కరీంనగర్: మెట్‌పల్లి పట్టణంలోని బస్‌డిపో చౌరస్తాలో బుధవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన సదరు వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. అతడిని తీసుకెళ్లడానికి వెనుక భార్య రాగా.. చౌరస్తాలో ఆమెను కొట్టాడు. అదే సమయంలో ఆటు వైపు వచ్చిన అర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌ను దూషించాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తర్వాత కుటుంబ సభ్యులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్ డిపో వద్ద మందుబాబు వీరంగం
RTC రాజదాని బస్సును అడ్డుకుని.. డ్రైవర్ పై దాడికి యత్నం
అడ్డుకోబోయిన భార్యపై కూడా దాడి చేసిన మందుబాబు
వారించే ప్రయత్నం చేసిన వారిపై సైతం దాడికి యత్నం pic.twitter.com/LwMq9FOfSE— PulseNewsBreaking (@pulsenewsbreak) September 9, 2026


