Taapsee Pannu: ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పుపై తాప్సీ అసహనం

Taapsee Pannu Tweet On Chhattisgarh High Court Judgement Over Molestation Case - Sakshi

Taapsee Pannu Strongly Reacts to Chhattisgarh HC Order: స్టార్‌ హీరోయిన్‌ తాప్సీ పన్ను షూటింగ్స్‌తో ఎంత బిజీ ఉన్న సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలపై జరిగే దాడులు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తారు. తాజాగా అలాంటి ఘటనపై తాప్సీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం కేసులో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా అయ్యింది. ‘అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది’ అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేశారు. 

చదవండి: ఆ స్టార్‌ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్‌!

కాగా భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడిన కేసులో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు నిన్న(గురువారం) సంచలన తీర్పు వెలువరించింది. వివాహం చేసుకున్న భార్య ఇష్టానికి విరుద్దంగా, బలవంతంగా శృంగారం చేస్తే చట్ట ప్రకారం నేరం కాదని, అది అత్యాచారం కిందికి రాదంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేగాక ఈ కేసులో భర్తను నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌కే చంద్రవంశీ తీర్పు వెలువరించారు. దీంతో ఛత్తీస్‌గడ్‌ ఇచ్చిన ఈ తీర్పుపై తాప్సీతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాయనీ  సోనా మొహపాత్రా కూడా ట్వీట్‌ చేస్తూ  హైకోర్టు తీర్పును వ్యతిరేకించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top