ«ధికారులు తరుముకోవడంతో దేవుడా అంటూ చెన్నైకి చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత ఎడపాడి బెంగళూరు జైలుకెళ్లకున్నా ఆయన తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు చిన్నమ్మ ఆశీస్సులు పొందివచ్చారు. శిక్షపడిన ఖైదీ నేతృత్వంలో పాలనా ? ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన సీఎం, మంత్రులు జైలు ఖైదీ శశికళ నుంచి ఆదేశాలు పొందడం అభ్యంతరకరమని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే నేత ఆనళగన్ మార్చిలో మదురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ సూచనలు, ఆదేశాలను అనుసరించి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు పార్టీ అధికారప్రతినిధి గౌరీశంకర్ ఫిబ్రవరి 22న ప్రకటించారు. మంత్రులు సెంగొట్టయ్యన్, సెల్లూరురాజా, దిండుగల్లు శ్రీనివాసన్, కామరాజ్ పదవీ ప్రమాణం చేసిన తరువాత బెంగళూరు జైలు కెళ్లి శశికళ ఆశీర్వాదం పొందారు. ఇంత జరుగుతున్నా సీఎం చేష్టలుడిగి చూస్తున్నారు. రాష్ట్రంలో పాలనను జైలు ఖైదీ చేతుల్లో పెట్టిన సీఎం ఎడపాడి, నలుగురు మంత్రులను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్, శాసనసభా కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పిటిషన్‌ను గవర్నర్‌కు పంపి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. ఆనగళన్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చిం ది. పిటిషనర్ వాదనను విన్న అనంతరం న్యాయమూర్తులు కేకే శశిధరన్, జి.ఆర్.స్వామినాథన్ వివరణ కోరుతూ ఆ ఐదుగురికి నోటీసులు జారీచేశారు. -
అమ్మకు అర్హత లేదు!
⇒ జయలలిత సమాధిపై అభ్యంతర పిటిషన్ ⇒ నేరస్తురాలికిమణిమండపమా? ⇒ మెరీనాబీచ్ నుంచిజయ మృతదేహాన్ని తొలగించాలి ⇒ తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ‘ద్రవిడ ఉద్యమ రథ సారథి అన్నాదురై, తమిళనాడు ప్రజల ఆరాధ్య దైవం ఎంజీ రామచంద్రన్, పండిత పామరులకు ఆదర్శనీయుడు కామరాజనాడర్ వంటి మహాపురుషుల సమాధి సరసన నేరస్తురాలైన జయలలితకు స్థానమా..? ఎంత మాత్రం సహించేది లేదు’ అంటున్నారు ఎస్ దురైస్వామి అనే న్యాయవాది. అంతేగాదు మద్రాసు హైకోర్టులో ఈ మేరకు ఇటీవల వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం విచారణకు వచ్చింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: నిబంధనలకు విరుద్ధంగా చేపట్టబోతున్న జయ స్మారక మండప పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించేలా ఆదేశించాలని పిటిషనర్ ఎస్.దురైస్వామి కోరారు. ఆయన హైకోర్టులో వేసిన వాజ్యంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరీమానా విధించింది. కోర్టు తీర్పు వెలువడగానే జయలలిత కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి నిర్దోషిగా బయటపడ్డారు. అయితే కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే దాఖలుచేసిన అప్పీలు పిటిషన్‌పై విచారించి కింది కోర్టు వేసిన శిక్షను సుప్రీం కోర్టు ఖరారుచేసింది. అయితే గత ఏడాది డిసెంబరు 5వ తేదీన జయలలిత మరణించడం వల్ల ఇదే కేసులో మిగిలిన ముగ్గురు నిందితులైన శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జయలలిత భౌతిక కాయాన్ని గత ఏడాది డిసెంబరు 6వ తేదీన మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. సహజంగా మెరీనా తీరంలో వీవీఐపీలకు మాత్రమే స్మారక మండపం కట్టాలనే సంప్రదాయం తమిళనాడు ప్రభుత్వంలో ఉంది. ఆస్తుల కేసులో శిక్షపడిన జయలలితకు స్మారక మండపం కట్టడం వల్ల ఆమె చేసిన నేరానికి గుర్తుగా మిగిలే అవకాశం ఉంది. ఎంజీఆర్ సమాధి పక్కనే జయను ఖననం చేయడం చట్టవిరుద్ధం. అంతేగాక పర్యావరణం, సముద్రతీర ప్రాంతాల నిబంధనలకు విరుద్ధం. బీచ్ తీరం నుంచి 500 అడుగుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పర్యావరణ శాఖ నిషేధాజ్ఞలు ఉన్నాయి. మహాత్మాగాంధీ, జవహర్లాల్ తదితరులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినట్లే, తమిళనాడులో పెరియార్, కామరాజనాడార్, అన్నాదురై తదితరులు ప్రజాశ్రేయస్సుకు పాటుపడ్డారు. అయితే జయలలిత ఈ కోవకు చెందిన వారు కారు. అవినీతికి పాల్పడి జైలు జీవితం అనుభవించారేగానీ, ప్రజా పోరాటాలతో కాదు. ఇదిలా ఉండగా జయ సమాధి వద్ద మణిమండపం నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా సీఎం ఎడపాడి గత నెల 28వ తేదీన ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టబోతున్న జయ స్మారక మండపం పనులపై నిషేధం విధించి జయ మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించేలా ఆదేశించాలి’’ అని పిటిషనర్ కోరారు. న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు సోమవారం విచారణకు రాగా, పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఆగస్టు 18వ తేదీన కోర్టుకు వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం, చెన్నై కార్పొరేషన్, సీఎండీఏ, పర్యావరణశాఖకు నోటీసులు పంపాల్సిందిగా న్యాయమూర్తులు కోర్టును ఆదేశించారు. -
నలభై రెండేళ్ల పోరాటం... దళిత రైతుల విజయం
► పూర్వీకుల భూమి కోసం ఫలించిన న్యాయ పోరాటం ► అసైన్మెంట్ రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: తాతల నాటి భూమి... వారస త్వంగా వస్తుందనుకున్నది అసైన్మెంట్ రద్దు చేయడంతో వారికి కాకుండా పోయింది. తహసీల్దార్ మొదలు... హైకోర్టు వరకు... ముగ్గురు దళిత రైతులు నాలుగు దశాబ్దాలకు పైగా ధర్మ యుద్ధమే చేశారు. 1975 నుంచి కొనసాగుతున్న వీరి న్యాయ పోరాటం లో నలభై రెండేళ్ల తరువాత ఎట్టకేలకు విజయం సాధించారు. ఈ రైతుల పూర్వీకులకిచ్చిన అసైన్ మెంట్‌ను రద్దు చేస్తూ ఇన్చార్జి కలెక్టర్ హోదాలో అప్పటి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని తేల్చిచెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ అధికారం డీఆర్వోకు లేదు... అసైన్మెంట్ రద్దు చేసే అధికారం డీఆర్వోకు లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేకాక భూమి స్వాధీనం విషయంలో అధికారులు సింగిల్ జడ్జిని సైతం తప్పుదోవ పట్టించారంది. రైతులకు వ్యతిరే కంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్ర మణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఆదిలా బాద్ జిల్లా, దస్నాపూర్ గ్రామంలో లంకా మోహన్, లంకా రాజారాం, లంకా ఆశన్నల పూర్వీకులకు రెవెన్యూ అధికారులు ఐదెకరాల వ్యవసాయ భూమిని 1961లో అసైన్మెంట్ కింద ఇచ్చారు. 1972లో అసైన్మెంట్ రద్దు నిమిత్తం అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 1975లో అప్పటి డీఆర్వో ఇన్చార్జి కలెక్టర్ హోదాలో అసైన్మెంట్ను రద్దు చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితులు కలెక్టర్ ముందు అప్పీల్ చేశారు. అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే, కొందరు అధికారులు వారిని ఆ భూముల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా లంకా మోహన్ తదితరులు 1987లో హైకోర్టును ఆశ్రయించారు. కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సైతం కింది స్థాయి అధికారుల ఉత్తర్వులను సమర్థిస్తూ 2000లో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ లంకా మోహన్, రాజాం, ఆశన్నలు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుదోవ పట్టించారు... విచారణ జరిపిన సింగిల్ జడ్జి, అధికారులు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పిటిష న్ను కొట్టేశారు. దీనిపై వారు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించిం ది. అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) ల్యాండ్ రెవెన్యూ చట్టానికి విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. గడువు ముగిసిన తరువాత అసైన్మెంట్ను రద్దు చేశారం ది. 1979కి ముందే పిటిషనర్ల భూములను స్వాధీ నం చేసుకున్నామని అధికారులు సింగిల్ జడ్జిని నమ్మించారని, దాని ఆధారంగా ఆయన తీర్పుని చ్చారని తెలిపింది. కానీ రికార్డులను పరిశీలిస్తే అందుకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామంది. -
2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలి
► హైకోర్టు తీర్పు హర్షణీయం ► ‘నకిలీ’ రుణాలపై విచారణ వేగవంతం చేయాలి ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం రాజేశ్ మంథని : తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం రాజేశ్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ సెంటర్లో మల్హర్, కాటారం, మహదేవపూర్ మండల పరిధిలోని సుమారు 50మందికి పైగా వివిధ పార్టీల నాయకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ 123 జీవో ప్రకారం భూసేకరణ చేపడితే భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతుందన్నారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా నిర్వాసితులకు పలు హక్కులు, ప్రయోజనాలతోపాటు మెరుగైన పరిహారం అందుతుందని పేర్కొన్నారు. జీవో 123 భూసేకరణ విరుద్ధమని హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఇది చెంప పెట్టులాంటిదని అన్నారు. కొయ్యూర్, తాడిచర్లలోని తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకుల్లో నకిలీపాస్పుస్తకాలతో రుణాలు పొందిన వారిపై విచారణను వేగవంతంచేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీలో చేరిన వారిలో దుర్గయ్య, లింగయ్య, మల్లయ్య, పెంటయ్య, మునీర్, గుంపుల యశ్వంత్, కత్తరమల్ల వర్మ ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కాసిపేట సారయ్య, మల్హర్ మండల అధ్యక్షుడు సుంకె వెంకటి, మేలికంటి కళ్యాణ్, మేలికంటి శ్రీకాంత్, ఎడ్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కొండ్రా దుర్గయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు శనిగారపు పేంటయ్య, ఉపాధ్యక్షుడు శనిగరపు లింగయ్య పాల్గొన్నారు. -
పౌల్ట్రీరైతులే టెండర్లలో పాల్గొనాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : మహిళాశిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ల నిర్వహణలో కొంతకాలంగా నెలకొన్ని గందరగోళానికి సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెరపడింది. టెండర్లను ఎలాగైనా దక్కించుకోవాలని ఆశించిన ట్రేడర్లకు హైకోర్టు తీర్పు షాకిచ్చినట్టయింది. నిబంధనల ప్రకారం గుట్ల సరఫరా టెండర్లలో కోళ్ల ఫారాలున్న రైతులే పాల్గొనాలని చెప్పింది. వాస్తవానికి రెండు నెలల క్రితం జిల్లాలోని 20 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. కాగా, గతంలో సరఫరా చేసిన ట్రేడర్లు హైకోర్టును ఆశ్రయించి తమకూ అవకాశం కల్పించాలని కోరారు. దీంతో టెండర్ల ఖరారు ప్రక్రియ రెండుసార్లు ఆగిపోయింది. దీంతో ఈ కేంద్రాలకు గుడ్ల సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఆయా మండలాల్లో స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న కాంట్లాక్టర్ల ద్వారా అధికారులు సరఫరా చేయించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో టెండర్ల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇక ఎలాంటి అడ్డంకులు లేవని వెంటనే టెండర్ల ప్రక్రియను నిర్వహించి అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాను పునరుద్ధరిస్తామని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోత్సS్న తెలిపారు. -
'కేసీఆర్ ఉప ఎన్నికలకు సిద్ధపడాలి'
-
'కేసీఆర్ ఉప ఎన్నికలకు సిద్ధపడాలి'
హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు శుభపరిణామమని టి.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ...ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. హైకోర్టు తీర్పును స్పీకర్ తక్షణమే అమలు చేయాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలకు సిద్ధపడాలని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
లెఫ్టినెంట్ గవర్నర్, క్రేజీవాల్ మధ్య మరో వివాదం
ఢిల్లీ: క్రేజీవాల్ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య మరో వివాదం రేగింది. గత వారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మరో అడుగు ముందుకేశారు. ఢిల్లీ పాలనకు సంబంధించిన ఫైళ్ల వివరాలను తనకు పంపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై క్రేజీవాల్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజా వివాదంతో ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వాధినేత అని హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై క్రేజీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. -
'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్: 'తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ జీవోలు 123, 124 లను హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు' అని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలపై న్యాయస్థానం వెలువరించిన తీర్పు హర్షనీయమన్నారు. ఇది రైతుల విజయంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 123, 124 లను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది రైతులు, రైతు కూలీల విజయమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని ఉత్తమ్ సూచించారు. కాగా, ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోలను తెచ్చింది. అయితే ఈ జీవోలను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా రుద్రంగి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 123, 124 జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
9న జరగాల్సిన టి.టీడీపీ బహిరంగ సభ వాయిదా
హైదరాబాద్: ఈ నెల 9న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగాల్సిన తెలంగాణ టీడీపీ బహిరంగ సభ వాయిదా పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే బహిరంగ సభ ఎప్పుడు జరపాలన్నదానిపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
తెలుగువర్సిటీలో ఏపీ ఆచార్యుల తొలగింపు
వారిని శ్రీశైలానికి రిలీవ్ చేసిన వీసీ సాక్షి, హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులను సంస్థ నుంచి బయటకు పంపించేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపడుతుండడంతో అక్కడి బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రొఫెసర్ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యలను రిలీవ్ చేస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య శివారెడ్డి ఈ నెల 19న ఉత్తర్వులిచ్చారు. వీరిని ఏపీలోని శ్రీశైలం ప్రాంగణానికి పంపిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదో షెడ్యూల్లోని సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగువర్సిటీని తన అధీనంలోకి తీసుకుంది. వర్సిటీ సేవలను ఏపీలో కొనసాగించకుండా నిలిపేసింది. 2 నెలల నుంచి ఏపీకి చెందిన ఉద్యోగులకు జీతా లు నిలిపేసింది. తాజాగా ప్రొ. చెన్నారెడ్డి మెడికల్ లీవ్‌కు దరఖాస్తు చేయగా తమకు సంబం ధం లేదని, శ్రీశైలం ప్రాంగణంలో దరఖాస్తు చేయాలని స్పష్టంచేశారు. ఏపీలో తెలుగు వర్సిటీయే లేనప్పుడు ఎక్కడ రిపోర్టు చేయాలని, తమ జీతభత్యాలు ఎవరిస్తారని ఆ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై గవర్నర్, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువర్సిటీ సేవల నిలిపివేత తదతర అంశాలపై కోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. -
ఏపీ విద్యామండలికి రికార్డుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఉన్నత విద్యామండలి రికార్డులను తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం అప్పగించింది. హైకోర్టు తీర్పుతో ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయ భవనాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. తరువాత ఏపీ మండలి హాకా భవనంలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. వివిధ సెట్ల నిర్వహణ, ప్రవేశాల కోసం రికార్డులు అప్పగించాలని ఏపీ మండలి ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయింది. ఈ వ్యవహారంపై సుప్రీంలో కేసు ఉండటంతో రికార్డులు తీసుకువెళ్లాలంటూ ఎట్టకేలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏపీ మండలికి లేఖ పంపింది. ఈ మేరకు ఇరు మండళ్ల ైవె స్ చైర్మన్లు ప్రొఫెసర్లు విజయప్రకాశ్, నరసింహారావు, వెంకటాచలం, మల్లేశ్‌లు చర్చించి రికార్డుల జాబితా రూపొందించారు. వాటిలో కొన్ని ఫైళ్లను ఏపీ మండలి అధికారులు తీసుకువెళ్లారు. -
17న ప్రమాణస్వీకారం లేనట్లే!
-
17న ప్రమాణస్వీకారం లేనట్లే!
‘అప్పీలు’ డిమాండ్లు పెరగడంతో జయ ఊగిసలాట సాక్షి, చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈనెల 15న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని భావించిన పార్టీ నేతలు తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 17వ తేదీన సీఎంగా జయ ప్రమాణస్వీకారం ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలంటూ రాజకీయ పక్షాల డిమాండ్ పెరుగుతుండడమే ఈ ప్రతిష్టంభనకు కారణంగా తెలుస్తోంది. జయలలిత నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. కాగా, 19 ఏళ్లపాటు సాగిన విచారణలో జయ దోషి అని రుజువైతే, 3 నిమిషాల తీర్పుతో ఆమె నిర్దోషి అని ప్రకటించారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తప్పుపట్టారు. తీర్పును సవరిస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమని పీఎంకే అధినేత రాందాస్ అన్నారు. ఆందోళనలో జయ: కోర్టు తీర్పుపై విమర్శలు రావడం, అప్పీలుకు విపక్షాలు పట్టుపట్టడం, తీర్పు వెలువరించిన న్యాయమూర్తి కుమారస్వామి సైతం విమర్శలకు స్పందించి అత్యవసరంగా సమావేశం కావడం జయలలితను ఆందోళనకు గురిచేసింది. ఈ కేసు నుంచి బయటపడ్డా జయ.. ఉత్సాహంతో ప్రజల ముందుకు ఇప్పటివరకు రాలేదు. సీఎం పన్నీర్‌సెల్వంతో మాత్రమే ఆమె సమావేశమయ్యారు. తీర్పు వివరాలను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సీఎం పదవి చేపట్టడంపై ఆమె నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈనెల 17నపదవీ ప్రమాణం లేకున్నా అందుబాటులో ఉండాలని 155 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. తీర్పుపై జడ్జి పునఃసమీక్ష! జయలలిత ఆస్తుల కేసులో వెలువరించిన తీర్పు ప్రతిలో తప్పులు ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య పేర్కొనడంతో తీర్పుపై న్యాయమూర్తి జస్టిస్ సి.ఆర్.కుమారస్వామి బుధవారం సమీక్షించారు. గురువారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం. జయను నిర్దోషిగా పేర్కొంటూ జస్టిస్ కుమారస్వామి ఈ నెల 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు ప్రతిలో తప్పులు నిజమే అయినా.. ఒకసారి ఇచ్చిన తీర్పును తిరిగి అదే కోర్టు మార్చడానికి వీల్లేదని, అయితే క్లరికల్, అర్థమెటిక్ తప్పులను సరిదిద్దడానికి మాత్రం అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
ఉన్నత విద్యామండలికి ఊరట
సంస్థ ఉనికిలో ఉంటుందన్న సుప్రీంకోర్టు.. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఊరట లభించింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న అంశాన్ని పక్కన పెడుతున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఏపీ విద్యాసంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛను మండలికి కల్పిస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం, మండలి దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రేల బెంచ్ విచారించింది. మండలి తరపు సీనియర్ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపిం చారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదించగా.. తెలంగాణ ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ వాదించారు. ఈ సందర్భంలో ధర్మాసనం.. ‘ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కౌంటర్ వేయకుంటే హైకోర్టు మాత్రం ఏంచేస్తుంది? అయినా జూన్ 2 తో ఏడాది గడువు ముగుస్తుంది కదా? హైకోర్టు ఎందుకు అంత త్వరగా తీర్పు ప్రకటించింది?’అని ప్రశ్నించింది.‘రాష్ట్రం విడిపోయింది పదే పదే కలహించుకోవడానికేనా.. పరస్పర అంగీకారంతో పనిచేసుకోవాలి ..’ అని జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే వ్యాఖ్యానించారు. ‘ఇదంతా హైదరాబాద్ చుట్టూ నలిగే అంశమే’ అని న్యాయమూర్తి విక్రంజిత్‌సేన్ వ్యాఖ్యానించారు. కౌంటర్ల దాఖలుకు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మండలికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. -
'రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వ్యాఖ్యానించారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల విజయంగా ఆర్కే అభివర్ణించారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం భూ సమీకరణ అంశంలో పునరాలోచించాలని ఎమ్మెల్యే ఆర్కే సూచించారు. -
కౌలు తీసుకొనేందుకు నిరాకరణ
♦ భూ అంగీకార పత్రాలు వెనక్కు కోరుతున్న రాజధాని రైతులు ♦ హై కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు తాడికొండ : రాజధాని రైతులు ప్రభుత్వం ఇస్తున్న కౌలు సొమ్ము తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కౌలుకు సంబంధించిన డీడీలు తీసుకెళ్లాలని అధికారులు ప్రకటిస్తున్నా రైతులు మాత్రం ముందుకు రావడం లేదు. నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం 29 గ్రామాల్లో జనవరి 2 తేదీ నుంచి భూసమీకరణ జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులు అభ్యంతర పత్రాలు అందజేశారు. కొందరు స్వచ్ఛందంగా భూములు ఇవ్వగా, మరికొందరిని భయపెట్టి ప్రభుత్వం భూసమీకరణగావించింది. ఈ క్రమంలో రైతునాయకులు అభ్యంతర పత్రాలపై వివరణ కోరుతో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరో ఆరు రోజుల్లో తీర్పు వెలువడనుంది. కొద్ది రోజుల కిందట రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో తమ భూ అంగీకార పత్రాలు వెనక్కు ఇచ్చేయాలని రైతులంతా సీఆర్డీఏ అధికారులను కోరడం ప్రారంభించారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇస్తున్న కౌలు సొమ్ము కింద డీడీలను కూడా తీసుకోవడం లేదు. మరో వైపు రాయపూడి, తాడేపల్లి, నవులూరు, ఉండవల్లి తదితర గ్రామాల రైతులు తమ అంగీకార పత్రాలు వెనక్కి ఇవ్వాలని సీఆర్డీఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలియజేస్తున్నారు. -
బీపీఎల్‌కు షాక్!
- భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తీర్పు - ముగిసిన పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు(పీసీబీ) గడువు - జెన్కోకు అప్పగించేందుకే ప్రభుత్వం మొగ్గు రామగుండం : ప్రతిపాదిత బీపీఎల్ విద్యుత్ కేంద్రం స్థలం కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తీర్పునివ్వడం బీపీఎల్ యాజమాన్యానికి షాక్ కలిగించింది. కేటాయించిన భూమిలో ప్రాజెక్టు కట్టకపోగా... ఎలాగైనా భూమి దక్కించుకోవాలని చూస్తున్న ఆ కంపెనీకి కోర్టు తీర్పు శరాఘాతంగా మారింది. కోర్టు తీర్పుతో ఈ భూములను జెన్కోకు అప్పగించి విద్యుత్ కేంద్రం నెలకొల్పేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. రామగుండంలో బ్రిటీష్ పవర్ లి మిటెడ్(బీపీఎల్) కంపెనీకి విద్యుత్ కేం ద్ర స్థాపన కోసం ప్రభుత్వం 14 ఏళ్ల క్రి తం భూములు కేటాయించింది. తొలిదశలో 600 మెగావాట్ల కేంద్రం స్థాపనకు అప్పుడే భూములు స్వాధీనం చేసుకున్న కంపెనీ సాంకేతిక కారణాలతో నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభించలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. పనులు ప్రారంభిస్తారా? లేదా? అనే విషయమై వెంటనే స్పష్టత ఇవ్వాలని గత డిసెంబర్లో ప్రభుత్వం బీపీఎల్ కంపెనీకి లేఖరాయగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. భూ కేటాయింపులు పూర్తయి పదేళ్లు దాటినా దానిని వినియోగించుకోకపోతే కేటాయింపులు రద్దయి భూములు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇలా 1,280 ఎకరాల భూములు బీపీఎల్ నుంచి ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే భూమి అభివృద్ధి కోసం తాము పెట్టిన సొమ్ము రాబట్టుకునేందుకు సదరు భూములను ఎన్టీపీసీకి కట్టబెట్టేందుకు బీపీఎల్ కంపెనీ పావులు కదిపినట్లు సమాచారం. ఎన్టీపీసీ కూడా ఈ భూములపై దృష్టి సారించింది. సదరు భూములపై బీపీఎల్ కంపెనీ వెచ్చించిన వ్యయాన్ని చెల్లించి భూములను తీసుకుంటామనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్టీపీసీ తీసుకెళ్లింది. రెండు నెలల క్రితం ఎన్టీపీసీ సీఎండీ, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు ప్రత్యేక హెలికాప్టర్లో ఎన్టీపీసీని సందర్శించిన క్రమంలో బీపీఎల్ భూములపై ఏరియల్ సర్వే చేసి విలేకరుల సమావేశంలో సైతం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది గమనించిన తెలంగాణ విద్యుత్ జేఏసీ సదరు స్థలాన్ని జెన్కోకు అప్పగించి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరింది. ఆ దిశగా ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్లాంట్ కేటాయింపులో ఇన్నాళ్లూ సాంకేతిక ఇబ్బందులు ఎదురైనందున ఇప్పుడు తమకు భూములు అప్పగిస్తే ప్లాంటు నెలకొల్పుతామని, భూములు అప్పగించేలా చూడాలని బీపీఎల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం పాటించనందున భూములు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతో కోర్టు... బీపీఎల్ భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీంతో మళ్లీ భూములు తీసుకుందామనుకున్న బీపీఎల్ కంపెనీఆశలపై ఈ తీర్పు నీళ్లు చల్లినట్లయింది. ముగిసిన పీసీబీ గడువు 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం బీపీఎల్ కంపెనీ 2009 జూన్ 30న పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు నుంచి అనుమతులు పొందింది. ఐదేళ్ల గడువుతో కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్ఈ) జారీ చేయగా 2014 జూన్ 30కి గడువు ముగిసింది. దీంతో బీపీఎల్‌కు ప్లాంట్ నెలకొల్పేందుకు దాదాపు ఏ అవకాశం లేకుండా పోయింది. జెన్కోకు భూమి? ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని జెన్కోకు అప్పగించి విద్యుత్కేంద్రం ఏర్పాటు చేసే యోచన చేస్తోంది. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండడంతో వనరులు పుష్కలంగా ఉన్న రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తోంది. ఈమేరకు బీపీఎల్ భూములను జెన్కోకు అప్పగించాలని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న భూములను జెన్కోకు అప్పగించడం పెద్ద కష్టం కాబోదని అధికారులు చెబుతున్నారు. -
‘నిర్బంధ కన్నడ’ రద్దు
సుప్రీం తీర్పు.. సర్కారుకు ఎదురు దెబ్బ - 20 ఏళ్ల వ్యాజ్యానికి తెర - హైకోర్టు తీర్పు సరైందే - నాలుగో తరగతి వరకు ఇక ‘నిర్బంధం’ వద్దు - బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్దరాదు - తల్లిదండ్రుల నిర్ణయం మేరకే మాధ్యమం ఎంపిక - తీర్పు పట్ల విచారం వ్యక్తం చేసిన సాహితీవేత్తలు - అమలైతే భాషల మనుగడకు ప్రమాదమని ఆందోళన - అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలన్న సీఎం - ఇది భాషా మాధ్యమ ఉద్యమానికి - విఘాతం కాబోదన్న మంత్రి కిమ్మనె రత్నాకర్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు విధిగా కన్నడ మాధ్యమంలోనే అభ్యసించాలన్న ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కొట్టి వేసింది. ప్రాథమిక విద్యను అభ్యసించాలనుకునే భాషా అల్ప సంఖ్యాకులపై బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్ద కూడదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం. లోధా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఉత్తర్వులను వెలువరించడం ద్వారా సుమారు 20 ఏళ్ల వ్యాజ్యానికి తెర దించింది. నాలుగో తరగతి వరకు నిర్బంధ కన్నడ మాధ్యమాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రాష్ర్ట ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల మధ్య 1994 నుంచి ఈ న్యాయ పోరాటం సాగుతోంది. తల్లిదండ్రుల ఇష్టం తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకోవాలనే విషయమై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రాథమిక విద్యను విధిగా కన్నడ మాధ్యమంలోనే అభ్యసించాలన్న రాష్ట్ర ప్రభుత్వ భాషా మాధ్యమ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు 2008 జులై 2న వెలువరించిన తీర్పును సమర్థించింది. ప్రాథమిక విద్యలో కన్నడ మాధ్యమాన్ని నిర్బంధం చేయడం సరికాదని, సమంజసమూ కాదని పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల సమాఖ్య కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భిన్నాభిప్రాయాలు సుప్రీం కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జాగ్రత్తగా స్పందించారు. సాహితీవేత్తలు ఈ తీర్పు పట్ల విచారం వ్యక్తం చేశారు. తీర్పు ప్రతి చేతికందాక, పూర్తిగా అధ్యయనం చేసి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా సుప్రీం తీర్పు భాషా మాధ్యమ ఉద్యమానికి విఘాతం కాాబోదని పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, సాహితీవేత్తలతో చర్చించి తదుపరి న్యాయ పోరాటంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భాషా పరంగా చూస్తే ఈ తీర్పు దురదృష్టకరమని పేర్కొన్నారు. తీర్పు అమలైతే భాషల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ద్వారా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు గెలిచినట్లు భావించరాదని అన్నారు. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లు కూడా కాదని తెలిపారు. సీనియర్ పరిశోధకుడు చిదానంద మూర్తి ఈ తీర్పు హాస్యాస్పదమని అన్నారు. మన సంస్కృతి బతికి బట్ట కట్టాలంటే మాతృ భాషలోనే ప్రాథమిక విద్యను బోధించాలని తెలిపారు. వేరే భాషల్లో బోధన వల్ల కన్నడం నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పారు. ‘ఒక వేళ నాకు అధికారం లభిస్తే దేశంలో ఆంగ్ల మాధ్యమాన్ని పెకిలించి వేస్తాను. మాతృ భాషలోనే విద్యా బోధన సాగాలని ఉత్తర్వులు జారీ చేస్తాను’ అని జాతి పిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. కాగా ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం, కోర్టుల్లో రివ్యూ పిటిషన్లను దాఖలు చేస్తామని కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు పుండలీక హాలంబి తెలిపారు. ఈ తీర్పును ఒప్పుకోవడం సాధ్యం కాదని కన్నడ చళువలి నాయకుడు వాటాళ్ నాగరాజ్ పేర్కొన్నారు. -
వీడిన ఉత్కంఠ
సాక్షి, ఖమ్మం : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 2న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు తీర్పుతో మరో వారం రోజులు వాయిదా పడింది. లెక్కింపుపై కోర్టు తీర్పు కీలకం కావడంతో బుధవారమే ఉంటుందేమోననే ఆతృతతో జిల్లాలో ‘పుర’బరిలో నిలిచిన అభ్యర్థు లు, నేతలు మంగళవారం టీవీలకు అతుక్కుపోయా రు. ఈనెల 30న కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలకు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2న వెలువడుతాయని ఇటు అధికారులు, అటు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దీనిపై హైకోర్టులో తీర్పు ఉన్న నేపథ్యంలో ఏమవుతుందోనని అభ్యర్థులు ఆందోళన చెందారు. చివరకు ఈనెల 9న కౌంటింగ్ చేపట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడితే ఆ ప్రభావం స్థానికఎన్నికలపై పడుతుందని కొన్ని పార్టీలు భావిస్తే.. మరికొన్ని పార్టీలు మాత్రం ఈ ఫలితాలతో వచ్చే ఎన్నికల్లో దూసుకుపోవచ్చని అంచనాకు వచ్చాయి. ఇదేం ట్విస్టు..? మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ 9న వెలువడితే రానున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపవా..? అని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 9న అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడం, అదేరోజున ఫలితాలు వెలువడనుండడంతో ఆయా అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి ట్విస్టు పెట్టకుండా 2నే ఫలితాలు ప్రకటిస్తే బాగుండేదని పార్టీల నేతలు, పుర బరిలో నిలిచిన అభ్యర్థులు అంటున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల జాతకం.. కౌంటింగ్ ఎప్పుడన్నది అటుంచితే.. ఈవీఎంలలో దాగి ఉన్న అభ్యర్థుల జాతకంపైనే మున్సిపాలిటీల్లో జోరుగా చర్చ సాగుతోంది. అభ్యర్థులు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను పక్కన పెట్టుకొని ఎన్ని ఓట్లు తమకు పడ్డాయో లెక్కేసుకుంటున్నారు. తమ విజయం తథ్యమని ఎవరికి వారు భావిస్తున్నా.. ఈవీఎంలలో ఉన్న జాతకం అనుకూలంగా ఉంటుందో, లేదోననే హైరానా కూడా వారిని వెంటాడుతోంది. బారీగా ఖర్చు చేసి చివరకు ఓటమి పాలైతే తమ పరిస్థితి ఏంటని తమ అనుచర నేతల వద్ద మొర పెక్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థుల విజయంపై ఎవరికి వారు భారీగా పందేలు కాస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందులో ఈ పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. ఫలితాలకు మరో వారం రోజులు గడువు ఉండడంతో ఎన్నికలు జరిగిన నాలుగు చోట్ల ఇంకా పందేలు జోరందుకోనున్నాయి. పీఠంపై ఎవరిధీమా వారిదే.. మున్సిపల్ చైర్మన్ పీఠంపైనే అన్ని పార్టీలు కన్నేశాయి. అంతటా 70 శాతం పైనే పోలింగ్ నమోదు కావడంతో ఎవరికివారు తమ పార్టీకే చైర్మన్ పీఠం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. సత్తుపల్లి, మధిర కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడడంతో ఇక్కడ గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగా పోలింగ్ నమోదయింది. ఈ పరిస్థితితో అన్ని పార్టీలు చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నాయి. అభ్యర్థులు కూడా అన్ని వార్డుల్లో నువ్వా..నేనా..? అన్నట్లుగా తలపడ్డారు. ఫలితాలు వెలువడకముందే చైర్మన్ అభ్యర్థి ఎవరన్న దానిపై అప్పుడే తెరచాటు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొన్ని పార్టీల్లో చైర్మన్ అభ్యర్థి నువ్వే.. అని జిల్లా నేతలు చెప్పడంతో, ఆర్థికంగా లేని వార్డు సభ్యులకు సదరు అభ్యర్థులు ఖర్చు చేశారు. దీంతో ఇలా ఖర్చు చేసిన వారంతా తమదే చైర్మన్ పీఠం అన్న ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. ఎక్కువ పోలింగ్ నమోదు కావడంతో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమా..? అనుకూలమా..? అన్నది ఇటు సీనియర్ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. భారీ పోలింగ్ నమోదు తమకే అనుకూలమని, చైర్మన్ పీఠం తమదేనని నేతలు అంచనాల్లో మునిగారు.