మహిళాశిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ల నిర్వహణలో కొంతకాలంగా నెలకొన్ని గందరగోళానికి సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెరపడింది. టెండర్లను ఎలాగైనా దక్కించుకోవాలని ఆశించిన ట్రేడర్లకు హైకోర్టు తీర్పు షాకిచ్చినట్టయింది. నిబంధనల ప్రకారం గుట్ల సరఫరా టెండర్లలో కోళ్ల ఫారాలున్న రైతులే పాల్గొనాలని చెప్పింది. వాస్తవానికి రెండు నెలల క్రితం జిల్లాలోని 20 ఐసీడీఎస్ ప్రాజె
పౌల్ట్రీరైతులే టెండర్లలో పాల్గొనాలి
Sep 26 2016 11:42 PM | Updated on Sep 1 2018 5:05 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : మహిళాశిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల టెండర్ల నిర్వహణలో కొంతకాలంగా నెలకొన్ని గందరగోళానికి సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెరపడింది. టెండర్లను ఎలాగైనా దక్కించుకోవాలని ఆశించిన ట్రేడర్లకు హైకోర్టు తీర్పు షాకిచ్చినట్టయింది. నిబంధనల ప్రకారం గుట్ల సరఫరా టెండర్లలో కోళ్ల ఫారాలున్న రైతులే పాల్గొనాలని చెప్పింది. వాస్తవానికి రెండు నెలల క్రితం జిల్లాలోని 20 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
కాగా, గతంలో సరఫరా చేసిన ట్రేడర్లు హైకోర్టును ఆశ్రయించి తమకూ అవకాశం కల్పించాలని కోరారు. దీంతో టెండర్ల ఖరారు ప్రక్రియ రెండుసార్లు ఆగిపోయింది. దీంతో ఈ కేంద్రాలకు గుడ్ల సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఆయా మండలాల్లో స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న కాంట్లాక్టర్ల ద్వారా అధికారులు సరఫరా చేయించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో టెండర్ల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇక ఎలాంటి అడ్డంకులు లేవని వెంటనే టెండర్ల ప్రక్రియను నిర్వహించి అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరాను పునరుద్ధరిస్తామని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోత్సS్న తెలిపారు.
Advertisement
Advertisement