సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. భార్య రేణుకను భర్త విద్యాసాగర్ గొంతు నులిపి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో దారిలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగ్గా.. రఘునాథపాలెం సమీపంలో కారులోనే భార్యను భర్త హత్య చేశాడు.
భార్యను హతమార్చిన అనంతరం ఇల్లెందులోని బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానంటూ విద్యాసాగర్ చెప్పినట్లు సమాచారం. ప్రగతి స్కూల్ సమీపంలో కారును పక్కకు ఆపిన విద్యాసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు విద్యాసాగర్‌కు ఇది రెండో వివాహం కాగా, మృతురాలు రేణుకతో కేవలం నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. సంచలనం సృష్టించిన ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


