ఫ్యూచర్‌ సిటీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. కొండల్‌ రెడ్డి భూముల పరిశీలన | BRS MLA's Meeting And Tukkuguda Land Visit Updates | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ సిటీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. కొండల్‌ రెడ్డి భూముల పరిశీలన

Sep 10 2026 10:49 AM | Updated on Sep 10 2026 12:22 PM

BRS MLA's Meeting And Tukkuguda Land Visit Updates

బీఆర్‌ఎస్‌ నేతల ఫ్యూచర్‌ సిటీ పరిశీలన అప్‌డేట్స్‌..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్‌..

  • రూ.200 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే టెస్సరాక్ట్ కంపెనీకి కేటాయించారు.
  • టెస్సరాక్ట్ కంపెనీ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిది.
  • ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేనేలేదు.
  • ఫ్యూచర్ సిటీ భూములను రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొల్లగొడుతున్నారు
  • రేవంత్‌ భూ దోపిడిని ప్రజా కోర్టులో నిలదీస్తాం.
  • టెస్సరాక్ట్ కంపెనీకి కేటాయించిన భూమిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాము.
  • శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేస్తే సభకు హాజరు అవుతాము.
  • 22-A అంశం లేవనెత్తుతామనే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
  • సంధ్యా రావు అనే ఫేక్ అకౌంట్ సృష్టించిందే కాంగ్రెస్ సోషల్ మీడియా.
  • విచారణ చెయ్యాల్సి వస్తే ఫేక్ అకౌంట్‌పై విచారణ చేయాలి. 

 

శాసనమండలిలో ఆందోళన.. 

  • మరోవైపు.. భూముల విషయంలో శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన
  • మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌
  • బీఆర్‌ఎస్ సభ్యులు చేసే ప్రస్తావన సరైన మార్గంలో వస్తే అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
  • భూముల అంశం విషయంలో వారు పేర్కొంటున్న పేరు ఆ వివాదంలో లేదు.
  • మీరు ప్రశ్న రూపంలో వస్తే దానిపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం
  • సభలో దేశపతి పాటలు పాడటం సరికాదు.
  • ప్రభుత్వాన్ని అడగలేక పాటలు పడుతున్నారు.
  • సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెబుతుంది.

 

  • ఫ్యూచర్‌ సిటీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మె‍ల్యేలు

  • టెస్సరాక్ట్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భూముల పరిశీలన.

 

👉తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. అసెంబ్లీ పరిణామాలపై చర్చించేందుకు కేటీఆర్‌ నివాసంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. భేటీ అనంతరం ఎమ్మెల్యేలు నేరుగా తుక్కుగూడకు బయలుదేరుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి సంబంధం ఉందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్న టెస్సరాక్ట్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భూముల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు.

👉తుక్కుగూడ–రవిర్యాల పరిధిలో ప్రభుత్వ భూముల కేటాయింపుపై బీఆర్‌ఎస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే అప్పనంగా కట్టబెట్టారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం కూడా లేని కంపెనీకి ఇంత విలువైన భూములను ఎలా కేటాయిస్తారని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. కంపెనీ ఆర్థిక స్థితి, భూముల కేటాయింపు ప్రక్రియ, ప్రభుత్వ నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించేందుకే ఎమ్మెల్యేలు తుక్కుగూడకు వెళ్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, భూముల కేటాయింపులో జరిగిన అంశాలను ప్రజల ముందుంచాలని పార్టీ భావిస్తోంది.

👉ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌, మహిళా ఎమ్మెల్యేల వ్యవహారం, ఫేక్‌–ఏఐ కంటెంట్‌ తదితర అంశాలపై కూడా కేటీఆర్‌ నివాసంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించడం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అంశాలపైనా బీఆర్‌ఎస్‌ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.

👉మరోవైపు టెస్సరాక్ట్‌ భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలను మంత్రి డి.శ్రీధర్‌బాబు ఖండించారు. సంస్థకు సీఎం సోదరుడితో సంబంధం లేదని, భూముల కేటాయింపు నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ నివాసంలో భేటీ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తుక్కుగూడ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ.200 కోట్ల భూమి రూ.7 కోట్లకే ఎలా?.. టెస్సరాక్ట్‌ భూములపై బీఆర్‌ఎస్‌ పోరాటం ఏ మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement