బతికి ఉన్న భర్తకు రిప్‌ (RIP)..! | Karnataka Woman Allegedly Posts RIP On Husband Photo After Separation, More Details Inside | Sakshi
Sakshi News home page

బతికి ఉన్న భర్తకు రిప్‌ (RIP)..!

May 16 2026 7:58 AM | Updated on May 16 2026 10:31 AM

Wife RIP WhatsApp Status Husband

కర్ణాటక: నేటి డిజిటల్‌ యుగంలో కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. చిన్న కారణాలకే విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే మాదిరిగా ఓ భార్య.. భర్తను వదిలేసి అతని ఫోటో మీద రెస్ట్‌ ఇన్‌ పీస్‌ (ఆర్‌ఐపీ) అని రాసింది. వివరాలు.. 9 ఏళ్ల కిందట ఇక్కడి సాగానహళ్ళిలోని అనూజకు శిడ్లఘట్ట తాలూకా దొడ్డతేకనహళ్ళి కుమార్‌తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూజా పల్లెలో అత్తమామలను వదిలి బెంగళూరు దేవనహళ్ళిలో భర్తతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నారు.  

పుట్టింటికి వచ్చేసి పోస్టింగులు  
భర్త కారు డ్రైవర్‌ కాగా, భార్య విలాసవంత జీవనం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. కొన్నిరోజుల కిందట అనూజ భర్తను వదిలేసి పుట్టిల్లయిన సాగానహళ్ళికు వచ్చింది. భర్త ఫోను చేసి కాపురానికి రావాలన్నా అనూజ తిరస్కరించింది. పైగా సోషల్‌ మీడియాలో.. భర్త ఫోటో పెట్టి రిప్‌ అని రాసింది. దీంతో కోద్రిక్తుడైన కుమార్‌ బంధుమిత్రులతో వచ్చి భార్యను నిలదీశాడు. అనూజ, ఆమె అన్న కలిసి కారంపొడి చల్లి చితకబాదడంతో కుమార్, అతని బంధువుల గాయపడ్డారు. బాధితులు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement